Balakrishna Fans: బాలకృష్ణ ఫాన్స్ రచ్చ.. మహేష్ బాబు థియేటర్ ధ్వంసం!
Balakrishna Fans Damages shutter: బాలకృష్ణ అభిమానులు ఏఎంబీ మాల్ లో ఒక షట్టర్ ను ధ్వంశం చేసినట్టు తెలుస్తోంది, దానికి సంబంధించిన వివరాల్లోకి వెళితే
Balakrishna Fans Damages the AMB Mall closed shutter : ఈ మధ్యకాలంలో వరుస వివాదాలతో విశ్వక్సేన్ హాట్ టాపిక్ గా మారారు. సీనియర్ హీరో అర్జున్ సర్జా డైరెక్ట్ చేస్తూ నిర్మిస్తున్న సినిమాలో హీరోగా ఎంపికైన అతను సినిమా కథ నచ్చకపోవడంతో అర్జున్ కి ఎదురు తిరగడంతో పెద్ద వివాదం ఏర్పడింది. ఇప్పుడు విశ్వక్ సేన్ సొంత నిర్మాణంలో ధమ్కీ అనే సినిమా చేస్తున్నాడు. వాస్తవానికి ఈ సినిమాకు మొదట అనౌన్స్ చేసినప్పుడు డైరెక్టర్ గా ఒక కొత్త అతని పేరు ప్రకటించారు.
కానీ తర్వాత అతను డైరెక్షన్ నుంచి తప్పుకోవడంతో విశ్వక్సేన్ స్వయంగా ఈ సినిమాకి డైరెక్షన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ సినిమాకి సంబంధించిన ట్రైలర్ ను ఈ రోజు 7 గంటల సమయంలో బాలకృష్ణ లాంచ్ చేశారు. విశ్వక్ సేన్ ఇటీవల అన్ స్టాపబుల్ విత్ ఎన్బికె సీజన్ 2లో బాలకృష్ణతో సందడి చేశారు. ఆ సమయంలో బాలకృష్ణ మీద ఉన్న అభిమానాన్ని విశ్వక్ సేన్ పంచుకున్నారు. ఆ సమయంలో విశ్వక్సేన్ తో కాస్త సాన్నిహిత్యం ఏర్పడింది. ఈ నేపథ్యంలోనే ఆ సాన్నిహిత్యాన్ని ఉపయోగించుకుని విశ్వక్సేన్ తన సినిమా ట్రైలర్ లాంచ్ చేయమని అడిగాడు.
ఈ నేపథ్యంలో నందమూరి బాలకృష్ణ ఏఎంబీ సినిమాస్ కు హాజరై ఈ ట్రైలర్ కూడా లాంచ్ చేసినట్టు తెలుస్తోంది. అయితే ఏఎంబీ మాల్ కు నందమూరి బాలకృష్ణ వస్తున్నాడు అనే విషయం తెలుసుకున్న ఆయన అభిమానులు పెద్ద ఎత్తున థియేటర్ వద్దకు చేరుకున్నారు. అయితే క్రౌడ్నే కంట్రోల్ చేయడం కోసం లోపలికి అభిమానులను వెళ్లకుండా నియంత్రిస్తూ ఏఎంబీ థియేటర్స్ సంస్థ ఒక షట్టర్ వేయడానికి ప్రయత్నించింది కానీ అభిమానులు ఆ షటర్ ను కూడా పైకి లేపి తోసుకుంటూ లోపలికి వెళ్లిపోవడం హాట్ టాపిక్ గా మారింది.
ఈ విషయం మీద పెద్ద ఎత్తున విమర్శలు వర్షం కురిపిస్తోంది, అభిమానులు చేస్తున్న పని కరెక్ట్ కాదని ఇది ఆ హీరో మీద ఎఫెక్ట్ పడుతుందని కొందరు కామెంట్ చేస్తున్నారు. అయితే మరి కొందరు మాత్రం అక్కడ షట్టర్ ను ఏమీ డ్యామేజ్ చేయలేదని కేవలం తమ హీరోని చూడాలనే ఉద్దేశంతో దాన్ని పైకి లేపి వెళితే తప్పేంటి అని మరి కొందరు ప్రశ్నిస్తున్నారు. ఏదేమైనా ఎంట్రీ లేని ప్రదేశాలలోకి బలవంతంగా చొచ్చుకుపోవడం మాత్రం కరెక్ట్ కాదని మరికొందరు కామెంట్లు చేస్తున్నారు. మరి మీ ఉద్దేశం ఏంటో కూడా కామెంట్ చేయండి.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook