Bandla Ganesh - Jogi Naidu : జగన్‌ని నమ్ముకున్నందుకు జోగి నాయుడుకి కూడా పదవి.. బండ్ల గణేష్ ట్వీట్ వైరల్
Jogi Naidu appointed as ap culture and creative head సినిమా ఇండస్ట్రీ నుంచి వైఎస్ జగన్‌కు గానీ, ఏపీ ప్రభుత్వానికి మద్దతు ఇచ్చే వారు చాలా తక్కువ మంది ఉంటారు. అయితే వైఎస్ జగన్‌ను నమ్ముకున్న సెలెబ్రిటీలకు మాత్రం తగిన గుర్తింపు ఇస్తున్నట్టుగా కనిపిస్తోంది.
Bandla Ganesh on Jogi Naidu టాలీవుడ్ కమెడియన్ జోగి నాయుడికి ఏపీ ప్రభుత్వంలో కీలక పదవి దక్కింది. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర క్రియేటివిటీ అండ్ కల్చర్ కమిషన్ క్రియేటివ్ హెడ్‌గా నియమించారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రజత్ భార్గవ్ ఉత్తర్వులు జారీ చేశారు. గత ఎన్నికల్లో వైఎస్సార్ సీపీ తరుపున జోగి నాయుడు ఉవ్వెత్తున ప్రచారం చేసిన సంగతి తెలిసిందే.
జోగి నాయుడికి ఇలా పదవి కట్టపెట్టడంతో బండ్ల గణేష్ స్పందించాడు. జగన్ గారి ని నమ్ముకున్నందుకు జోగి నాయుడు కి కూడా పదవి ఆల్ ది బెస్ట్ తమ్ముడు అంటూ బండ్ల గణేష్ ట్వీట్ వేశాడు. ఇది ఇప్పుడు నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది.
ఈ ట్వీట్ మీద జనసైనికులు, నెటిజన్లు మండి పడుతున్నారు. త్రివిక్రమ్ విడిని ఎందుకు రానివ్వలేదో ఇప్పుడు అర్థం అయింది అని ఒకరు.. మరి నమ్మి 151 సీట్లు ఓట్లేసి గెలిపించారు కదా జనాలు! వాళ్ళది నమ్మకం కాదా? అని ఇంకొకరు.. కళ్యాణ్ గారు కొందరిని దూరంగా ఉంచడమే మంచింది... ఊసరవెల్లి కంటే వేగంగా రంగులు మారుస్తున్నారు.. అని బండ్ల గణేష్‌ను ఏకిపారేస్తున్నారు జనాలు.
వీడి చిన్న పిల్లల బుద్ది.... నమ్ముకున్నందుకు ప్రజలకి ఎమైన చేస్తె పొగడాలి . అసలెం మాట్లాడుతాడొ వీడికె తెలిదు ట్విట్టర్ వాడటం రాకపోతే గు.. ముసుకొ కాని ఇష్టం వచ్చినట్టు ట్వీటు చేయకు రా బాబు అన్ని డాంట్లొ వెళ్లు పెడతావు అని దారుణంగా తిడుతున్నారు. ఆంధ్రప్రజల సొమ్మును తినడానికి ఏవేవో పదవులు సృష్టించి, వాటిని ఇలా పనికిరాని వారికి కట్టబెట్టి ప్రజల సొమ్ము దోచుకుంటున్న వైఎస్ జగన్ అంటూ ఇలా దారుణంగా తిట్టేస్తున్నారు.
బండ్ల గణేష్ వేసిన ట్వీట్లు ఎప్పుడూ ఇలానే కాంట్రవర్సీకి దారి తీస్తుంటాయి. బండ్ల గణేష్ ఇలా వైఎస్ జగన్‌ను పొగుడుతూ ట్వీట్ వేయడంతో.. జన సైనికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పై విధంగా బండ్ల గణేష్‌ను ట్రోల్ చేస్తూ బండ బూతులు తిడుతున్నారు.