Balakrishna Not Interested to Say Sorry: నందమూరి బాలకృష్ణ అనూహ్యంగా తాజాగా వివాదాల్లో చిక్కుకున్న సంగతి తెలిసిందే. వాస్తవానికి కొన్నాళ్ల క్రితం నుంచి ఆయన మీద రెండు తెలుగు రాష్ట్రాల్లో పాజిటివిటీ బాగా పెరిగింది. అల్లు అరవింద్ కి చెందిన ఆహా యాప్ లో ఆయన చేస్తున్న అన్ స్టాపబుల్ విత్ ఎన్బీకే షో ద్వారా బాలకృష్ణలో కనిపించని కోణాలను కూడా ప్రేక్షకులకు కనిపించేలా చేయడంతో ఆయన మీద మంచి అభిప్రాయం అయితే ఏర్పడింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అయితే ఇప్పుడు ఆ అభిప్రాయం ఒక్కసారిగా దూరమయ్యే పరిస్థితి ఏర్పడింది. ఎందుకంటే నందమూరి బాలకృష్ణ తన ప్రసంగంలో అక్కినేని కుటుంబాన్ని విమర్శించారని, అక్కినేని తొక్కినేని అనే పదంతో ఎంతో బాధ కలిగించారని ఒక పక అక్కినేని అభిమానులు క్షమాపణలు చెప్పాలని వార్నింగ్ ఇవ్వగా మరొక పక్క అక్కినేని వారసులు నాగచైతన్య, అక్కినేని అఖిల్ కూడా పరోక్షంగా కౌంటర్లు ఇస్తూ మనల్ని కించపరుచుకునే విధంగా మాట్లాడారంటూ పేర్కొన్నారు.


ఇక మరొక పక్క కాపునాడు సైతం నందమూరి బాలకృష్ణను టార్గెట్ చేస్తూ నందమూరి బాలకృష్ణ క్షమాపణలు చెప్పాలని గతంలో లాగా సంతకం లేని లేఖ విడుదల చేయడం కాదు మాకు క్షమాపణలు చెబుతూ ప్రెస్ మీట్ పెట్టి ఇక మీదట ఇలాంటి వ్యాఖ్యలు చేయకుండా ఉంటామని హామీ ఇవ్వాలని డిమాండ్ చేసింది. అలా చేయని పక్షంలో ఆందోళన నిర్వహిస్తామని కూడా అల్టిమేటం జారీ చేసింది. తెలుగుదేశాన్ని కూడా ఇందులో ఇన్వాల్వ్ చేస్తూ వారు ప్రకటించడం హాట్ టాపిక్ గా మారింది.


అయితే ఇంత జరుగుతున్నా నందమూరి బాలకృష్ణ మాత్రం ఈ విషయం మీద స్పందించడం లేదు. ఆయన అభిమానులు కూడా బాలకృష్ణ తప్పుగా మాట్లాడారని ఏమాత్రం భావించడం లేదు. అది పొరపాటున నోటి నుంచి దొర్లిన పదమే తప్ప ఆయన కావాలని మాట్లాడిన పదం కాదు కాబట్టి ఆయన క్షమాపణ చెప్పాల్సిన అవసరమే లేదని అంటూ కవర్ చేస్తున్నారు. అయితే ఇప్పుడు నందమూరి బాలకృష్ణకు సైతం ఈ విషయంలో క్షమాపణలు చెప్పే ఉద్దేశం ఏ మాత్రం లేదని తెలుస్తోంది.


అందుకు ఉదాహరణగా ఆయన నిన్న రాత్రి జరిగిన ఆర్ఆర్ఆర్ నాటు నాటు ఆస్కార్ నామినేషన్ విషయం మీద స్పందిస్తూ వారికి శుభాకాంక్షలు చెప్పారు కానీ అక్కినేని ఫాన్స్, కాపునాడు డిమాండ్ చేస్తునట్టు ఈ క్షమాపణలు చెప్పే విషయంలో మాత్రం ఎలాంటి ఆసక్తి చూపించడం లేదు. కాబట్టి నందమూరి బాలకృష్ణ ఈ విషయంలో క్షమాపణలు చెప్పే అవకాశం లేదని తెలుస్తోంది. అయితే ఇప్పటికే అల్టిమేటం జారీ చేసిన కాపునాడు మరో పక్క క్షమాపణలు చెప్పించాలని ప్రయత్నిస్తున్న అక్కినేని ఫ్యాన్స్ అసోసియేషన్ కూడా ఈ విషయంలో ఎలా ముందుకు వెళ్ళబోతున్నాయి అనేది ఆసక్తికరంగా మారింది.


నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన వీర సింహారెడ్డి సినిమా మంచి కలెక్షన్స్ తో దూసుకుపోతోంది. మొదటి ఆట నుంచి పాజిటివ్ టాక్ రావడంతో ఈ సినిమాకి కలెక్షన్స్ విషయంలో బాగా ప్లస్ అయింది. అయితే వాల్తేరు వీరయ్య సినిమా ఎంట్రీ ఇచ్చిన తర్వాత కలెక్షన్స్ విషయంలో కాస్త వెనుకబడింది కానీ నందమూరి బాలకృష్ణ కెరియర్ లో మాత్రం అత్యధిక కలెక్షన్లు సాధించిన సినిమాగా నిలిచింది.


Also Read: Telugu Woman Died: పోలీసు వాహనం ఢీ కొట్టి తెలుగమ్మాయి మృతి.. అసలేమైంది?


Also Read: Vijay Antony Health: విజయ్ అంటోనీ ఫాన్స్ కు గుడ్ న్యూస్... సర్జరీ సక్సెస్.. ఆల్ సెట్!