Avika Gor Harassed Sexually: 2013లో ఉయ్యాల జంపాలాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది హీరోయిన్ అవికా గోర్. బాలికా వధు అనే టీవీ షోలో ఆనంది పాత్రలో నటించి.. ఎంతో పేరు తెచ్చుకుంది. ఆ తరువాత ఈ సీరియల్ తెలుగులో చిన్నారి పెళ్లికూతురుగా ప్రసారమయింది. కాగా రాజ్ తరుణ్ హీరోగా చేసిన.. ఉయ్యాల జంపాల సినిమాతో టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలోకి ప్రవేశించింది. ఆ తర్వాత ఆమె పలు సినిమాలో, టీవీ షోలలో కనిపించి మెప్పించింది. కాగా ఈ మధ్య ఒక ఇంటర్వ్యూకి అటెండ్ అయిన ఈ హీరోయిన్.. తన బాడీగార్డు వల్ల తాను ఎదురుకున్న లైంగిక వేధింపుల గురించి చెప్పి అందరిని షాక్ కి గురి చేసింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కజక్‌స్థాన్‌లో జరిగిన ఒక ఈవెంట్‌లో.. తనకి ఒక చేదు అనుభవం ఎదురయిందని అవికా చెప్పింది. వేదికపైకి వెళుతున్నప్పుడు తన బాడీగార్డ్‌ అనుచితంగా తనని తాకినట్లు చెప్పుకొచ్చింది ఈ హీరోయిన్. ఈ సంఘటన తనని షాక్‌కి గురి చేసిందని చెప్పింది.


అవికా మాట్లాడుతూ, "ఆ రోజు కజక్‌స్థాన్‌లో ఒక ఈవెంట్ కోసం వెళ్లాను. కారు దిగి నడుస్తున్న సమయంలో.. నాకు ఎవరో నన్ను వెనక నుంచి నన్ను తాకినట్లు అనిపించింది. కానీ వెనక్కి తిరిగి చూస్తే బాడీగార్డ్‌ మాత్రమే అక్కడ ఉన్నాడు. సర్లే అనుకోకుండా.. ఇలా ఏమన్నా జరిగిందేమోనని.. అనుకున్నాను. అయితే మళ్లీ వేదికపైకి వెళ్తున్నప్పుడు కూడా.. మరోసారి అభ్యంతరకరంగా నన్ను తాకాలని ట్రై చూశాడు. దీంతో నేను వెంటనే చేయి పట్టుకుని.. ఏం చేస్తున్నావని అతన్ని నిలదీశాను. దీంతో అతను సారీ చెప్పాడు. నేను కూడా ఏం చేయలేక ఆ ఘటనను అక్కడితో ఇక వదిలేశాను” అని చెప్పుకొచ్చింది. 


ఆ తరువాత మాట్లాడుతూ..”నాకు కానీ ఎక్కువ.. ధైర్యం ఉంటే ఇలా చేసిన చాలామందిని ఇప్పటికే నేను కొట్టేదాన్ని. అయితే అప్పట్లో అంత ధైర్యం నాకు లేదు. కానీ ప్రస్తుతం మాత్రం అలాంటి సంఘటనలు ఎదురైతే కచ్చితంగా ఎదురుతిరుగుతాను. ఇప్పుడు నాకు ఆ ధైర్యం వచ్చింది. అప్పటితో పోలిస్తే ఇప్పుడు పరిస్థితులు కూడా చాలా వరకు మారాయి. ఇప్పుడు అలా ఎవరూ ప్రవర్తించడం లేదు. కానీ ఇలాంటి పనులు చేసేవాళ్లు ఒకటి గుర్తుపెట్టుకోవాలి. మీరు చేసే కొన్ని పనులు వల్ల..బాధితులపై తీవ్ర ప్రభావం చూపుతాయి. అది మీరు గుర్తుంచుకోవాలి." అంటూ అవికా చెప్పుకొచ్చింది.



ప్రస్తుతం ఈ హీరోయిన్ తేజ్, కహానీ రబ్బర్‌బ్యాండ్, బ్లడీ ఇష్క్,‌ 1920: హారర్స్ ఆఫ్ ది హార్ట్ వంటి.. అనేక బాలీవుడ్ చిత్రాలతో బిజీగా ఉంది.  ఇక తెలుగు విషయానికి వస్తే.. గత సంవత్సరం అవిక 'వధువు', 'మేన్షన్ 24' వెబ్ సిరీస్‌లలో కనిపించింది. హాట్ స్టార్‌లో ప్రసారం అవుతున్న ఈ రెండు.. వెబ్ సిరీస్‌ ఫర్వాలేదనిపించాయి. అలానే ఉమాపతి అనే తెలుగు సినిమాలో అవికా చివరిగా కనిపించింది. ఇక ఫ్యూచర్లో తెలుగులో మళ్లీ హీరోయిన్ గా ..కనిపిస్తుందో.. లేదో.. తెలియాలి అంటే మరి కొద్ది రోజుల్లో వేచి చూడాలి.


Read more: Chandrababu naidu: ఐదేళ్లుగా శపథం.. చంద్రబాబు సీఎం అయ్యాకే పుట్టింట్లో కాలు పెట్టిన మహిళ.. వీడియో వైరల్..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter