Beast Movie hero Thalapathy Vijay reveals why he is avoided media for 11 years: కోలీవుడ్ స్టార్ హీరో 'దళపతి' విజయ్‌, బుట్టబొమ్మ పూజా హెగ్డే జంటగా నటించిన తాజా చిత్రం 'బీస్ట్‌'. 'డాక్ట‌ర్' ఫేం నెల్సన్‌ దిలీప్‌ కుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీని సన్‌ పిక్చర్స్‌ బ్యానర్‌పై కళానిధి మారన్‌ నిర్మించారు. వేసవి కానుకగా ఏప్రిల్ 13న బీస్ట్‌ చిత్రం ప్రేక్షకుల ముందుకు వస్తోంది. సినిమా విడుదలకు సమయం దగ్గరపడుతుండడంతో చిత్ర బృందం ప్రమోషన్స్ కార్యక్రమాలను వేగవంతం చేసింది. ఇందులో భాగంగా హీరో విజయ్‌ ఓ చానెల్‌ కి ఇంటర్వ్యూ ఇచ్చారు. అందులో ఆసక్తికర విషయాలు పంచుకున్నారు దళపతి.   


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇంటర్వ్యూలు ఇవ్వడానికి సమయం లేనంత బిజీగా లేనని.. ఇంటర్వ్యూలకు కూడా సమయం కేటాయించగలనని విజయ్‌ అన్నారు. అయితే 10-11 ఏళ్ల  క్రితం ఒక చేదు ఘటన జరిగిందని, తాను ఇంటర్వ్యూలకు దూరం కావడానికి అదే ముఖ్య కారణంగా తెలిపారు. తాను అప్పట్లో ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలోని మాటలను మీడియా మరోలా రాసుకుందని, అది పెద్ద వివాదాస్పదంగా మారిందని విజయ్ చెప్పారు. ఆ ఘటన తర్వాత కొంతకాలం మీడియాకు దూరంగా ఉండాలని తాను నిర్ణయించుకున్నానని తెలిపారు. అయితే ఆ సంఘటన ఏంటనేది మాత్రం దళపతి చెప్పలేదు.


ఆ సంఘటనపై వార్తలు చూసి షాకయ్యారని విజయ్ తెలిపారు. ఆ వార్తలపై తన కుటుంబసభ్యులు, స్నేహితులు స్పందించి నువ్వు ఇలా మాట్లాడావంటే నమ్మలేకపోతున్నామని చెప్పరట. జరిగిన విషయం కుటుంబసభ్యులు, స్నేహితులకు చెప్పగలను కానీ అందరికీ చెప్పడం కష్టం అని దళపతి పేర్కొన్నారు. ఏదేమైనా పదేళ్లు మీడియాకు దూరంగా ఉన్నారని విజయ్‌ చెప్పుకొచ్చారు. గతంలో విజయ్‌ సినిమా వార్తలు మాత్రమే చదివేవారట, ప్రస్తుతం మాత్రం అన్నిరకాల వార్తలు చదువుతున్నాని చెప్పారు. ప్రస్తుతం అన్నీ ఫాలో అవుతున్నానని, రాష్ట్రంలోని అధికారులు చక్కగా పని చేస్తున్నారని బీస్ట్ హీరో ప్రశంసించారు. 


తాజాగా బీస్ట్ సినిమా ట్రైలర్ అన్ని భాషల్లో విడుదల అయింది. తెలుగులో విజయ్‌కు ఉన్న ఫాలోయింగ్‌ను దృష్టిలో పెట్టుకుని 2 నిమిషాల 55 సెకండ్ల నిడివి గల వీడియోను మేకర్స్ విడుదల చేశారు. షాపింగ్‌ మాల్‌ను హైజాక్‌ చేసిన ఉగ్రవాదులను ఒక గూఢాచారి ఎలా అంతమొందిచాడన్నదే సినిమా కథ. అనిరుధ్‌ రవిచంద్రన్‌ సంగీతం అందించగా.. సినిమాలోని పాటలు ఇప్పటికే సంచనలం సృస్టిస్తునాయి. పాటలు, ట్రైలర్ సినిమాపై భారీ హైప్ క్రియేట్ చేశాయి. 


Also Read: Karthikeya 2: కార్తికేయ -2 రిలీజ్ డేట్ వచ్చేసింది.. ఎప్పుడో తెలుసా?


Also Read: Dipika Pallikal: రెండు టైటిల్స్‌ గెలిచాం.. ఇప్పటికైనా టాప్స్‌లో చేర్చాలని కోరుకుంటున్నాం: దీపిక


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook