Akhanda 2 Poster : నటసింహ నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్ మళ్ళీ మొదలైంది. ఇప్పటికే వీరి కాంబినేషన్ అనగానే హిట్ పక్కా అని అందరూ ఫిక్సయిన విషయం తెలిసిందే. ఇప్పటికే వీరి కాంబో లో సింహ,  లెజెండ్, అఖండ ఇలా మూడు సినిమాలు వచ్చి మూడూ ఘన విజయాన్ని సొంతం చేసుకున్నాయి. అంతేకాదు ఇద్దరి కాంబినేషన్ హ్యాట్రిక్ అందుకోవడంతో మళ్ళీ ఈ కాంబినేషన్ కోసం అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అందులో భాగంగానే అఖండ -2 ప్రకటించేశారు చిత్ర బృందం. నిజానికి గతంలోనే అఖండ చేసినప్పుడు అక్కడ సీక్వెల్ వస్తుందని ప్రకటించారు. కానీ ఇప్పటివరకు ఆ సినిమా ఊసే లేదు అని అభిమానులు నిరుత్సాహ పడేలోపే దసరా సందర్భంగా BB4 అంటూ దుర్గామాత పోస్టర్ తో సినిమాను ప్రకటించిన విషయం తెలిసిందే. ఇక నేడు ఘనంగా పూజా కార్యక్రమాలు రామానాయుడు స్టూడియోలో జరగబోతున్నాయి. 


ఈ నేపథ్యంలోనే తాజాగా అఖండ -2 టైటిల్ తో ఒక పోస్టర్ ను విడుదల చేశారు. 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై రామ్ ఆచంట,  గోపీచంద్ ఆచంట ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇప్పటికే హ్యాట్రిక్ అందుకున్న ఈ కాంబో మళ్లీ తెరపైకి రాబోతుండడంతో అంచనాలు అప్పుడే మొదలయ్యాయి.  ఈసారి మాస్ జాతర ఉండబోతుందని ఏకంగా పాన్ ఇండియా అనే కుంభస్థలాన్ని ఢీకొట్టబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. 


ఇకపోతే తాజాగా అఖండ -2 అంటూ పోస్టర్ రిలీజ్ చేస్తూ తాండవం అనే క్యాప్షన్ కూడా జోడించారు. ఇకపోతే ఈరోజు ఉదయం ఈ సినిమా పూజా కార్యక్రమాలు చాలా ఘనంగా జరగబోతున్న నేపథ్యంలో త్వరలోనే ఈ సినిమా షూటింగ్ కూడా ప్రారంభం కానుందని సమాచారం. పాన్ ఇండియా వైడ్ గా రిలీజ్ చేయబోతున్నారట.  అంతేకాదు బాలయ్యకు ఇదే మొదటి పాన్ ఇండియా సినిమా కావడంతో నందమూరి అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. 


ఇక ప్రస్తుతం బాలకృష్ణ, బాబి డైరెక్షన్లో తన 109వ చిత్రాన్ని తెరకెక్కిస్తూ ఉండగా ఈ సినిమా వచ్చే యేడాది సంక్రాంతి బరిలో జనవరి 12వ తేదీన విడుదల కాబోతోంది. ఇందులో సూపర్ హీరోగా మొదటిసారి బాలయ్య నటించబోతున్నట్లు సమాచారం.


 




Read more: Baba Siddique: బాబా సిద్ధీఖీ ఎవరు?... ఎన్సీపీ నేత హత్యకు నెల రోజుల ముందు నుంచి అంత జరిగిందా..?.. వెలుగులోకి విస్తుపోయే విషయాలు..


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.FacebookTwitter