Bappi Lahiri Passes Away: భారతీయ చిత్ర పరిశ్రమలో విషాదం నెలకొంది. ప్రముఖ సంగీత స్వరకర్త, గాయకుడు బప్పి లహిరి (69) బుధవారం కన్నుమూశారు. గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో సతమతమవుతున్న ఆయన.. ఇటీవలే ముంబయిలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేరారు. బుధవారం ఆరోగ్యం మరింతగా క్షీణించగా.. తుదిశ్వాస విడిచినట్లు ఆస్పత్రి వర్గాలు చెబుతున్నాయి. ఆయన మృతికి పలువురు సినీ ప్రముఖులు సంతాపాన్ని ప్రకటిస్తున్నారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

1970 -80 లలో 'చల్తే చల్తే', 'డిస్కో డాన్సర్', 'షరాభి' వంటి అనేక బాలీవుడ్ చిత్రాలకు ఆయన సంగీతాన్ని అందించారు. హిందీ చిత్ర సీమలో చివరిగా 'భాఘీ 3' సినిమాలో 'భంకాస్' అనే పాటను ఆలపించారు.  



తెలుగులో బప్పి లహిరి పాటలు చాలా పాపులర్ అయ్యాయి. చిరంజీవి సినిమాల్లోని అనేక పాటలను ఆయన పాడారు. 2020లో తెలుగులో విడుదలైన రవితేజ 'డిస్కో రాజా' సినిమాలోనూ 'రమ్ పమ్ పమ్' సాంగ్ (చివరి తెలుగు పాట) ను రవితేజతో కలిసి ఆలపించారు. 


Also Read: Deep Sidhu Death: రోడ్డు ప్రమాదంలో నటుడు దుర్మరణం.. ఎర్రకోట హింస కేసులో నిందితుడు!


Also Read: Shraddha Das Photos: మోడ్రన్ డ్రస్సులో అలరిస్తున్న అల్లు అర్జున్ హీరోయిన్


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook