Balakrishna: హీరో నందమూరి బాలకృష్ణ గురించి కొత్తగా పరిచయాలు అక్కర్లేదు. ఓవైపు నటుడిగా.. మరోవైపు ఎమ్మెల్యేగా.. ఇంకోవైపు బసవతారకం కాన్సర్ హాస్పిటల్ చైర్మన్‌గా బహు ముఖ పాత్రలు పోషిస్తున్నారు. ఇది బాలయ్యలోని ఓ కోణం మాత్రమే.. మరో కోణంలో ఈయన అభిమానులపై అకారణంగా చేయి చేసుకున్న సందర్భాలున్నాయి. ఇలాంటి సంఘటనలతో బాలయ్య అంటే వివాదం అనేలా తయారైంది. ఎవరెంత చెప్పినా ఆయన పద్దతి అంతే. ఇక బాలయ్య చేతిలో దెబ్బలు తిన్న అభిమానులు కూడా అమ్మ, నాన్నలు కొడితే ఎలా బాధ పడమో.. అలా బాలయ్య కొట్టినా.. అది దీవెనలా భావిస్తుంటామని గడుసు సమాధానాలు ఇస్తుంటారు.  ఈయన పలు సందర్భాల్లో చేయి చేసుకోవడంపై పలు విమర్శలు వచ్చినా.. బాలయ్య తీరు ఎక్కడా మారలేదు. ఇక అన్‌స్టాపబుల్ షోతో బాలయ్య క్రేజ్ ఒక్కసారిగా మారిపోయింది. ఇతర హీరోలతో చేసే ఇంటర్వ్యూలతో ఈయనపై ఉన్న దురభిప్రాయం పోయిందనే చెప్పాలి. తాజాగా టాలీవుడ్ సీనియర్ అగ్ర కథానాయకుడు బాలయ్యపై దర్శకుడు కే.యస్.రవికుమార్ చేసిన వ్యాఖ్యలు సంచలనం రేపుతున్నాయి. సినిమా షూటింగ్‌లో ఎవరైనా బాలయ్యను చూసి నవ్వితే చాలు..ఆయనకు విపరీతమైన కోపం వచ్చేస్తోందంటూ చెన్నైలో జరిగిన 'గార్డియన్' ఈవెంట్‌లో చేసిన వ్యాఖ్యలు సంచలనం క్రియేట్ చేస్తున్నాయి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈయన బాలకృష్ణతో 'జై సింహా' (2018), ఆ తర్వాత రూలర్ (2019) చిత్రాలు చేశారు. ఓ సందర్భంలో తన అసిస్టెంట్ డైరెక్టర్‌ను షూటింగ్ లొకేషన్‌లో ఫ్యాన్ తిప్పమని అడిగాను. అతను అనుకోకుండా బాలయ్య వైపు ఫ్యాన్ తిప్పాడు. ఆ సందర్భంగా ఆయన పెట్టుకున్న విగ్ కాస్త చెదిరిపోయింది. ఈ సందర్భంగా మా అసిస్టెంట్ తనలో తాను నవ్వుకున్నాడు. ఏయ్ ఎందుకు నవ్వుతున్నావ్ అంటూ బాలకృష్ణ అడుగుతుంటే .. నేను కలగజేసుకొని.. అతను మన సినిమా అసిస్టెంట్ డైరెక్టర్ అని సర్దిచెప్పాను. ఆ తర్వాత నేను అతన్ని కోప్పడి కాసేపు సెట్‌లో కనబడకుండా అక్కడ నుంచి వెళ్లిపోమ్మన్నాను. ఇలా బాలయ్య షూటింగ్‌లో చేసిన నిర్వాకం గురించి దర్శకుడు కే.యస్.రవికుమార్ ఈ ఈవెంట్‌లో చెప్పడం ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ సందర్భంగా దర్శకుడు కే.యస్.రవికుమార్ బాలయ్య గురించి ఇపుడే ఎందుకు చెప్పాల్సి వచ్చిందనేది బాలయ్య ఫ్యాన్స్ ప్రశ్నిస్తున్నారు.



ఒకప్పుడు వరుసగా ముత్తు, నరసింహా, దశావతారం వంటి ప్యాన్ ఇండియా సినిమాలు చేసిన కే.యస్.రవికుమార్ గత కొన్నేళ్లుగా హిట్ లేక రేసులో వెనకబడిపోయారు. అలాంటి సందర్భంలో బాలయ్య పిలిచి మరి అతనికి సినిమాలు ఛాన్సులు ఇచ్చాడు. అలాంటి వ్యక్తిని ఇలా పబ్లిక్‌గా అవమానిస్తూ మాట్లాడటం వెనక ఉన్న ఉద్దేశ్యం ఏమిటన్నది  బాలయ్య అభిమానులు కే.యస్.రవికుమార్ తీరును ప్రశ్నిస్తున్నారు. ఏది ఏమైనా కే.యస్.రవికుమార్ బాలయ్యపై చేసిన వ్యాఖ్యలు ఇపుడు కోలీవుడ్, టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారాయి.


Read More: Actress Kajal Agarwal: హీరోయిన్ కాజల్ అగర్వాల్ నడుముపై చెయివేసిన అభిమాని.. సోషల్ మీడియాలో రచ్చగా మారిన వీడియో ఇదే..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


Android Link: https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu 


Apple Link: https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook