Bandla Ganesh on Trivikram బండ్ల గణేష్‌ పవన్ కళ్యాణ్‌ మధ్య ఉన్న బంధం ఏంటన్నది అందరికీ తెలిసిందే. బండ్ల గణేష్‌కు అయితే పవన్ కళ్యాణ్‌ దేవుడు. ఓ భక్తుడిలానే బండ్ల గణేష్‌ భజన చేస్తుంటాడు. కానీ పవన్ కళ్యాణ్ నుంచి బండ్ల గణేష్‌కు అంతే ప్రేమ, ఆదరణ వస్తుందా? అంటే చెప్పలేం. పవన్ కళ్యాణ్‌ ఎక్కువగా త్రివిక్రమ్ మార్గదర్శకత్వంలో నడుస్తున్నట్టుగా అనిపిస్తుంది. ఇక భీమ్లా నాయక్ ఈవెంట్‌కు బండ్ల గణేష్‌ను కావాలనే త్రివిక్రమ్ దూరం పెట్టాడట.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

వకీల్ సాబ్ ఈవెంట్‌లో పవన్ కళ్యాణ్ స్పీచ్‌ కంటే.. బండ్ల గణేష్‌ స్పీచ్‌కే అంతా ఫిదా అయ్యారు. అలా భీమ్లా నాయక్ ఈవెంట్లో ఏదైనా జరుగుతుందని బండ్ల గణేష్‌ను పిలవొద్దని దూరంగా ఉంచాడట త్రివిక్రమ్. ఈ విషయాన్ని బండ్ల గణేష్‌ స్వయంగా తెలుపగా.. ఆ ఆడియో లీకైంది. మొదట్లో ఆ వాయిస్ తనది కాదని బుకాయించాడు. మళ్లీ చివరకు ఆ వాయిస్ నాదే.. నేనే త్రివిక్రమ్‌ని తిట్టాను అని ఒప్పుకున్నాడు.


అలా బండ్ల గణేష్‌ త్రివిక్రమ్ మధ్య కాస్త గ్యాప్ ఏర్పడింది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గబ్బర్ సింగ్ రెమ్యూనరేషన్ విషయంలో చేసిన కామెంట్లు బండ్ల గణేష్‌కు డ్యామేజ్‌ను ఏర్పర్చింది. దీంతో బండ్ల గణేష్‌ హర్ట్ అయ్యాడని కామెంట్లు వచ్చాయి. కానీ తాను తన దేవుడి మీద ఎందుకు కోప్పడతాను అని, తన దేవుడు ఎప్పటికీ పవన్ కళ్యాణ్ అని చెప్పుకొచ్చాడు బండ్ల గణేష్‌.


 



తాజాగా బండ్ల గణేష్‌ వేసిన ట్వీట్ చూస్తే అది త్రివిక్రమ్ మీద కౌంటర్ వేసినట్టుగా, తన గురించి తాను గొప్ప భక్తుడిని అని చెప్పుకున్నట్టుగా ఉంది. మోసం చేయాలనుకునే వాడు మేధావిలా నటిస్తాడు.. వంచించాలనుకునేవాడు గురువులా నటిస్తాడు.. కానీ నిజాయితీగా ఉండేవాడు ఎప్పుడు భక్తుడు గానే పొగరుగా ఉంటాడు. అది మీకు నచ్చినా నచ్చకపోయినా.. అంటూ ట్వీట్ వేశాడు.


Also Read:  Basil Joseph Blessed with Baby Girl : తండ్రైన దర్శకుడు!.. ఆనందంలో తేలిపోతోన్న నటుడు


Also Read: Dhanush - Hyper Aadi : హైపర్ ఆది ఎందుకు ఫేమస్ అయ్యాడో తెలీదన్న ధనుష్.. స్టేజ్ మీదే కాళ్లు మొక్కేసిన కమెడియన్



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitterFacebook