Daaku Maharaj Pre Release Event Cancelled: నటసింహ నందమూరి బాలకృష్ణ, ప్రముఖ డైరెక్టర్ బాబీ దర్శకత్వంలో డాకు మహారాజ్ సినిమా చేస్తున్నారు. ఈ సినిమా జనవరి 12వ తేదీన సంక్రాంతి సందర్భంగా విడుదల కాబోతోంది. ఈ నేపథ్యంలోనే భారీ అంచనాలతో సినిమా ప్రమోషన్స్ జోరుగా చేపట్టారు చిత్ర బృందం. అందులో భాగంగానే తాజాగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను ఆంధ్రప్రదేశ్ రాయలసీమలోని అనంతపురంలో చాలా గ్రాండ్గా నిర్వహించాలని ప్లాన్ చేశారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అనంతపురంలో ప్రీ రిలీజ్ కి సంబంధించి అన్ని ఏర్పాట్లు కూడా జరిగాయి. బాలయ్య భారీ కటౌట్ ను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అయితే సడన్గా ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ క్యాన్సిల్ చేసినట్లు చిత్ర హీరో బాలకృష్ణ ఈ మేరకు ఒక ప్రకటన కూడా విడుదల చేశారు. దీంతో అనంతపురం వాసులంతా నిరాశ వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం. మరి అసలేం జరిగిందో ఇప్పుడు చూద్దాం. 


వైకుంఠ ఏకాదశి సందర్భంగా నిన్న అనగా జనవరి 8వ తేదీన తిరుమల తిరుపతి దేవస్థానంలో చోటుచేసుకున్న తొక్కిసలాటలో దాదాపు 6 మంది భక్తులు మృతి చెందారు. ఈ విషయంపై బాలయ్య స్పందిస్తూ.. తిరుపతిలో జరిగిన తొక్కిసలాటలో  కొందరు భక్తులు చనిపోయిన సంఘటన అత్యంత బాధాకరం. 


మృతులకు నా నివాళి. వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి.ఈ  విషాదకర సందర్భంలో అనంతపురంలో జరగాల్సిన. డాకు మహారాజ్  ప్రీ ఈవెంట్  జరపడం సముచితం కాదు అనే ఉద్దేశంతో దానిని రద్దు చేయడం జరిగింది. అంటూ బాలయ్య ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేశారు. 


ఇదిలా ఉండగా  ఈ కార్యక్రమానికి ప్రముఖ మంత్రి నారా లోకేష్ చీఫ్ గెస్ట్ గా రాబోతున్నట్లు ప్రకటించారు.  ఆయన మంత్రి అయిన తర్వాత తొలిసారి అనంతపూర్లో పర్యటన చేయాల్సి ఉండగా.. ఇప్పుడు అది కూడా క్యాన్సిల్ అయింది. ఏది ఏమైనా ఈ విషయం అటు అభిమానులకు తీరని నిరాశను మిగులుస్తోందని చెప్పవచ్చు.


Also Read: EPFO 3.0 Launch: ఈపీఎఫ్ ఖాతాదారులకు శుభవార్త... త్వరలోనే ఏటీఎం కార్డు.. మొబైల్ యాప్.. డైరెక్టుగా విత్ డ్రా చేయవచ్చు


Also Read: Ys Jagan Schedule: ఈ నెలాఖరు నుంచి జిల్లాల పర్యటన జగన్ షెడ్యూల్ ఫిక్స్ ఎలా ఉంటుందంటే



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.