Balakrishna: హెయిర్ స్టైల్ మీద కామెంట్స్.. హీరో సిద్దు జొన్నలగడ్డను చంపుతానన్న బాలకృష్ణ
Balakrishna Says I Will Kill you Siddu Jonnalagadda: నందమూరి బాలకృష్ణ యంగ్ హీరో సిద్దూ జొన్నలగడ్డను చంపేస్తానంటూ కామెంట్స్ చేశారు. ఆ వివరాల్లోకి వెళితే
Nandamuri Balakrishna Says I Will Kill you Siddu Jonnalagadda: యంగ్ హీరో సిద్దు జొన్నలగడ్డ గుంటూరు టాకీస్ అనే సినిమాతో తెలుగు సినీ పరిశ్రమకు హీరోగా పరిచయమయ్యాడు. మొదటి సినిమాతోనే హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్న సిద్దు తర్వాత అనేక ప్రయత్నాలతో తెలుగు ప్రేక్షకుల్లో సుస్థిర స్థానం సంపాదించుకోవడానికి ప్రయత్నించాడు. కానీ అవి ఏవీ పెద్దగా వర్కౌట్ కాలేదు. ఈ ఏడాది ఆయన చేసిన డీజే టిల్లు అనే సినిమా సూపర్ హిట్ అయింది.
పూర్తిస్థాయి తెలంగాణ యాసలో సాగిన ఈ డీజే టిల్లు సినిమా కేవలం తెలంగాణ రాష్ట్రంలోనే కాదు ఆంధ్రప్రదేశ్ వాసులను కూడా ఆకట్టుకుంది. దీంతో సిద్దు జొన్నలగడ్డకు యూత్ లో మంచి ఫాలోయింగ్ ఏర్పడింది. తాజాగా ఆయన ఆన్ స్టాపబుల్ విత్ ఎన్ బి కె షోలో ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. తన కో హీరో విశ్వక్సేన్ తో కలిసి నందమూరి బాలకృష్ణ హోస్ట్ గా వ్యవహరిస్తున్న అం స్టాపబుల్ విత్ ఎన్బికె సీజన్ 2 ఎపిసోడ్ 2లో కనిపించాడు. సిద్దు జొన్నలగడ్డ వస్తూ ఉండగానే నందమూరి బాలకృష్ణ ఆయన మీద సరదా కామెంట్లు చేశారు.
సిద్దు జొన్నలగడ్డ హెయిర్ స్టైల్ చూసి ఏ బాబు హెయిర్ స్టైలిస్ట్ ఎవరు? పాపం సిద్దు బాబు తల దువ్వ లేదేంటి? అన్నట్లుగా కామెంట్లు చేయడంతో సార్ మా హెయిర్ స్టైల్ కు మీరే ఇన్స్పిరేషన్ సార్ ఇది మెస్సీ హెయిర్ స్టైల్ అంటూ సిద్దు జొన్నలగడ్డ కామెంట్స్ చేయడంతో నందమూరి బాలకృష్ణ ఒక్కసారిగా సీరియస్ అయ్యారు. చంపుతా అలా అన్నావంటే అంటూ ఆయన కామెంట్ చేస్తూనే ఇక మీదట నీ సినిమాలు ఆడాలా వద్దా? అంటూ నందమూరి బాలకృష్ణ ప్రశ్నించడంతో అయ్యో ఎందుకు ఆడకూడదు ఆడాలి కదా సార్ అంటూ సిద్దు జొన్నలగడ్డ పేర్కొన్నాడు.
అయితే నేను ఇలా మెస్సీ లుక్ తో కనిపించిన సినిమాలు అన్నీ మిస్ అయ్యా అమ్మా అంటూ బాలకృష్ణ ఆసక్తికరంగా కామెంట్స్ చేశారు. ఇక ప్రస్తుతానికి సిద్దు జొన్నలగడ్డ డిజె టిల్లు సీక్వెల్ తెరకెక్కించే పనిలో పడ్డారు. డిజె టిల్లు ఫస్ట్ పార్ట్ కి సూపర్ రెస్పాన్స్ రావడంతో రెండో పార్ట్ ఇటీవల ప్రారంభించారు. మొదటి భాగంలో నేహా శెట్టి హీరోయిన్ గా నటించగా రెండో భాగంలో అనుపమ పరమేశ్వరన్ రాధిక పాత్రలో కనిపించబోతుంది. ఇక ఈ సినిమాతో సిద్దు జొన్నలగడ్డ ఎంత మ్యాజిక్ చేయబోతున్నాడు అనేది సినిమా రిలీజ్ అయిన తర్వాత క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.
Also Read: Prince Movie Report: కామెడీతో అన్ని సినిమాలూ జాతి రత్నాలు అవ్వలేవు బాసూ!
Also Read: Veerasimha Reddy: ''వీర సింహారెడ్డి''గా బాలయ్య.. పూనకాలు తెప్పించేలా 107 టైటిల్ అనౌన్స్మెంట్!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook