Alai Balai: అలయ్ బలయ్‌లో సందడి చేసిన సినీ, రాజకీయ ప్రముఖులు, ఒకే వేదికపై పవన్, విష్ణు
Bandaru Dattatreyas Alai Balai Celebrations : హైదరాబాద్‌లోని అలయ్ బలయ్ కార్యక్రమానికి పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు. ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్, మా నూతన అధ్యక్షుడు మంచు విష్ణు, నటుడు కోట శ్రీనివాసరావు, తదితరులు హాజరయ్యారు.
Bandaru Dattatreyas Alai Balai Celebrations in Jalavihar hyderabad attended Vice President Venkaiah Naidu Pawan Kalyan Manch Vishnu and others: హైదరాబాద్ నగరంలో జలవిహార్‌లో అలయ్ బలయ్ కార్యక్రమం అట్టహాసంగా సాగుతోంది. హరియాణా గవర్నర్ దత్తాత్రేయ కుమార్తె (Dattanna's daughter) విజయలక్ష్మి (Vijayalakshmi) ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం సాగుతోంది. అలయ్ బలయ్ కార్యక్రమానికి పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు. ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు, (Venkaiah Naidu) హిమాచల్‌ప్రదేశ్ గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్, తెలంగాణ గవర్నర్ తమిళిసై, (tamilisai) భారత్ బయోటెక్ ఛైర్మన్ కృష్ణ ఎల్ల, బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు లక్ష్మణ్ హాజరయ్యారు. అలాగే జనసేన అధినేత పవన్ కల్యాణ్, (pawan kalyan) మా నూతన అధ్యక్షుడు మంచు విష్ణు, (manchu vishnu) నటుడు కోట శ్రీనివాసరావు, తదితరులు హాజరయ్యారు.
Also Read : Natyam movie trailer : నాట్యం మూవీ ట్రైలర్‌ను రిలీజ్ చేసిన రామ్ చరణ్
ఈ సందర్భంగా తెలంగాణ గవర్నర్ తమిళిసై సాంస్కృతిక కార్యక్రమాలను ప్రారంభించారు. అనంతరం తమిళిసై మహిళలతో కలిసి నృత్యం చేశారు. ఇక దుర్గామాత, జమ్మిచెట్టుకు వెంకయ్యనాయుడు పూజలు చేశారు. హైదరాబాద్ సీపీ అంజనీకుమార్ (Anjani Kumar) ఆధర్యంలో బందోబస్తు కొనసాగుతోంది.
ఈ కార్యక్రమంలో పలువురు ప్రముఖులను సన్మానించారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్‌తో పాటు ‘మా’ అధ్యక్షుడు మంచు విష్ణు (manchu vishnu) తదితరులను ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు సన్మానించారు.
Also Read : MAA Elections 2021: మా ఎన్నికల సీసీటీవీ ఫుటేజ్ సీజ్ చేసిన పోలీసులు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి