BB 7 Telugu 4th Week Voting Result: తెలుగు పాపులర్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 07 ఊహించని ట్విస్టులతో దూసుకుపోతుంది. ఇప్పటికే ముగ్గురు కంటెస్టెంట్స్ హౌస్ నుంచి ఎలిమినేట్ కాగా.. ప్రస్తుతం హౌస్ లో 11 మంది మాత్రమే ఉన్నారు. నాలుగో వారం నామినేషన్స్ లో ఆరుగురు ఉన్నారు. వారే ప్రియాంక జైన్, శుభ శ్రీ, గౌతమ్ కృష్ణ, రతిక రోజ్, ప్రిన్స్ యావర్, టేస్టీ తేజ. ప్రస్తుతం ఓటింగ్ ప్రక్రియ జోరుగా సాగుతోంది. వీరిలో అధికంగా ఓట్లతో కండలవీరుడు ప్రిన్స్ యావర్ టాప్ ప్లేస్ లో ఉన్నాడు. అందరూ అతడిని టార్గెట్ చేయడం, జెన్యూన్ గా గేమ్ ఆడటం అతడి ఓటు బ్యాంక్ పెరగడానికి కారణాలుగా తెలుస్తోంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇక రెండో స్థానంలో మరో బాడీ బిల్డర్, డాక్టర్ బాబు గౌతమ్ కృష్ణ ఉన్నారు. గత మూడు వారాలుగా నామినేషన్స్ ఓటింగ్ లో ఆఖరి నాలుగు స్థానాల్లో ఉంటూ వస్తున్న గౌతమ్ ఈసారి ఒక్క ఎపిసోడ్ తో టాప్ 2లోకి దూసుకొచ్చాడు. నామనేషన్స్ సమయంలో అతడి చెప్పిన రీజన్స్ ను జ్యూరీ సభ్యులు సిల్లీగా ఉన్నాయని అనడం, దాంతో అతడు కాంప్రమైస్ కాకుండా తన వాదనను గట్టిగా వినిపించడం మరియు స్మైల్ ఫొటో టాస్కులో బాగా ఆడటం.. గౌతమ్ ఓటు బ్యాంకు పెరిగేలా చేసింది. 


ప్రస్తుతం ప్రిన్స్ యావర్‍ 29.2 శాతంతో ఫస్ట్ ప్లేస్, 18.6 శాతంతో గౌతమ్ కృష్ణ సెకండ్ ప్లేస్ లో ఉన్నాడు.  17.55 శాతం ఓట్లతో ప్రియాంక జైన్ మూడో స్థానంలోనూ, 15.29 శాతం ఓట్లతో నాలుగో స్థానంలో శుభ శ్రీ రాయగురు,  10.84 శాతం ఓట్లతో ఐదో స్థానంలో రతిక రోజ్ ఉన్నారు. ఇక  చివరి స్థానంలో 8.52 శాతంతో టేస్టీ తేజ కొనసాగుతున్నాడు. ఈ వారం తేజ, రతికల్లో ఒకరు ఎలిమినేట్ అయ్యే  అవకాశం ఉంది. చాలా మంది ఆడియెన్స్ రతికను ఎలిమినేట్ కావాలని కోరుకుంటున్నారు. 


Also Read: Mister Pregnant OTT: ఓటీటీలోకి రాబోతున్న 'మిస్టర్ ప్రెగ్నెంట్'.. స్ట్రీమింగ్ ఎప్పుడు, ఎక్కడంటే?



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook