బాహుబలి తరువాత.. అనుష్క లీడ్ రోల్ పాత్రలో నటిస్తున్న చిత్రం 'భాగమతి'. ఈ సినిమా ఫస్ట్ లుక్ ను చిత్రయూనిట్ రిలీజ్ చేసింది. అనుష్క పుట్టినరోజు సందర్భంగా భాగమతి మూవీ ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేసినట్లు మూవీ మేకర్స్ చెప్పారు. యూవీ క్రియేషన్స్ బ్యానర్ పై వంశీ, ప్రమోద్ నిర్మాతలుగా తెరకెక్కిన ఈ సినిమాకు అశోక్ దర్శకుడు. తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో కూడా రిలీజైంది భాగమతి ఫస్ట్ లుక్. అరుంధతి, రుద్రమదేవి సినిమాల్లో అనుష్క లీడ్ రోల్ చేశారు. ఆ రెండూ బాక్సాఫీస్ వద్ద ఘనవిజయాన్ని అందుకున్నాయి. అదే క్రమంలో 'భాగమతి' కూడా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్లు కొల్లగొడుతుందని చిత్ర యూనిట్ భావిస్తోంది. 


ఈ సందర్భంగా దర్శకుడు అశోక్ మాట్లాడుతూ.. వరుస హిట్స్ అందిస్తున్న యువీ క్రియేషన్స్ బ్యానర్ తో కలిసి పనిచేయడం నాకు చాలా హ్యాపీ.  ప్రెస్టీజియస్ బ్యానర్ కావడంతో భాగమతి చిత్ర విషయంలో చాలా కేర్ తీసుకొని సినిమా తీస్తున్నాం. ఈ సినిమాలో అనుష్క పెర్ ఫార్మెన్స్ హైలెట్ గా ఉండబోతోంది. తమన్ సంగీతం, రవీందర్ ఆర్ట్ వర్క్, మధి కెమెర్ వర్క్ ఈ సినిమాకు స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలుస్తాయి. సస్పెన్స్, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ప్రతీ ప్రేక్షకుడిని ఎంటర్ టైన్ చేసే విధంగా ఈ సినిమా ఉంటుంది" అని అన్నారు.  ఉన్ని ముకుందన్, జయరాం, ఆశా శరత్, మురళీ శర్మ, ధన్ రాజ్, ప్రభాస్ శ్రీను ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. త్వరలోనే ఈ సినిమా విడుదల తేదీని ప్రకటించనున్నారు.