Venu Yeldhandi about Chiranjeevi బలగం డైరెక్టర్ వేణు ఇప్పుడు అందరి నోళ్లలో నానుతున్నాడు. ఒకప్పుడు కడుపుబ్బా నవ్వించిన కమెడియన్.. బలగం సినిమాతో అందరినీ ఏడిపించాడు. వేణులో ఇంత ఘాడత, ఎమోషన్స్ ఉన్నాయా? అని అంతా ఆశ్చర్యపోయారు. వేణు దెబ్బకు బాక్సాఫీస్ సైతం వణికి పోయింది. చిన్న సినిమాగా వచ్చి పెద్ద హిట్టుగా నిలిచింది. దిల్ రాజు నమ్మకం మరోసారి నిజమైంది. కథ బాగుంటే.. సినిమా ఆడుతుందనే నమ్మకమే నిజమైంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

డైరెక్టర్ వేణు బలగం సినిమాను చిత్రీకరిస్తూ ఉండగానే.. చిరంజీవి మెహర్ రమేష్ భోళా శంకర్ సినిమాలో నటిస్తున్నాడు. సిరిసిల్లలో షూటింగ్ చేయాల్సిన సమయంలోనే.. ఇటు చిరంజీవి భోళా శంకర్ సినిమాకి కూడా షూటింగ్ చేయాల్సి వచ్చిందట. చిరంజీవి భోళా శంకర్ కోసం ఇచ్చిన రెండ్రోజుల డేట్ కాకుండా.. ఇంకో ఒక్క రేజ్ ఎక్స్ ట్రాగా ఉండాల్సి వచ్చిందట.


భోళా శంకర్‌ సెట్‌లో ఒక రోజు ఎక్స్ ట్రా ఉంటే.. సిరిసిల్లలో చేయాల్సిన షూటింగ్ లేట్ అవుతుంది ఎలా అంటూ వేణు కంగారు పడుతూ ఉన్నాడట. ఆ విషయాన్ని గమనించిన చిరంజీవి స్వయంగా దిల్ రాజుకు ఫోన్ చేసి పర్మిషన్ తీసుకున్నాడట. వేణు ఒక రోజు ఇక్కడే ఉంటాడు.. కాస్త అడ్జస్ట్ చేసుకోండని దిల్ రాజును రిక్వెస్ట్ చేశాడట. దిల్ రాజు కూడా వెంటనే ఒప్పేసుకున్నాడట.


అలా తన ప్రాబ్లంను గమనించి, తన ప్రాబ్లం గురించి దిల్ రాజుతో స్వయంగా చిరంజీవి మాట్లాడటం చూసి ఎమోషనల్ అయ్యాడట. కాళ్ల మీద పడిపోతూ ఉంటే.. వద్దని సినిమా బాగా తీయమని ప్రోత్సహించాడట. ఎలాంటి టెన్షన్ లేకుండా నటించమని ఎంకరేజ్ చేశాడట. మొత్తానికి వేణు మాత్రం టాలీవుడ్‌లో తన మార్క్‌ వేశాడు. దిల్ రాజు ప్రొడక్షన్‌లోనే వేణు మరో సినిమాను కూడా చేయనున్నాడని టాక్.


Also Read:  Dasara Collection : రెండో రోజుకే బ్రేక్ ఈవెన్?.. దసరా మేనియా.. నాని రేంజ్ ఇదే


Also Read: Ameesha Patel Bikini : బికినీలో అమిషా పటేల్.. సీనియర్ భామ భారీ అందాల ప్రదర్శన



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook