Balagam Hero House Owner Comments on Director on Venu: కమెడియన్ వేణు దర్శకుడిగా బలగం సినిమా రూపొంది రిలీజ్ అయి సూపర్ హిట్ గా నిలిచిన సంగతి తెలిసిందే.  ప్రియదర్శి హీరోగా కావ్య కళ్యాణ్రామ్ హీరోయిన్ గా రుపొందిన సినిమా తెలంగాణ నేపథ్యంలోని పిట్ట ముట్టుడు సంప్రదాయం కథాంశంతో రూపొందించారు. ఈ సినిమా ఊహించని విధంగా చాలా తక్కువ బడ్జెట్ తోనే రూపొందిన భారీ లాభాలు అందుకుంటుంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇక ఈ సినిమా షూటింగ్ అంతా సిరిసిల్ల పరిసర ప్రాంతాల్లో జరిగిందనే విషయాన్ని ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లోనే సినిమా దర్శక, నిర్మాతలు వెల్లడించారు. అలాగే ఈ సినిమా షూటింగ్ జరిపిన లొకేషన్స్ కూడా చాలా పాపులర్ అయిపోయాయి. ఈ నేపథ్యంలో హీరో ఇల్లు బాగా ఫేమస్ అయిపోయింది. ఇక ఈ ఇంటిని షూటింగ్ కోసం ఇచ్చిన ఇంటి యజమాని రవీంద్రరావు తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ సినిమా డైరెక్టర్ వేణు తమ ఊరి వాడేనని చెబుతూ దిల్ రాజు గారు ఒక ఛాన్స్ ఇచ్చారు,


 బడ్జెట్ ఎక్కువ లేదు కాబట్టి మీరు సహాయం చేయాలని అడిగితే నా ఇల్లు షూటింగ్ జరుపుకునేందుకు ఇచ్చానని నెల 15 రోజులు పాటు తమ ఇంట్లోనే షూటింగ్ చేశారని చెప్పుకొచ్చారు, షూటింగ్ జరుపుతున్నంతవరకు తాము వేరే ఇంట్లో ఉన్నామని అయితే అలా ఉన్నందుకు కూడా వేణు దగ్గర తాము రూపాయి కూడా తీసుకోలేదని ఆయన వెల్లడించారు. అయితే ఈ సినిమా ఇంత పెద్ద హిట్ అవుతుందని అనుకోలేదని ఈ సినిమాలో తమ ఇల్లు కూడా భాగమవడం తమకు సంతోషం కలిగించిందని అని చెప్పుకొచ్చారు.


ఇది కూడా చదవండి: Nani Movie Fees: దసరా దెబ్బ..'బాంచత్' అనిపించేలా ఫీజు.. ఎన్ని కోట్లు పెరిగిందంటే?


ఇక ఈ సినిమా షూటింగ్ సమయంలో దిల్ రాజు ఎప్పుడూ ఇక్కడికి రాలేదు కానీ ఆయన కుమార్తె తమ్ముడు కొడుకు మాత్రం వచ్చారని సినిమా ఇంత పెద్ద హిట్ అయిన తర్వాత కూడా తమ వేణు కనీసం థాంక్స్ చెప్పలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. తమ ఫోన్ నెంబర్ ఆయన దగ్గర ఉన్న ఫోన్ కూడా చేయలేదని ఎందుకో సినిమా విడుదలైన తరువాత తాము వారికి గుర్తు రాలేదేమో అని అన్నారు.  అయితే ఆయన నుంచి తాము ఇవేమీ ఆశించలేదు కాబట్టి సినిమా అంటే ఇష్టంగా ఇల్లు ఇచ్చాను ఈ నేపథ్యంలో తమకు పబ్లిసిటీ కూడా అవసరం లేదంటూ రవీందర్రావు కామెంట్ చేయడం ఆసక్తికరంగా మారింది.


ఇది కూడా చదవండి: Sree Leela Fees: శ్రీలీల గంటకు అంత తీసుకుంటుందా?.. వామ్మో అనాల్సిందే


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook