Banaras Movie Telugu Review: ఈ మధ్యకాలంలో పాన్ ఇండియా సినిమాల ప్రభావం బాగా పెరిగిపోయింది. తమ భాషలో సినిమా చేస్తూనే మరో నాలుగు భాషల్లో కూడా సినిమాను విడుదల చేసేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. అయితే హీరోలుగా కొంత నిలబడిన తర్వాత స్టార్డం వచ్చింది అనుకున్న తర్వాత పాన్ ఇండియా సినిమా చేయడం వేరు చేసిన మొదటి సినిమాతోనే పాన్ ఇండియా హీరోగా ఎంటర్ అవ్వడం వేరు కర్ణాటక ఎమ్మెల్యే కుమారుడైన జైద్ ఖాన్ ఇప్పుడు బనారస్ అనే సినిమాతో పాన్ ఇండియా హీరోగా లాంచ్ అయ్యాడు. ఈ సినిమా తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషల్లో ఏకకాలంలో విడుదలైంది. నవంబర్ 4వ తేదీన సుమారు 7 సినిమాలతో పోటీపడుతూ ఈ సినిమా కూడా విడుదలైంది. మరి ఈ సినిమా ఎలా ఉంది అనేది సమీక్షలో తెలుసుకుందాం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కథ: 
ఒక బడా వ్యాపారవేత్త కొడుకైన సిద్ధార్థ(జైద్ ఖాన్) తన స్నేహితులతో బెట్ కట్టి ధని  (సోనాల్ మాంటెరో) అనే అమ్మాయిని మాయలో పడేస్తాడు. మాయమాటలు చెప్పి ఆమె రూమ్ కి వెళ్లడమే కాక ఆమెతో కలిసి ఉన్న ఒక సెల్ఫీ ఫోటో కూడా షేర్ చేయడంతో బెట్టు నెగ్గుతాడు. ఆయా ఆనందంలో విదేశాల్లో ఎంజాయ్ చేస్తూ ఉన్న అతనికి ఏదైతే టైం ట్రావాల్ అంటూ కట్టు కథలు చెప్పి ఆమెను మాయలో పడేసాడో అదే టైం ట్రావెల్ వల్ల ఇబ్బందులు ఎదురవుతాయి. చివరికి ఆమెను మోసం చేసిన విషయంలో క్షమాపణలు అడిగినందుకు ఆమె సొంత ఊరైన బనారస్ కు వెళ్లి ఆమె వెంటపడి క్షమాపణలు కోరుతూ ఉంటాడు. అయితే ఈ క్రమంలో ఆమె అనూహ్యంగా ఒకరోజు ఊహించని షాక్ ఇస్తుంది. దీంతో సిద్ధార్థ ఏం చేసాడు? సిద్ధార్థ ధనిని ప్రేమించాడా? ఒకవేళ ప్రేమిస్తే ధని సిద్ధార్థని ఏం చేసింది? వీరిద్దరి ప్రేమ కథకు టైం ట్రావెల్ కి అసలు లింక్ ఏమిటి అనేవి తెలియాలంటే సినిమా మొత్తం చూడాల్సిందే. 


విశ్లేషణ 
ఈ మధ్యకాలంలో లవ్ రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్లు తగ్గిపోయి ఎక్కువగా సైన్స్ తో కూడిన సినిమాలను చేసేందుకు దర్శక నిర్మాతలు ఆసక్తి చూపిస్తున్నారు. మరి ముఖ్యంగా సైంటిఫిక్ థ్రిల్లర్లను, టైం ట్రావెల్ కాన్సెప్ట్ ఉన్న సినిమాలను ప్రేక్షకులు ఆదరిస్తున్న నేపథ్యంలో ఈ సినిమా దర్శకుడు జయతీర్థ కూడా అదే కాన్సెప్ట్ ఎంచుకున్నారు ఒక వ్యక్తి టైం లూప్ లో చిక్కుకుంటే ఎలాంటి పరిణామాలు ఎదురవుతాయి అనే విషయాన్ని ఆసక్తికరంగా చూపించేందుకు ప్రయత్నించి అందులో దాదాపు సఫలమయ్యాడు. సాధారణంగా టైం లూప్ లో చిక్కుకోవడం వేరు అలా చిక్కుకున్నామని భ్రమ పడటం వేరు. ఇక్కడ టైం లూప్ లో చిక్కుకున్నానని భ్రమ పడుతూనే టైం లూప్ లో చిక్కుకున్నట్లుగా మనందరిని భ్రమింప చేస్తాడు హీరో. నార్కో అనాలసిస్ పరీక్షల మీద రీసెర్చ్ చేస్తుండే కెమిస్ట్రీ ప్రొఫెసర్ తన కుమార్తెను మోసం చేసిన వ్యక్తి మీద ఎలా పగ తీర్చుకున్నాడు అనేది ఈ సినిమా కథ. కథగా చూస్తే కొన్నిచోట్ల లోపాలు కనిపిస్తాయి కానీ ఓవరాల్ గా ఈ సినిమా ఆద్యంతం ఆకట్టుకునే విధంగా సాగుతుంది. కొన్ని చోట్ల ప్రేక్షకులు మాంచి థ్రిల్ ఫీల్ అవుతారు. 


నటీనటులు
నటీనటుల విషయానికి వస్తే ఈ సినిమాలో హీరోగా నటించిన జైద్ ఖాన్ కి ఇది మొదటి సినిమా. అయినా ఎక్కడా కూడా ఇది తన మొదటి సినిమా అని ప్రేక్షకులు ఫీలయ్యే విధంగా నటించలేదు. పదుల సినిమాల అనుభవం ఉన్న నటుడిగా ఆయన ఆకట్టుకున్నాడు. ఇక హీరోయిన్ పాత్రలో సోనాల్ అద్భుతమైన ప్రదర్శన చేసింది. ఇటీవల కాంతార సినిమాతో మంచి పేరు తెచ్చుకున్న అచ్యుత్ కుమార్ కూడా తన పాత్రకు తగిన విధంగా నటించి ఆకట్టుకున్నాడు. అలాగే మిగతా పాత్రధారులు అందరూ కన్నడ వారు అవడంతో తెలుగు ప్రేక్షకులకు పెద్దగా పరిచయం లేదు కానీ శంభు పాత్రలో నటించిన వ్యక్తి తనదైన నటనతో ఆకట్టుకున్నాడు. ఇక మిగతా పాత్రల వారు కూడా ఎవరి పరిధిలో వారు నటించి ఆకట్టుకునే ప్రయత్నం చేశారు.


సాంకేతిక విభాగం  
'బనారస్' ఫస్టాఫ్ క్యూట్ అండ్ మ్యూజికల్ లవ్ స్టోరీగా సాగుతూనే  సెకండాఫ్ థ్రిల్లింగ్ టైమ్ ట్రావెల్ / లూప్ ఎంటర్‌టైనర్గా మలచబడి సాగుతుంది. సినిమా మొత్తం మంచి పాటలు, విజువల్స్, ఎమోషన్స్, ఆర్టిస్టుల పెర్ఫార్మన్స్ తో సెకండాఫ్‌లో ఒక సర్‌ప్రైజ్ ఎలిమెంట్ తో ఆద్యంతం అలరించే విధంగా ప్లాన్ చేసుకున్నారు. జీవిత సత్యాన్ని చెప్పడానికి బనారస్ (కాశీ) నేపథ్యాన్ని దర్శకుడు జయతీర్థ ఎంపిక చేసుకున్నారు. ఇక తనదైన పనితనంతో సినిమాటోగ్రాఫర్ అద్వైత గురుమూర్తి ఆకట్టుకున్నారు. పాటల చిత్రీకరణ సినిమాకు అసెట్ అలాగే కాసర్ల శ్యామ్ సాహిత్యం ఆకట్టుకుంది. కాంతార మ్యూజిక్ డైరెక్టర్ అజనీష్ లోక్‌నాథ్ మంచి పాటలు, నేపధ్య సంగీతం అందించి సినిమాను మరో లెవల్ కు తీసుకువెళ్లారు. నిర్మాణ విలువలు ఎక్కడా వంక పెట్టని విధంగా ఉన్నాయి. 


ఫైనల్ గా: 
ఒక సైంటిఫిక్ థ్రిల్లర్ మూవీ అయినా ప్రేమ అనే ఎమోషన్ కూడా తోడవడంతో సినిమా ఆద్యంతం ఆకట్టుకుంటుంది. 
 
రేటింగ్: 2.75/5


Also Read: Samantha-Amala: మినిమం కామన్ సెన్స్ లేదా.. అక్కినేని అమలను ఆటాడుకుంటున్న నెటిజన్స్!


Also Read: Kajal Aggarwal Sizzling Photos: మళ్లీ హాట్ షో మొదలెట్టిన కాజల్.. పొట్టిబట్టల్లో రెచ్చిపోయిందిగా!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook