Baby Movie 1st Day Collections: టాలీవుడ్ యంగ్ హీరో ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య జంటగా నటించిన చిత్రం బేబీ. విరాజ్ అశ్విన్ ఓ కీలకపాత్రలో నటించాడు. సాయి రాజేష్ దర్శకత్వం వహించిన ఈ సినిమా జూలై 14న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తొలి రోజే హిట్ టాక్ సొంతం చేసుకున్న ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్లు కూడా బాగానే రాబట్టింది. ట్రైయాంగిల్ లవ్ స్టోరీగా వచ్చిన ఈ సినిమా మొదటి రోజు నుంచి అన్ని ఏరియాల్లో హౌస్ ఫుల్ కలెక్షన్స్‏తో దూసుకుపోతుంది. సామజవరగమన తర్వాత తెలుగు ఇండ్రస్ట్రీకి బేబీ మంచి బూస్ట్ ఇచ్చే సినిమా అవుతుంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఫస్ట్ డే కలెక్షన్స్ పరంగా చూస్తే.. తొలి రోజు ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద రూ.7.1 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ కలెక్ట్ చేసినట్లు తెలుస్తోంది. ఎలాంటి అంచనాలు లేకుండా రిలీజైన ఈ సినిమాకు ఊహించని స్థాయిలో రెస్పాన్స్ వస్తుంది. తొలి రోజు ఈ సినిమా భారీ ఓపెనింగ్స్ రాబట్టాయి. తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా రూ.4కోట్లు పైగానే గ్రాస్ వసూలు చేసినట్లు సమాచారం. ఓవర్సీస్ లో దాదాపు రూ.80 లక్షల వరకు రాబట్టింది. ఇప్పటివరకు రూ.7 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టిన తెలుస్తోంది. వీకెండ్ కావడంతో శని, ఆదివారాల్లో కూడా కలెక్షన్లు మరింత పెరిగే అవకాశం ఉంది. 


ఈ సినిమాలో ఆనంద్ దేవరకొండ, వైష్ణవి తమ నటనతో కన్నీళ్లు తెప్పించారు. ముఖ్యంగా క్లైమాక్స్ సీన్స్ లో ప్రతి ఒక్కరూ కంతతడి పెట్టకుండా ఉండలేరు. తొలి సినిమా అయిన వైష్ణవి తన నటనతో ఆకట్టుకుంది. బేబీ ఓటీటీ ఫ్లాట్ ఫామ్ కూడా ఫిక్స్ అయింది. ఆగస్టులో ఈ సినిమా ఓటీటీలోకి వచ్చే అవకాశం ఉంది. ఈ మూవీ డిజిటల్ రైట్స్ ను ప్రముఖ ఓటీటీ సంస్థ ఆహా దక్కించుకుంది. 


Also Read: Shankar-Vijay Combo: రిపీట్ కానున్న దళపతి విజయ్ - డైరెక్టర్ కాంబో..!



 స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook