Bhagavanth Kesari OTT: టాలీవుడ్ నటుడు నందమూరి బాలకృష్ణ నటించిన లేటెస్ట్ సినిమా భగవంత్ కేసరి ఇప్పుడిక ఓటీటీలో సందడి చేయనుంది. ధియేటర్లలో రికార్డు కలెక్షన్లు సాధించిన ఈ సినిమా ఇకపై ఓటీటీలో అందర్నీ ఆలరించేందుకు సిద్ధమైంది. ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ భగవంత్ కేసరి ఓటీటీ హక్కుల్ని సొంతం చేసుకుంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అఖండ, వీర సంహారెడ్డి సినిమాలతో వరుస బ్లాక్‌బస్టర్ హిట్లు అందుకున్న బాలకృష్ణ తొలిసారిగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో మరో మాస్ సినిమాలో నటించారు. అక్టోబర్ 19న ధియేటర్లలో విడుదలై ఈ సినిమా అందరూ ఊహించినట్టే మరో బ్లాక్‌బస్టర్ హిట్ అయింది. విడుదలైన వారం రోజుల్లోనే 100 కోట్లు వసూలు చేసేసింది. ప్రభాస్, మహేశ్ బాబు, ఎన్టీఆర్, పవన్ కళ్యాణ్ సినిమాల తరువాత వరుసగా వంద కోట్లు వసూలు చేసిన మూడు సినిమాల జాబితాలో బాలయ్య సినిమా నిలిచింది. నాటి తరం హీరోల్లో వంద కోట్ల వసూళ్లు అందుకున్న ఏకైక నటుడు బాలయ్యగా చెప్పవచ్చు.


బాలయ్య అభిమానులు కోరుకునే మాస్ అంశాలతో పాటు సమాజానికి ఉపయోగపడే సందేశం కూడా ఈ సినిమాలో ఉంది. నేలకొండ భగవంత్ కేసరి పాత్రలో బాలయ్య నటన, డైలాగ్స్, యాక్షిన్ ఎపిసోడ్స్ విపరీతంగా అభిమానుల్ని ఆకట్టుకున్నాయి. అందుకే బాక్సాఫీసు వద్దు కలెక్షన్లు కురిపించింది. ఈ సినిమా ఎప్పుడు ఓటీటీలో విడుదలవుతుందా అని ఎదురుచూస్తున్నవారికి ఈ సినిమా ఓటీటీ హక్కుల్ని సొంతం చేసుకున్న అమెజాన్ ప్రైమ్ గుడ్‌న్యూస్ అందించింది. 


ఈ నెల 24 అంటే రేపట్నించి భగవంత్ కేసరి అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ కానుంది. అమెజాన్ స్వయంగా ఈ విషయాన్ని వెల్లడించింది. ఈ సినిమా ఓటీటీ హక్కుల కోసం పలు ఓటీటీ సంస్థలు పోటీపడినా పెద్దమొత్తానికి అమెజాన్ ప్రైమ్ దక్కించుకుంది. కాజల్ అగర్వాల్ నటీమణిగా కన్పించగా, శ్రీలీల బాలయ్య కూతురిగా నటించింది. బాలీవుడ్ నటుడు అర్జున్ రాంపాల్ విలన్‌గా నటించాడు. ఇక తమిళ నటుడు శరత్ కుమార్, రవిశంకర్, శుభలేఖ సుధాకర్, రాహుల్ రవి, రఘుబాబు, సుబ్బరాజు సినిమాల్లో కీలకపాత్రల్లో కన్పిస్తారు. తమన్ సంగీతం అందించిన ఈ సినిమాను సితార్ ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ కలిసి నిర్మించాయి. 


Also read: Manchu Vishnu: ఎవరు ఊహించని రేంజ్ లో కన్నప్ప... పోస్టర్ తోనే సెన్సేషన్



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook