పంజాబీ యుద్ధవీరుడైన కేసరి పాత్రలో నటుడు అక్షయ్ కుమార్ తన అభిమానులను అలరించనున్నారు. కరణ్ జోహార్‌తో కలిసి తానే స్వయంగా "కేసరి" అనే సినిమా నిర్మిస్తున్నారు. అనురాగ్ సింగ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం సర్గాహీ యుద్ధం నేపథ్యంలో సాగుతుంది. వేలమంది ప్రత్యర్థులను కేవలం 21 మంది సిక్కు సైనికులు ఎదిరించడమే కేసరి కథ. గులిస్తాన్ కోటలను ఆప్ఘన్ల నుండి కాపాడడమే లక్ష్యంగా చేసుకున్న సిక్కువీరుల కథ ఇది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


1897లో ఈ యుద్ధం జరిగింది. "బోలే సో నిహాల్.. సత్ శ్రీ అకాల్" అన్న నినాదంతో మడమ తిప్పని ధైర్యంలో సిక్కువీరులు ఎలా తమ ఆత్మగౌరవాన్ని కాపాడుకోవడం కోసం పోరాటం చేశారన్నదే ఈ చారిత్రక కథాంశం. గతంలో రాజ్ కుమార్ హిరాణీతో పాటు అజయ్ దేవగన్ లాంటి వారు ఈ కథను తెరకెక్కించాలని చూశారు. అయితే అనుకోని కారణాల వల్ల అవి సినిమా పట్టాలెక్కలేదు. ప్రస్తుతం అక్షయ్ కుమార్ ధైర్యం చేయడంతో ఈ సినిమాపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.