Bhagavanth Kesari OTT release: ప్రస్తుతం తెలుగు సీనియర్ హీరోలలో వరసహిట్లతో దూసుకుపోతున్న ఏకైక హీరో బాలకృష్ణ. తన వయసుకు తగ్గ పాత్రలు చేస్తూ ప్రస్తుతం టాలీవుడ్ సీనియర్ హీరోలలో టాప్ వన్ పొజిషన్ లో దూసుకుపోతున్నారు ఈయన. కాగా అఖండ, వీరసింహారెడ్డి లాంటి సూపర్ హిట్ల తరువాత ఈ మధ్య దసరాకు భగవంత్ కేసరి తో మన ముందుకు వచ్చి హ్యాట్రిక్ సాధించాడు బాలయ్య.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కాగా ఇదే దసరాకి బాలకృష్ణ సినిమాతో పోటీగా మరో రెండు చిత్రాలు కూడా విడుదలయ్యాయి. అందులో ఒకటి తమిళ ఇండస్ట్రీ నుంచి వచ్చిన లియో సినిమా కాగా మరొకటి రవితేజ హీరోగా చేసిన టైగర్ నాగేశ్వరరావు. ఈ రెండు సినిమాలలో మన మాస్ మహారాజా సినిమా డిజాస్టర్ గా మిగిలింది. ఇక విజయ్ హీరోగా లోకేష్ కనగరాజు దర్శకత్వంలో వచ్చిన లియో సినిమా నెగిటివ్ రెస్పాన్స్ సొంతం చేసుకున్న కలెక్షన్స్ పరంగా మాత్రం దూసుకుపోయింది. కాగా ఈ మూడు సినిమాలను ప్రేక్షకుల దగ్గర నుంచి పాజిటివ్ రెస్పాన్స్ తెచ్చుకునింది మాత్రం మన బాలకృష్ణ సినిమా భగవంత్ కేసరి మాత్రమే..


కానీ ఇప్పుడు మిగతా రెండు చిత్రాలకి ఒక క్లారిటీ వస్తే మన బాలయ్య సినిమాకి మాత్రం క్లారిటీ లేకుండా పోయింది. ఇంతకీ ఏమిటి ఆ క్లారిటీ అనుకుంటున్నారా.. ఈ చిత్రం ఎప్పుడు ఓటీటిలోకి వస్తుంది అని. దసరాకు వచ్చిన టైగర్ నాగేశ్వరరావు మొన్న శుక్రవారం నుంచి అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ మొదలుపెట్టగా తాజాగా లియోని ఈ నెల 24 నుంచి అందుబాటులో ఉంచుతున్నట్టు ఈరోజు ఉదయమే నెట్ ఫ్లిక్స్ అఫీషియల్ గా అనౌన్స్ చేసింది. దీంతో ఈ రెండు సినిమాల ఓటీటీ గురించి క్లారిటీ ప్రేక్షకుల్లో వచ్చేసింది.



కాగా ఈ విషయంలో క్లారిటీ రానిది బాలకృష్ణ సినిమా పైన మాత్రమే. శ్రీ లీల బాలకృష్ణ కూతురు వరసలో కనిపించిన ఈ ఎమోషనల్ యాక్షన్ డ్రామా అయిదో వారంలో అడుగు పెట్టాక కూడా ఇంకా కొన్ని థియేటర్స్ లో జోరుని కొనసాగిస్తోంది. దీని తర్వాత మంగళవారం సినిమా మినహా ఏ తెలుగు చిత్రం పెద్దగా పాజిటివ్ రెస్పాన్స్ సొంతం చేసుకోకపోవడంతో.. ఈ చిత్రాన్ని ఇంకా కొన్ని థియేటర్స్ నుంచి ఎత్తలేదు. కాగా ఈ సినిమాకి బ్రేక్ ఈవెన్ దాటేసి ఎప్పుడో లాభాలు వచ్చేయడంతో ఇదంతా బయ్యర్లు బోనస్ గానే ఫీలవుతున్నారు. 


అయితే ఈ చిత్రం విడుదలకు ముందే ఈ సినిమా స్లీపింగ్ హక్కులను అమెజాన్ ప్రైమ్ సొంతం చేసుకుంది. కాగా అమెజాన్ ప్రైమ్ చిత్ర మేకర్స్ తో చేసుకున్న అగ్రిమెంట్ ప్రకారం ఈ చిత్రం ఈ వారం పది రోజుల్లోనే డిజిటల్ ఎంట్రీ ఇచ్చే అవకాశముంది.  ఈ నేపథ్యంలో ఇంత కన్నా ఆలస్యం ఉండకపోవచ్చు. కానీ సరైన డేట్ తెలియాలి అంతే మాత్రం అమెజాన్ ప్రైమ్ వారు అధికారిక ప్రకటన ఇచ్చేవరకు వేచి చూడాల్సిందే.


Also Read: World Cup 2023: ఐసీసీ ప్రపంచకప్ 2023 విజేతకు రన్నర్ జట్లకు ఇచ్చే ప్రైజ్‌మనీ ఎంతంటే


Also Read: Poco M4 5G Price: 50MP కెమెరా Poco M4 5G మొబైల్‌ను ఫ్లిప్‌కార్ట్‌లో కేవలం రూ.11,000లోపే పొందండి!


 


 



 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి