MAA Elections 2021: హోరాహోరీగా `మా` ఎన్నికల ప్రచారం...మంచువిష్ణుకు బాలకృష్ణ మద్దతు
MAA Elections: ‘మా’ ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. అధ్యక్ష పదవికి పోటీ చేస్తున్న మంచు విష్ణుకు మద్దతు ప్రకటించారు ప్రముఖ హీరో బాలకృష్ణ. ఈ విషయాన్ని మంచు విష్ణు ట్విట్టర్ ద్వారా వెల్లడించారు.
MAA Elections: ‘మా’ ఎన్నికల(MAA Elections 2021) ప్రచారం వాడీవేడీగా సాగుతోంది. ఈ ఎన్నికల్లో నటుడు బాలకృష్ణ(Balakrishna) తనకే మద్దతు ఇస్తున్నారని అధ్యక్ష అభ్యర్థి మంచు విష్ణు తెలిపారు. ఈ మేరకు ఆదివారం ఉదయం ‘అఖండ’ సెట్‌కు వెళ్లిన విష్ణు కాసేపు బాలయ్యతో ముచ్చటించారు. తన మేనిఫెస్టో గురించి వివరించారు.
‘మా’ అభివృద్ధి, సభ్యుల సంక్షేమం కోసం తాను చేపట్టనున్న కార్యక్రమాలపై ఆయనతో చర్చించారు. తన అభిప్రాయాలతో ఏకీభవించిన బాలయ్య తనకు మద్దతు ప్రకటించారని విష్ణు(Manchu Vishnu) తెలిపారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ తాజాగా ఓ ట్వీట్ పెట్టారు. ‘బాలా అన్న.. మీ సపోర్ట్‌కు ధన్యవాదాలు. మీరు నాకు మద్దతు తెలపడం ఎంతో గర్వంగా ఉంది’ అని విష్ణు పోస్టు పెట్టారు. ఇటీవల తన తండ్రి మోహన్ బాబుతో కలిసి సూపర్ స్టార్ కృష్ణ మద్దతు కోరారు.
Also read:ChaySam Divorce: చై-సామ్ విడిపోవడానికి ఆ బాలీవుడ్ స్టారే కారణం: కంగనా షాకింగ్ కామెంట్స్
ఇప్పటికే మా అధ్యక్ష పదవికి సీవీఎల్ నరసింహరావు, జనరల్ సెక్రెటరీ పదవికి బండ్ల గణేష్(Bandla Ganesh) తమ నామినేషన్లను ఉపసంహరించుకున్నారు. మరోవైపు అక్టోబర్ 10న మా ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో ఎన్నికల ప్రచారం జోరందుకుంది. ముఖ్యంగా ‘మా’ అధ్యక్ష పదవి కోసం ప్రకాశ్ రాజ్, మంచు విష్ణు మధ్య గట్టి పోటీ నెలకొంది.
లంచ్ పార్టీ ఇచ్చిన ప్రకాశ్‌రాజ్
'మా' అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధించేందుకు నటుడు ప్రకాశ్‌రాజ్ (PrakashRaj) ఎంతో ప్రయత్నిస్తున్నారు. తన టీమ్‌తో కలిసి వరుస ప్రచార కార్యక్రమాల్లో ఆయన పాల్గొంటున్నారు. ఇందులో భాగంగానే తాజాగా ఆయన అసోసియేషన్ సభ్యులందరికీ లంచ్ పార్టీ ఏర్పాటు చేశారు. ఫిల్మ్‌నగర్ కల్చరల్ క్లబ్‌లో ఆదివారం మధ్యాహ్నం అసోసియేషన్ సభ్యులందరితో సమావేశమైన ప్రకాశ్‌రాజ్.. తన ప్లాన్ ఆఫ్ యాక్షన్ గురించి వివరించారు. 'మా' సభ్యుల సంక్షేమం కోసం తాను చేపట్టనున్న అభివృద్ధి కార్యక్రమాలపై వాళ్లతో చర్చలు జరిపారు. అలాగే, వాళ్లు ఎదుర్కొంటున్న సమస్యల గురించి అడిగి తెలుసుకున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి