హాలీవుడ్ ప్రముఖ దర్శకుడు జేమ్స్ కామెరూన్ తెరకెక్కించిన అవతార్ సీక్వెల్ అవతార్ 2 ప్రపంచవ్యాప్తంగా డిసెంబర్ 16న విడుదల కానుంది. ఇండియాలో ఈ సినిమాపై చాలా ఆసక్తి నెలకొంది. ఓ రాష్ట్రంలో మాత్రం బ్యాన్ పడింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

దాదాపు 13 ఏళ్ల విరామం తరువాత అవతార్ సీక్వెల్‌గా అవతార్ ది వే ఆఫ్ వాటర్‌గా అవతార్ 2 విడుదలవుతోంది. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాపై పెద్దఎత్తున ఆసక్తి నెలకొంది. అవతార్ మొదటి భాగంలానే ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల్ని మెప్పించేందుకు అవతార్ 2 సిద్ధమైంది. ఈ క్రమంలో కేరళలో మాత్రం ఈ సినిమాకు ఎదురుదెబ్బ తగిలింది. కేరళలో ఈ సినిమాను ప్రదర్శించకూడదని..ది ఫిల్మ్ ఎగ్జిబిటర్స్ యునైటెడ్ ఆర్గనైజేషన్ ఆఫ్ కేరళ నిర్ణయించింది. 


కేరళలో అవతార్ 2పై ఎందుకీ నిర్ణయం


కేరళలో ఈ సినిమాను నిషేధించడం లేదని..కానీ ప్రదర్శించకూడదని నిర్ణయం తీసుకున్నట్టు ఎఫ్ఈయూఓకే అధ్యక్షుడు విజయ్ కుమార్ వెల్లడించారు. అవతార్ 2 సినిమా లాభాల్లో వాటాలపై చర్చలు సఫలం కాకపోవడమే దీనికి కారణమన్నారు. థియేటర్ యజమానులు, డిస్ట్రిబ్యూటర్ల మధ్య ఒప్పందం కుదరకపోవడంతో అవతార్ 2 విడుదల కాదన్నారు.


డిస్ట్రిబ్యూటర్లు , థియేటర్ యజమానుల మధ్య వివాదం నడుస్తోంది. అవతార్ 2 సినిమా మొదటి వారం కలెక్షన్లలో 60 శాతం డిస్ట్రిబ్యూటర్లు అడుగుతుంటే..థియేటర్ యజమానులు మాత్రం 55 శాతం ఇస్తామనడంతో ఒప్పందం కుదరలేదు. అవతార్ 2 సినిమా ప్రపంచవ్యాప్తంగా 160 భాషల్లో విడుదలవుతోంది. 


Also read: Adivi Sesh HIT 2 Collections : HIT 2 ప్రభంజనం.. అడ్వాన్స్ బుకింగ్స్‌లోనే రికార్డ్.. వసూళ్ల వర్షం



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook