Bellamkonda Sai Sreenivas: బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా మారి ఇవాల్టికి 10 ఏళ్ళు గడిచాయి. 2014లో వివి వినాయక్ దర్శకత్వంలో.. బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా నటించిన మొదటి సినిమా.. అల్లుడు శీను 2014లో ఇదే రోజున విడుదలైంది. సమంత ఈ సినిమాలో హీరోయిన్ గా నటించింది. మొదటి సినిమాతోనే బెల్లంకొండ కమర్షియల్ గా మంచి విజయాన్ని అందుకున్నారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

టాలీవుడ్ లో ఉన్న ప్రముఖ నిర్మాతలలో ఒకరైన బెల్లంకొండ సురేష్ తనయుడిగా.. బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు. చిన్నప్పటి నుంచి తన తండ్రి తో పాటే సినిమాలు చూస్తూ పెరిగిన బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కి చిన్నప్పటినుంచి సినిమాల మీద ఆసక్తి ఉంది. అదే ఆసక్తితో లాస్ ఏంజిల్స్ లోని లీ స్ట్రాస్బెర్గ్ థియేటర్ ఫిల్మ్ ఇన్‌స్టిట్యూట్ లోనూ.. ముంబైలోని బారీ జాన్ యాక్టింగ్ స్టూడియోలోనూ నటుడిగా శిక్షణ తీసుకున్నారు. 


నటుడిగా కఠోర ట్రైనింగ్ తీసుకున్న బెల్లంకొండ వియత్నాంలో మార్షల్ ఆర్ట్స్, స్టంట్స్ కూడా నేర్చుకున్నారు. అవి కూడా తన సినిమాలలో తనకి చాలా బాగా ఉపయోగపడ్డాయి అని చెప్పుకోవచ్చు. 


హీరోగా మారిన ఈ పదేళ్లలో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ఎన్నో ఆటంకాలను ఎదుర్కొన్నారు. ఎప్పటికప్పుడు మంచి సినిమాలతో ఇండస్ట్రీలో బౌన్స్ బ్యాక్ అవుతూనే వచ్చారు. స్పీడున్నోడు, జయ జానకి నాయక, సాక్ష్యం, కవచం, సీత, రాక్షసుడు, అల్లుడు అదుర్స్ ఇలా చాలా మంచి సినిమాలలో నటించిన బెల్లంకొండ.. నటుడిగా తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్నారు.


టాలీవుడ్ లో మంచి పేరు తెచ్చుకున్న బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ఈ మధ్యనే చత్రపతి హిందీ రీమేక్ సినిమాతో బాలీవుడ్ లో కూడా అడుగుపెట్టారు. ఇప్పుడు కూడా బెల్లంకొండ శ్రీనివాస్ చేతుల్లో కొన్ని ఆసక్తికరమైన ప్రాజెక్టులు ఉన్నాయి. 


అందులో మొదటి సినిమా 14 రీల్స్ ప్రొడక్షన్ పతాకంపై టైసన్ నాయుడు నిర్మిస్తున్న ఒక సినిమాలో బెల్లంకొండ హీరోగా నటిస్తున్నారు. ఈ సినిమాకి సాగర్ కె చంద్ర దర్శకత్వం వహిస్తున్నారు.  షైన్ స్క్రీన్స్ బ్యానర్ లోకౌశిక్ పెగళ్లపాటి దర్శకత్వంలో కూడా ఒక సినిమాని ప్రకటించారు బెల్లంకొండ. మూన్ షైన్ పిక్చర్స్ బ్యానర్ పై లుధీర్ బైరెడ్డి దర్శకత్వంలో కూడా ఒక సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ మూడు ప్రాజెక్టులపై మంచి అంచనాలు కూడా ఉన్నాయి. 


నటుడిగా మాత్రమే కాక.. బెల్లంకొండ ఒక మంచిది వ్యక్తిగా కూడా ఇండస్ట్రీలో పేరు తెచ్చుకున్నారు. ఒక్క సినిమా హిట్ అయినా కూడా ఎన్నో వివాదాలు ఇరుక్కునే హీరోలు ఉన్న ఈ సమయంలో.. ఇండస్ట్రీ లోకి అడుగు పెట్టి పదేళ్లు గడుస్తున్నా కూడా.. ఒక్క వివాదంలో కూడా ఇరుక్కోకుండా.. ఉన్న ఘనత బెల్లంకొండ కే దక్కింది. హీరోగా మంచి పేరు ఉన్నా కూడా.. బయటకి చాలా సాదాసీదాగా ఉండే వ్యక్తి బెల్లంకొండ. అందుకే హీరోగా మాత్రమే కాక.. ఒక వ్యక్తిగా కూడా బెల్లంకొండ కి చాలామంది అభిమానులు ఉన్నారు. 


ఇలానే బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ఇండస్ట్రీలో ఎన్నో విజయాలు అందుకోవాలని.. నటుడిగా ఇంకా పైకి ఎదగాలి అని అభిమానులు ఆశిస్తున్నారు.


Also Read: ఆ తరంలో NTR, కృష్ణంరాజు.. ఈ జనరేషన్ లో రాజశేఖర్, ప్రభాస్ లకే ఆ క్రెడిట్ దక్కింది..


Also Read: ‘కల్కి ’ సినిమాలో నాగ్ అశ్విన్ చేసిన ఈ బ్లండర్ మిస్టేక్ ను గుర్తించారా..!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook