Bheemla Nayak Pre Release Event Live Link: భీమ్లా నాయక్ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఫంక్షన్ ప్రారంభమైంది... ప్రపంచవ్యాప్తంగా ఉన్న పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న క్షణం రానే వచ్చింది. ప్రస్తుతం టాలీవుడ్‌లో ఎక్కడ చూసినా.. ఎవరి నోట విన్నా.. ఒక్కటే మాట వినిపిస్తోంది. అదే భీమ్లా నాయక్.. భీమ్లా నాయక్ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఫంక్షన్. రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా, మరో స్టార్ హీరో రానా దగ్గుబాటి నెగటివ్ పాత్రలో నటిస్తున్న భీమ్లా నాయక్ మూవీపై మొదటి నుంచే భారీ అంచనాలు ఉన్నాయనే సంగతి తెలిసిందే.   


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

భీమ్లా నాయక్ మూవీ విడుదల తేదీ సమీపిస్తున్న నేపథ్యంలో ఇవాళ చిత్ర నిర్మాణ సంస్థ సితార ఎంటర్‌టైన్మెంట్స్ ఇవాళ యూసుఫ్‌గూడ గ్రౌండ్స్‌లో నిర్వహిస్తున్న భీమ్లా నాయక్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లైవ్ కొద్దిసేపటిక్రితమే ప్రారంభమైంది. దీంతో భీమ్లా నాయక్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ని ప్రత్యక్షంగా వీక్షించేందుకు వెళ్లలేని అభిమానులు ఈ ఈవెంట్ లైవ్‌ని ఆన్‌లైన్‌లో వీక్షిస్తున్నారు. దీంతో ప్రస్తుతం సోషల్ మీడియాలో, ఇంటర్నెట్‌లో భీమ్లా నాయక్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లైవ్ స్ట్రీమింగ్ లింక్ కోసం అభిమానులు అన్వేషిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే పవర్ స్టార్ పవన్ కల్యాణ్ అభిమానుల కోసం భీమ్లా నాయక్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లైవ్ వీక్షించాలని కోరుకుంటున్న పవన్ కల్యాణ్ అభిమానుల కోసం చిత్ర నిర్మాణ సంస్థ సితార ఎంటర్‌టైన్మెంట్స్ లైవ్ స్ట్రీమింగ్ ఇక్కడ అందిస్తున్నాం.



మళయాళంలో అయ్యప్పనుం కోషియం పేరిట పృధ్వీరాజ్ సుకుమారన్, బిజు మీనన్ ప్రధాన పాత్రల్లో వచ్చిన సినిమానే తెలుగులో భీమ్లా నాయక్ మూవీగా తెరకెక్కించనున్నట్టు నిర్మాతల నుంచి ప్రకటన వెలువడినప్పటి నుంచే పవర్ స్టార్ ఫ్యాన్స్‌లో ఈ సినిమాపై భారీ హైప్ ఏర్పడింది. దానికితోడు మ్యూజిక్ డైరెక్టర్ థమన్ అందించిన మ్యూజిక్, సాంగ్స్, టీజర్, ట్రైలర్లు ఈ సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లాయి. సాగర్ కే చంద్ర డైరెక్ట్ చేసిన భీమ్లా నాయక్ మూవీ (Bheemla Nayak Movie) ఫిబ్రవరి 25న ఆడియెన్స్ ముందుకు వస్తోంది.


Also read : Bheemla Nayak Pre-Release Event: భీమ్లా నాయక్ క్రేజ్ పీక్స్.. శివాలయంలో పవన్ పోస్టర్‌కి పూజలు..


Also read : Bheemla Nayak Trailer: సోషల్ మీడియాలో భీమ్లా నాయక్ మాస్ జాతర.. ట్రైలర్ కు వన్ మిలియన్ లైక్స్!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook