Nandamuri Balakrishna: అఖండ, వీరసింహారెడ్డి వంటి వరుస సూపర్ హిట్ సినిమాలతో ప్రేక్షకులను అలరించిన సీనియర్ హీరో నందమూరి బాలకృష్ణ తాజాగా ఇప్పుడు భగవంత్ కేసరి అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకి రాబోతున్నారు. ఈ సినిమాతో హాట్రిక్ అందుకోబోతున్నారని బాలయ్య అభిమానులు ఇప్పటినుంచే కామెంట్లు చేస్తున్నారు. సినిమాపై భారీ స్థాయిలో అంచనాలు నెలకొన్నాయి. అనిల్ రావిపూడి ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కాజల్ అగర్వాల్ ఈ సినిమాలో హీరోయిన్ గా బాలయ్య భార్య పాత్రలో కనిపించనుంది. ఇక శ్రీ లీల ఈ సినిమాలో బాలకృష్ణ కూతురి పాత్రలో కనిపించబోతోంది. ఆమెను ఎలాగైనా మిలటరీలో జాయిన్ చేయాలని ఆమెకు ఇష్టం లేకపోయినా బాలకృష్ణ ప్రయత్నిస్తూ ఉంటారని ట్రైలర్ చూస్తేనే తెలుస్తుంది. ఇక సినిమాలో కొన్ని మంచి ట్విస్టులు కూడా ఉన్నాయట. 


అయితే సినిమా సెకండ్ హాఫ్లో ఒక అద్భుతమైన సన్నివేశం ఉంటుందట. అది సినిమాకి హైలైట్గా నిలుస్తుందని కొందరు చెబుతున్నారు. సినిమా సెకండ్ హాఫ్లో ఒక సన్నివేశంలో బాలకృష్ణ ఒక పెద్ద స్పీచ్ ఇవ్వబోతున్నారట. అది ఎవరికోసమో కాదు ఆడపిల్లలను కన్న తల్లిదండ్రుల గురించి అని తెలుస్తోంది. ఈ సన్నివేశం ఆడపిల్లలు ఉన్న తల్లిదండ్రులకి ఒక కచ్చితంగా ఒక లెక్చర్ అవుతుందని, సినిమాకి ఇది హైలైట్గా కూడా నిలుస్తుందని విశ్వసనీయ వర్గాల సమాచారం.


ఇక థియేటర్లో ఈ సన్నివేశం కచ్చితంగా ప్రేక్షకుల రోమాలు నిక్కబడుచుకునేలా ఉంటుందని తెలుస్తోంది. చాలా ఏళ్ల నుంచి ఆడపిల్లలను మగవాళ్ళు ఎలా వేధిస్తున్నారని బాలకృష్ణ కుండ బద్దలు కొట్టినట్లు మాట్లాడారట. ఇక ఈ సినిమా ఇంతకుముందు బాలకృష్ణ నటించిన మాస్ సినిమాల లాగా ఉండదని చిత్ర ట్రైలర్ చూస్తేనే తెలుస్తోంది. సినిమాలో బాలకృష్ణని ఇదివరకెన్నడు చూడని ఒక అద్భుతమైన పాత్రలో చూపించబోతున్నట్లు అనిల్ రావిపూడి ఇప్పటికే కొన్ని ఇంటర్వ్యూలలో చెబుతున్నారు.


చిత్ర ట్రైలర్ కూడా బాగా ఆసక్తికరంగా ఉండటంతో సినిమాపై అంచనాలు రోజురోజుకీ పెరుగుతూ వస్తున్నాయి. సినిమాని థియేటర్లో చూడాలని అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. షైన్ స్క్రీన్స్ పతాకం వారు ఈ సినిమాని ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. ఎస్ ఎస్ తమన్ సంగీతాన్ని అందించిన ఈ సినిమా భారీ అంచనాల మధ్య అక్టోబర్ 19న థియేటర్లలో విడుదల కాబోతోంది. మరి ఈ సినిమాతో బాలకృష్ణ హ్యాట్రిక్ అందుకుంటారో లేదో వేచి చూడాలి.


Also Read: Saindhav Update: వెంకీ అభిమానులకు గుడ్ న్యూస్... సైంధవ్ టీజ‌ర్‌ డేట్, టైమ్ ఫిక్స్..


Also read: Online General Tickets: ఇకపై ఆన్‌లైన్‌లో కూడా రైల్వే జనరల్ టికెట్లు , బుకింగ్ ఎలా చేయాలంటే



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook