Akhanda movie title roar video: నందమూరి బాలకృష్ణ, సంచలన చిత్రాల దర్శకుడు బోయపాటి శ్రీనుల కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న చిత్రానికి టైటిల్ ఖరారైంది. ఇప్పటివరకు BB3 అనే వర్కింగ్ టైటిల్‌తో ప్రమోట్ చేస్తున్న ఈ సినిమాకు అఖండ అనే టైటిల్ ఖరారు చేసినట్టు మూవీ యూనిట్ ఇవాళ ప్రకటించింది. ఉగాది పండగ (Ugadi festival) సందర్భంగా టైటిల్ రోర్ పేరుతో ఓ ప్రోమో వీడియో విడుదల చేసిన నిర్మాతలు.. బాలకృష్ణ విశ్వరూపాన్ని టైటిల్ రోర్ వీడియోలో శాంపిల్‌గా చూపించారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


అఖండ మూవీలో (Akhanda movie) శివ భక్తుడిగా బాలయ్య బాబు విశ్వరూపం చూడొచ్చని అఖండ టైటిల్ రోర్ వీడియో చూస్తే అర్థమవుతుంది అని అంటున్నారు బాలకృష్ణ ఫ్యాన్స్. ద్వారకా క్రియేషన్స్ బ్యానర్ పై మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మిస్తున్న ఈ సినిమాలో ప్రగ్యా జైశ్వాల్, పూర్ణ (Poorna), శ్రీకాంత్ ఇతర ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నాడు. 


Also read : Ugadi 2021 Wishes: ప్రేక్షకులకు టాలీవుడ్ ఉగాది శుభాకాంక్షలు, ఆచార్య నుంచి అఖండ వరకు లేటెస్ట్ అప్‌డేట్స్


సింహ, లెజెండ్ వంటి చిత్రాల తర్వాత బాలయ్య బాబు (Balakrishna), బోయపాటి శ్రీనుల (Boyapati Srinu) కాంబోలో తెరకెక్కుతున్న మూడో సినిమా ఇది. బోయపాటి, బాలయ్య బాబు కాంబో అంటేనే బాలయ్య, బోయపాటి అభిమానుల్లో, ఆడియెన్స్‌లో భారీ అంచనాలు ఉంటాయని ప్రత్యేకంగా చెప్పుకోనక్కర్లేదు. అలాగే అఖండ మూవీ కూడా భారీ అంచనాలపై నెలకొన్నాయి. స్వర్గీయ నందమూరి తారక రామా రావు జయంతి సందర్భంగా మే 28వ తేదీన (Akhanda movie release date) అఖండ ఆడియెన్స్ ముందుకు రానుంది.


Also read : Ugadi greetings తో ఆర్ఆర్ఆర్ మూవీ న్యూ పోస్టర్ విడుదల


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook