Kriti Shetty: అందంగా ఉండాలంటే..దీనికి దూరంగా ఉండాలి.. బ్యూటీ సీక్రెట్స్ బయటపెట్టేసిన నటి
Kriti Shetty skin care secrets: నటనతో మాత్రమే కాక అందంతో కూడా అందరి మనసులను కొల్లగొట్టే కృతి శెట్టి తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. తన స్కిన్ కేర్ రొటీన్ గురించి చెప్పేసింది. తన అందమైన చర్మం వెనుక ఉన్న సీక్రెట్ ల గురించి బోలెడు ఆసక్తికరమైన విషయాలను అభిమానులతో పంచుకుంది. దీనికి సంబంధించిన వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
Kriti Shetty beauty secrets: ఇండస్ట్రీలో ఉన్న అందమైన టాలెంటెడ్ హీరోయిన్లలో కృతి శెట్టి కూడా ఒకరు. ఉప్పెన సినిమాతో హీరోయిన్ గా ఇండస్ట్రీకి పరిచయం అయిన ఈ భామ మొదటి సినిమాతోనే బ్లాక్ బస్టర్ అందుకుంది. శ్యామ్ సింఘా రాయ్, బంగార్రాజు వంటి సినిమాలతో సూపర్ హిట్లు అందుకున్న ఈ భామ ఈ మధ్య వరుస పరాజయాలతో స్పీడ్ తగ్గించింది. అయితే తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ కృతి శెట్టి తన స్కిన్ కేర్ రొటీన్ గురించి బోలెడు ఆసక్తికరమైన విషయాలు బయట పెట్టింది.
"నాకు స్కిన్‌కేర్ రొటీన్ చేయడం నాకు థెరప్యూటిక్‌గా అనిపిస్తూ ఉంటుంది. అందుకే నేను సమయం తీసుకుని డబుల్-క్లీన్సింగ్ చేస్తాను” అని ఆమె చెప్పుకొచ్చింది కృతి శెట్టి. మేకప్‌లో కూడా తనదైన ముద్ర వేసే కృతి, వర్క్‌షాప్‌లు, యూట్యూబ్ వీడియోలను చూసి మరి మంచి అనుభవాన్ని సంపాదించిందట. "ప్రతిఒక్కరికీ తమదైన ఒక అందమైన స్టైల్ ఉంటుంది, అది నేర్చుకోవాలంటే చాలా ఉంది" అని చెబుతుంది ఈ బ్యూటీ.
మేకప్ విషయంలో కృతి శెట్టి తన మొదటి జ్ఞాపకం గురించి చెబుతూ.. "చిన్నప్పుడు మా స్కూల్ లో ఒకసారి బుక్ ఫెయిర్‌లో జరిగింది. అప్పటికి నేను మూడో తరగతిలో ఉండేదాన్ని. దానికోసం నేను మా అమ్మని డబ్బు అడిగాను. మా అమ్మ చాలా ఆనందంగా.. వావ్, నా కూతురు పుస్తకాలు కొనుక్కుంటుంది అని అనుకుంది. కానీ నేను హౌ టూ బి గార్జియస్ అనే పుస్తకం కొనుక్కొని ఇంటికి తీసుకొచ్చాను. అది చూసి మా అమ్మ ఆశ్చర్యపోయింది," అని పంచుకుంది కృతి శెట్టి.
కృతి శెట్టి స్కిన్‌కేర్ రొటీన్:
తన చర్మాన్ని ఎలా కాపాడుకుంటారు అని అడగగా.. కృతి "సన్‌స్క్రీన్ పెట్టుకోవడం, డబుల్ క్లీన్సింగ్ చేయడం నా చర్మాన్ని బాగా మెరుగుపరిచాయి. అలాగే నేను టోనర్, సీరమ్ కూడా వాడుతాను. నా సీరమ్ గ్లో రిసిపి నుండి వాడతాను.. కానీ నా టోనర్లు ఎప్పటికప్పుడు మారిపోతుంటాయి. ఇప్పుడు నేను అనువా నుండి ఒక సూథింగ్ టోనర్ వాడుతున్నాను," అని బ్యూటీ సీక్రెట్స్ బయట పెట్టేసింది కృతి.
అందమైన చర్మం కోసం ఒక స్కిన్‌కేర్ రూల్ గురించి చెప్పమని అడిగితే, "షుగర్ నుంచి దూరంగా ఉండటం. ఇది నా చర్మం విషయంలో చాలా పెద్ద మార్పు తీసుకొచ్చింది. ఏ ప్రోడక్ట్ కూడా అంత మంచి ప్రభావం చూపలేదు" అని చెప్పింది కృతి.
కృతి శెట్టి మోర్నింగ్ రొటీన్:
తన మార్నింగ్ రొటీన్ గురించి చెబుతూ.. "నా ఉదయం రొటీన్ గా సింపుల్ గా ఉంటుంది. కానీ అది నాకు ప్రశాంతత ఇస్తుంది. బిజీ డే ప్రారంభం అయ్యే ముందు నేను నా ముఖాన్ని శుభ్రం చేసుకుంటాను, కొంచెం లిప్ టింట్ వేసుకుంటాను" అని అంటోంది.
Also Read: Infinix Zero 40: కేక పెట్టించే ఫీచర్లు, 108MP ప్రైమరీ, 50MP సెల్ఫీ కెమేరాతో Infinix
Also Read: Malaika father Suicide: స్టార్ నటి మలైకా అరోరా తండ్రి ఆత్మహత్య.. 7వ ఫ్లోర్ నుంచి దూకి సూసైడ్..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.