Bharatheeyudu 2: షాక్ కు గురి చేస్తోన్న భారతీయుడు 2, 3 పార్టుల బడ్జెట్...? మొత్తంగా ఎంతంటే..
Bharatheeyudu 2 : శంకర్ దర్శకత్వంలో లైకా ప్రొడక్షన్స్ నిర్మాణంలో కమల్ హాసన్ హీరోగా తెరకెక్కిన మూవీ ‘భారతీయుడు 2’. ఈ నెల 12న విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్ గా నిలిచింది. అయితే.. ఈ సినిమాను భారతీయుడు 2, మరియు 3 కోసం పెద్ద మొత్తంలోనే ఖర్చు పెట్టినట్టు కోలీవుడ్ ఇన్ సైడ్ వర్గాలు చెబుతున్నాయి.
Bharateeyudu 2: శంకర్ దర్శకత్వంలో లోక నాయకుడు కమల్ హాసన్ హీరోగా దాదాపు 1996లో తెరకెక్కిన ‘భారతీయుడు’ సినిమా బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ గా నిలిచింది. అంతేకాదు అప్పట్లోనే తెలుగు, తమిళం ,హిందీలో ఈ సినిమా ఇరగదీసింది. మన దేశంలో తొలి డీటీఎస్ మూవీగా గ్రాఫిక్స్ హంగులతో తెరకెక్కిన ఈ చిత్రం ప్రేక్షకులను కొత్త లోకంలోకి తీసుకెళ్లింది. దాదాపు మూడు దశాబ్డాల క్రితం హిట్టైన ఈ సినిమాకు సీక్వెల్ గా ఇపుడు ‘భారతీయుడు 2’ మూవీ తెరకెక్కించాడు దర్శకుడు శంకర్. కేవలం ‘భారతీయుడు’ బ్రాండ్ తో ఈ సినిమాను కథ లేకుండా చుట్టి పడేసి ప్రేక్షకులపై ఒదిలిపెట్టాడు. మొత్తంగా తన పాత సినిమలనే అట్టు తిరిగేసిట్టు శంకర్ ఈ సినిమాను చుట్టేసాడనే అపవాదు మూటగట్టుకున్నాడు. ఒకప్పుడు శంకర్ సినిమాలు వస్తున్నాయంటే ప్రేక్షకుల్లో ఓ రకమైన ఆసక్తి ఉండేది. ఇక స్నేహితుడు సినిమా నుంచి శంకర్ డౌన్ ఫాల్ మొదలైందనే చెప్పాలి.
తాజాగా భారతీయుడు సినిమాకు సీక్వెల్ గా తెరకెక్కించిన ‘భారతీయుడు 2, 3 పార్ట్ లకు కలిపి ఎంత ఖర్చు అయిందనే విషయం ప్రస్తుతం కోలీవుడ్ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఈ మధ్యకాలంలో భారీ బడ్జెట్ తో తెరకెక్కించే సినిమాలను రెండు పార్టులుగా తెరకెక్కించడం మాములైపోయింది. ‘బాహుబలి’ నుంచి ఈ ట్రెండ్ మొదలైంది. ఆ తర్వాత సలార్, దేవర, పుష్ప, భారతీయుడు సినిమాలు ఈ కోవలో రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి.
ఇక భారతీయుడు పార్ట్ 2కు మరియు 3 కలిపి దాదాపు రూ. 550 కోట్ల బడ్జెట్ అయిందనే టాక్ వినిపిస్తోంది. కానీ రీసెంట్ గా విడుదలైన ‘భారతీయుడు 2’ ప్రేక్షకుల్లో ఏ మాత్రం ఇంపాక్ట్ చూపించలేక ఎపిక్ డిజాస్టర్ గా నిలిచింది. ముఖ్యంగా శంకర్..ఏదో 1998 లేదా 2000లో తీయాల్సిన భారతీయుడు 2’ చిత్రాన్ని జీవితం కాలం లేటు అన్నట్టు ఎపుడో ఔట్ డేటెట్ కంటెంట్ తో తెరకెక్కించాడు. అది బాగానే తీసాడా అంటే అది లేదు. సోది కంటెంట్ తో ప్రేక్షకులను బోర్ కొట్టించాడు. మొత్తంగా భారతీయుడు పార్ట్ 2కే బాక్సాఫీస్ దగ్గర దిక్కు లేకుండా పోయింది. ఇపుడు మూడో పార్ట్ అంటూ ప్రేక్షకుల ముందుకు వస్తే ఆడియన్స్ యాక్సెప్ట్ చేస్తారా అనేది డౌటే అని చెప్పాలి.
ఏది ఏమైనా ఈ సినిమాను సడీ చప్పుడు లేకుండా ఓటీటీలో రిలీజ్ చేసుకోవడం బెటర్ అనే వాదనలు వినిపిస్తున్నాయి. ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో దాదాపు రూ. 25 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరి దిగిన ఈ సినిమా ఇప్పటి వరకు దాదాపు రూ. 14 కోట్ల షేర్ రాబట్టింది. మరోవైపు ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా రూ. 172 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలో దిగింది. ఇప్పటి వరకు ఈ సినిమా రూ. 72 కోట్ల షేర్ (143 కోట్ల గ్రాస్)వసూళ్లను మాత్రమే రాబట్టింది. ఓవరాల్ గా ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర రూ. 100 కోట్లు రాబట్టాలి. ఇపుడుతున్న పరిస్థితుల్లో ఈ సినిమా ఈ కొండలాంటి టార్గెట్ ను అందుకోవడం దాదాపు అసాధ్యమనే చెప్పాలి. మొత్తంగా ఈ యేడాది విడదలైన చిత్రాల్లో ఎక్కువ నష్టాలను తీసుకొచ్చిన చిత్రాల్లో ‘భారతీయుడు 2’ మూవీ ఎపిక్ రికార్డు క్రియేట్ చేసిందనే చెప్పాలి.
ఇదీ చదవండి: ఆ తరంలో NTR, కృష్ణంరాజు.. ఈ జనరేషన్ లో రాజశేఖర్, ప్రభాస్ లకే ఆ క్రెడిట్ దక్కింది..
ఇదీ చదవండి: ‘కల్కి ’ సినిమాలో నాగ్ అశ్విన్ చేసిన ఈ బ్లండర్ మిస్టేక్ ను గుర్తించారా..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook