Balakrishna:


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇండస్ట్రీ లో ఉన్న మిగతా సీనియర్ హీరోలతో పోలిస్తే నందమూరి బాలకృష్ణ మాత్రం వరుస విజయాలతో కెరియర్ లో బాగానే ముందుకు దూసుకుపోతున్నారు. అఖండ, వీర సింహా రెడ్డి సినిమాలతో మర్చిపోలేని విజయాలను అందుకున్నారు. తాజాగా ఇప్పుడు స్టార్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో భగవంత్ కేసరి అనే సినిమాతో మరొక హిట్ను తన ఖాతాలో వేసుకుని హ్యాట్రిక్ అందుకున్నారు. 


ఇప్పటిదాకా మాస్ సినిమాలలో నటించిన బాలకృష్ణ ని ఈ సినిమాలో ఒక విభిన్న యాంగిల్ లో చూపించారు అనిల్ రావిపూడి. అదే ఇప్పుడు సినిమా కి బాగా ప్లస్ అయిపోయింది. 60 యేళ్లు వచ్చిన సీనియర్ హీరో లు కథ తో సంబంధం లేకుండా యువ హీరోయిన్ లతో స్టెప్ లు వేస్తూ సినిమాలు చేస్తుంటే చూస్తున్న అభిమానులకు కూడా బాగా చిరాకు వచ్చేసింది. ఈ నేపథ్యంలోనే రజినీకాంత్ కమల్ హాసన్ వంటి హీరోలు వేరే రూట్లోకి వెళ్లారు. కమర్షియల్ సినిమాలలోనే తమ వయసుకు తగ్గ పాత్రలు చేయడం మొదలుపెట్టారు.


ఉదాహరణకి కమల్ హాసన్ విక్రమ్ సినిమాతో మంచి విజయాన్ని అందుకున్నారు. ఇక ఈ మధ్యనే రజినీకాంత్ నటించిన సినిమా కూడా హిట్ అయిన సంగతి తెలిసిందే. ఈ రెండు సినిమాలలో ఉన్న కామన్ పాయింట్ హీరోలు యువ హీరోయిన్లతో రొమాన్స్ చేయటం కాకుండా మంచి కథ ఉన్న సినిమాను ఎంచుకోవటం, తమ వయసుకు తగ్గ పాత్రలు చేయటం. దీంతో బాలకృష్ణ కూడా ఇప్పుడు అదే రూట్ లో వెళ్లారు.


ముందుగా శ్రీ లీల ను ఈ సినిమాలో హీరోయిన్గా ప్రకటించినప్పుడు అలాంటి యువ హీరోయిన్ బాలకృష్ణ వంటి సీనియర్ హీరో పక్కన ఎలా సెట్ అవుతుంది అని కొందరు అనుమానాలు వ్యక్తం చేశారు. కానీ అనిల్ రావిపూడి శ్రీ లీలని హీరోయిన్ గా కాకుండా బాలయ్య కూతురి పాత్రలో చూపించి మంచి పని చేశారు. ఇద్దరి నటన సినిమాకి బాగా ప్లస్ అయిపోయింది. మొదటి రోజు నుంచి ఈ సినిమా మంచి టాక్ ను అందుకుని కలెక్షన్ల పరంగా కూడా అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. 


ఇక ఈ సినిమాకి ఎస్ఎస్ తమన్ అందించిన సంగీతం కూడా సినిమాకి ప్లస్ పాయింట్ అయ్యింది. షైన్ స్క్రీన్స్ పతాకంపై హరీష్ పెద్ది, సాహు గారపాటి ఈ సినిమా ను ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. అక్టోబర్ 19 న భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా సూపర్ హిట్ దిశగా ముందుకు దూసుకుపోతోంది.


Also Read: CM Jagan: ఏపీలో అర్చకులకు శుభవార్త.. సీఎం జగన్ దసరా గిఫ్ట్  


Also Read:  King Cobra Viral Video: వీడి ధైర్యానికి దండేసి దండం పెట్టాల్సిందే.. కింగ్ కోబ్రాకు బాత్ రూమ్‌లో స్నానం  



 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


TwitterFacebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.