Bandi Sanjay Clarity on Jr Ntr Meeting With Amit Shah: కొద్దిరోజుల క్రితం బిజెపి ఆగ్రనేత అమిత్ షా టాలీవుడ్ టాప్ హీరో ఎన్టీఆర్ తో భేటీ అయిన సంగతి తెలిసిందే. అయితే ఆర్ఆర్ఆర్ సినిమాలో కొమరం భీం పాత్రలో నటించిన ఎన్టీఆర్ నటన నచ్చిన తర్వాత ఆయనను ప్రత్యేకంగా పిలిపించుకుని అభినందించారనే ప్రచారం జరిగింది. ఆ తర్వాత వీరిద్దరి భేటీ వెనుక రాజకీయ ఉద్దేశాలు కూడా ఉన్నాయని బిజెపి నేతలు లక్ష్మణ్, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, ఏపీ బిజెపి అధ్యక్షుడు సోమ వీర్రాజు వంటి వారు దానికి రాజకీయ ఉద్దేశాలు ఆపాదించే ప్రయత్నం చేశారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అంతేకాక కొందరైతే తెలుగుదేశానికి చెక్ పెట్టడానికి ఎన్టీఆర్ను రంగంలోకి దిగుతున్నారని బిజెపి తరఫున ప్రచారం చేస్తారని కూడా ప్రచారం చేశారు. తాజాగా ఈ విషయం మీద బిజెపి తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ స్పందించారు. అసలు ఆ రోజు ఏం జరిగిందనే విషయం మీద ఆయన క్లారిటీ ఇచ్చారు. ఎందుకంటే ఆరోజు వీరు భేటీ అయిన సమయంలో ఎన్టీఆర్ ను ఆహ్వానించి అమిత్ షా దగ్గర వరకు తీసుకు వెళ్లింది బండి సంజయ్ మాత్రమే. ఇక తాజాగా ఈ విషయం మీద స్పందించిన ఆయన అమిత్ షా ఎన్టీఆర్ను కలవడం కొందరు టిడిపికి చెక్ పెట్టడానికి అనుకుంటున్నారు.


మరికొందరి ఏమో సంధి కుదుర్చుకోడానికి అంటున్నారు. కానీ ఇవి రెండు కరెక్ట్ కాదని ఆయన చెప్పుకొచ్చారు. సినిమా చూసినప్పుడు అమిత్ షా గారు చాలా ఎక్సైట్ అయ్యి ఎన్టీఆర్ కు ఫోన్ చేసి మాట్లాడారని అదే క్రమంలో అమిత్ షా తెలంగాణకు వచ్చినప్పుడు కలవాలని ఉందని చెప్పి పిలిపించుకుని మాట్లాడారు తప్ప ఇందులో రాజకీయ ఉద్దేశాలు లేవని క్లారిటీ ఇచ్చారు. నేను కూడా అక్కడే ఉన్నానన్న ఆయన సినిమా గురించి చెచర్చ జరిగింది తప్ప రాజకీయాలు చర్చకి రాలేదని అన్నారు.


ఇక అమిత్ షా సీనియర్ ఎన్టీఆర్ గురించి వారి కుటుంబ సభ్యులకు గురించి కూడా అడిగి తెలుసుకున్నారని, ఈ సమయంలో రాజకీయాల ప్రస్తావనే రాలేదని బండి సంజయ్ పేర్కొన్నారు. మరోపక్క జేపీ నడ్డా నిఖిల్ ని కలవాలని కోరితే లోకల్ బిజెపి నేతలు నితిన్ కు సమాచారం ఇచ్చి ఆయన కలిసేలా చేశారని ప్రచారం జరుగుతుంది. ఈ విషయం మీద మాత్రం ఆయన ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు.


Also Read: God Father Movie Postponed: గాడ్ ఫాదర్ వాయిదాపై పెదవి విప్పిన నిర్మాత


Also Read: Boycott Brahmastra : రిలీజ్ కు ముందు బాయ్ కాట్ టెన్షన్.. నెటిజన్లు చెబుతున్న కారణాలివే!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి