SKN Father Death: బేబీ సినిమాతో నిర్మాతగా మంచి పేరు తెచ్చుకున్న ఎస్.కే.ఎన్ ఇంట తీవ్ర విషాదం నెలకొంది. తాజాగా ఎస్.కే.ఎన్ తండ్రి కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఎస్.కే.ఎన్ ఫాదర్ సుర్యప్రకాష్ రావు హైదరాబాద్ లో తుదిశ్వాస విడిచారు. దీంతో ఆయన మృతికి పలువురు సినీ ప్రముఖులు సంతాపం ప్రకటిస్తున్నారు. ఈ నేపథ్యంలో సితార నాగవంశీ ఎస్ కే ఎన్‌కు ధైర్యాన్ని చెప్పారు. ఈ సందర్భంగా ఆయన కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని ప్రకటించారు. ఇవాళ సాయంత్రం 4 గంటలకు ఫిలింనగర్ దగ్గర్లో ఉన్న మహాప్రస్థానంలో ఆయన అంత్యక్రియలు జరుగుతాయని ఎస్.కే.ఎన్ కుటుంబ సభ్యులు తెలిపారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మెగాస్టార్ అభిమానిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చాడు ఎస్.కే.ఎన్. చిన్నపాటి డిస్ట్రిబ్యూటర్ గా మెుదలుపెట్టి.. నిర్మాత స్థాయికి ఎదిగాడు ఎస్.కే.ఎన్. ప్రొడ్యూసర్ గా విజయ్ దేవరకొండతో కలిసి టాక్సీవాల సినిమా నిర్మించాడు ఎస్.కే.ఎన్. ఆ సినిమా యావరేజ్ టాక్ తెచ్చుకుంది. ఆ తర్వాత  ఎస్.కే.ఎన్.. బేబీ సినిమాను నిర్మించి బ్లాక్ బాస్టర్ సక్సెస్ అందుకున్నాడు. ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య, విరాజ్ ఆశ్విన్ లీడ్ రోల్స్ లో నటించిన ఈ సినిమా సూపర్ సక్సెస్ సాధించింది. ముఖ్యంగా ఆనంద్, వైష్ణవిల నటనకు యూత్ ఫిదా అయింది. దీంతో థియేటర్లన్నీ హౌస్ పుల్ బోర్డులతో కళకళ్లాడాయి. 


చిరంజీవి, అల్లు అర్జున్ వంటి స్టార్ హీరోల సైతం వీరి నటనను మెచ్చుకున్నారు. చిన్న సినిమాగా వచ్చిన బేబీ మూవీ బాక్సాఫీస్ వద్ద రూ. 96 కోట్ల కలెక్షన్స్ ను రాబట్టింది. దీంతో ఇందులో నటించిన హీరోహీరోయిన్స్ కు వరుస ఆఫర్లు క్యూ కట్టాయి. ప్రస్తుతం ఎస్.కే.ఎన్.. మారుతి, రాహుల్ సాంకృత్యాన్, సాయి రాజేష్ లాంటి విజయవంతమైన దర్శకులతో సినిమాలు చేయడానికి రెడీగా ఉన్నారని తెలుస్తోంది.


Also Read: Salaar 2 Update: 'సలార్ 2.. గేమ్ ఆఫ్ థ్రోన్స్ లా ఉంటుంది'.. రిలీజ్ డేట్ ఇదే..: నిర్మాత



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook