Pawan Kalyan And Renu Desai Divorce పవన్ కళ్యాణ్‌ జీవితంపై త్రివిక్రమ్ ప్రభావం ఎక్కువగా ఉంటుందన్న సంగతి తెలిసిందే. ఈ ఇద్దరి రిలేషన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. పవన్ కళ్యాణ్‌ స్పీచులన్నీ కూడా త్రివిక్రమ్ డిజైన్ చేస్తాడని అంటుంటారు. అయితే పవన్ కళ్యాణ్‌ త్రివిక్రమ్ బాండింగ్ వల్ల బండ్ల గణేష్‌ దూరంగా ఉండాల్సి వస్తోందని అర్థం అవుతోంది. పవన్ కళ్యాణ్‌ గురించి చెప్పాలన్నా, పొగడాలన్నా బండ్ల గణేష్‌ తరువాతే త్రివిక్రమ్ పేరు చెప్పుకోవాల్సిందే. అందుకే అభిమానులు ప్రతీ ఈవెంట్లో బండ్ల గణేష్‌ ఉండాలని కోరుకుంటారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కానీ భీమ్లా నాయక్ సినిమా ఈవెంట్ విషయంలో వివాదం రేగింది. తనను త్రివిక్రమ్ అడ్డుకుంటున్నాడని, తనను కావాలనే పిలవడం లేదని బండ్ల గణేష్ మాటలు లీక్ అయిన సంగతి తెలిసిందే. మొదట్లో ఆ ఆడియో తనది కాదని బుకాయించాడు. తరువాత అవి తన మాటలే అని, త్రివిక్రమ్‌ను తిట్టానని ఒప్పేసుకున్నాడు. ఇలా బండ్ల గణేష్ త్రివిక్రమ్ మధ్య కోల్డ్ వార్ ఉందని అందరికీ మరోసారి అర్థమైంది. ట్విట్టర్‌లో బండ్ల గణేష్ అప్పుడప్పుడు గురూజీ అంటూ కౌంటర్లు వేస్తుంటాడు.


 



తాజాగా ఓ నెటిజన్‌కు బండ్ల గణేష్‌ ఇచ్చిన రిప్లై వైరల్ అవుతోంది. నాకు నిర్మాత కావాలని ఉంది బండ్లన్న అని ఓ నెటిజన్ సలహా అడిగాడు. గురూజీని కలువు.. కాస్ట్ లీ గిఫ్ట్ ఇవ్వు అంటూ కౌంటర్లు వేశాడు బండ్ల గణేష్. ఆ తరువాత మరో నెటిజన్‌ అడిగిన ప్రశ్నకు రిప్లై ఇవ్వడం, దానికి ఇచ్చిన సమాధానంతో కాక రేపినట్టు అవుతోంది. గురూజీకి కథ చెబితే.. స్క్రీన్ ప్లే రాసి.. దానికి తగ్గట్టు మళ్లీ కథను మార్చి.. అసలు అనుకున్న కథను షెడ్డుకు పంపిస్తాడట కదా? అని అడిగాడు ఓ నెటిజన్.


Also Read:  Ram Charan Speech : నందమూరి అభిమానుల మనసు గెలిచిన రామ్ చరణ్.. ఎన్టీఆర్‌పై స్పీచ్ అదుర్స్


దానికి బండ్ల గణేష్‌ ఇలా సమాధానం ఇచ్చాడు. అదే కాదు  భార్యాభర్తల్ని. తండ్రి కొడుకుల్ని గురుశిష్యుల్ని  ఎవర్నైనా వేరు చేస్తాడు అనుకుంటే అది మన గురూజీ స్పెషాలిటీ అంటూ బండ్ల గణేష్ కౌంటర్లు వేశాడు. దీంతో పవన్ కళ్యాణ్‌ రేణూ దేశాయ్ విడాకుల వ్యవహారం వెనుక కూడా త్రివిక్రమ్ ఉన్నాడా? అని నెటిజన్లు అనుకుంటున్నారు.


Also Read:  Anasuya Bikini Pics : మొదటి సారిగా బికినీలో అనసూయ.. ఫ్యామిలీ ఫ్యామిలీ మునిగిందిగా?.. పిక్స్ వైరల్



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook