Akhanda Roar On Hotstar: యాక్షన్ డైరెక్టర్ బోయపాటి శ్రీను (Boyapati Srinu) దర్శకత్వంలో నటసింహం నందమూరి బాల‌కృష్ణ (Balakrishna) హీరోగా తెరకెక్కిన 'అఖండ' (Akhanda) సినిమా బంపర్ హిట్ అయింది. కరోనా దెబ్బకి బూజుపట్టిన థియేటర్స్‌ని తన మాస్ జాతరతో బాలయ్య బాబు తెరిపించారు. కరోనా కష్ట కాలంలోనూ 103 థియేట‌ర్ల‌లో 50 రోజులు విజ‌య‌వంతంగా ప్రదర్శించబడిన అఖండ సరికొత్త రికార్డుల్ని క్రియేట్ చేసింది. ఇక కలెక్షన్ల పరంగానూ దూసుకుపోతోంది. ప్ర‌పంచ‌వ్యాప్తంగా రూ. 152 కోట్ల గ్రాస్‌, రూ. 93 కోట్ల షేర్ వ‌సూలు చేసి చరిత్ర సృష్టించింది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

2022 జనవరి 20తో 50 రోజులు పూర్తిచేసుకున్న అఖండ చిత్రం.. శుక్రవారం (జనవరి 21) నుంచి ఓటీటీ (OTT)లో కూడా స్ట్రీమింగ్ అవుతోంది. డిస్నీ‌ప్లస్ హాట్‌స్టార్‌ (Disney plus Hotstar)లో నిన్న సాయంత్రం 6 గంటల నుంచి అఖండ స్ట్రీమింగ్ మొదలైంది. కరోనా టైమ్‌లో థియేటర్లకు వెళ్లి చూడలేకపోయిన చాలా మంది ఫాన్స్ (Balakrishna Fans) తమ ఇంట్లోనే అఖండ సినిమాని ఎంజాయ్ చేస్తున్నారు. కొందరు బాలయ్య ఫాన్స్ ప్రొజెక్టర్ పెట్టి మరీ సినిమాను చూశారు. బాలయ్య ఎంట్రీ రాగానే థియేటర్లలో మాదిరే మాదిరే ఈలలు వేస్తూ పెద్దగా అరిచారు. అంతేకాదు దీపాలతో ఆహ్వానం పలికారు. 


Also Read: Rishith Reddy Indian Team: హైదరాబాద్ ఆటగాడికి బంపర్‌ ఆఫ‌ర్‌.. ఏకంగా టీమిండియాలో చోటు!!


పల్లెటూరిలో బాలయ్య బాబు ఫాన్స్ తెర కట్టి మరీ అఖండ సినిమా చూశారు. ఆ సమయంలో బాణాసంచా కాలుస్తూ సంబరాలు చేసుకున్నారు. ఫాన్స్ అందరూ తమకు నచ్చిన సీన్స్‌ను నెట్టింట పోస్ట్ చేస్తున్నారు. కొందరు మ్యూజిక్ డైరెక్టర్ థమన్‌ను ఆకాశానికెత్తేశారు. మొత్తానికి థియేటర్లలోనే కాదు ఇళ్లల్లో కూడా బాలయ్య బాబు మాస్ జాతర (Akhanda Roar On Hotstar) కొనసాగుతోంది. అఖండ సినిమాని ఇంట్లో చూస్తూ ఫాన్స్ తమ సంతోషాన్ని సోషల్ మీడియాలో పంచుకోవడం ఇప్పుడు పెద్ద సంచలంగా మారింది.



అఖండ సినిమాలో బాలకృష్ణ ద్విపాత్రాభినయం చేశారు. రైతు పాత్ర ఒకటి కాగా.. మరొక అఘోరా పాత్ర. ఈ అఘోరా పాత్రే సినిమాకు హైలైట్. ప్రగ్యా జైస్వాల్ (Pragya Jaiswal) హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రాన్ని ద్వారకా క్రియేషన్స్ బ్యానర్‌పై మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మించారు. తమన్ (Thaman S) సంగీతం అందించారు. ఇక బాలయ్య-బోయపాటి కాంబినేషన్.. ఈ సినిమాతో హ్యాట్రిక్ హిట్ అందుకుంది.


Also Read: Ganguly - Kohli: అవన్నీ గాలి వార్తలే.. అలాంటి వార్తలు ఎలా పుట్టుకొస్తాయో: గంగూలీ





స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook