Bheemla Nayak Pre-Release Event: భీమ్లా నాయక్ క్రేజ్ పీక్స్.. శివాలయంలో పవన్ పోస్టర్‌కి పూజలు..
Bheemla Nayak Craze: పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. పవన్ ఫ్యాన్స్ ఆయన్నో దేవుడిలా కొలుస్తారు. భీమ్లా నాయక్ రిలీజ్ దగ్గరపడుతున్న వేళ పవన్‌ను ఆయన ఫ్యాన్స్ ఏ రేంజ్లో ఆరాధిస్తున్నారో చూడండి..
Bheemla Nayak Craze: 'పవన్ కల్యాణ్‌కు ఫ్యాన్స్ ఉండరు.. అంతా భక్తులే..' అని ఆయన ఫ్యాన్స్ గొప్పగా చెప్పుకుంటుంటారు. చెప్పుకోవడమే కాదు.. తాము నిజంగానే పవన్ కల్యాణ్‌కి భక్తులమని నిరూపించుకుంటుంటారు. తాజాగా పవన్ కల్యాణ్ అభిమాని ఒకరు.. ఏకంగా 'భీమ్లా నాయక్' పోస్టర్‌కి శివాలయంలో ప్రత్యేక పూజలు జరిపించారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
సదరు అభిమాని శివలింగం వెనకాల 'భీమ్లా నాయక్' పోస్టర్‌ను చేతపట్టుకుని ఉండగా... ఆలయ పూజారి మంత్రాలు చదువుతూ పూజా క్రతువు నిర్వహించారు. శివలింగం ముందు కూడా భీమ్లా నాయక్ పోస్టర్స్ ఉంచడం గమనించవచ్చు. గుడిలో భీమ్లా నాయక్ పోస్టర్‌ని పెట్టి పూజలు నిర్వహించారంటే పవన్‌ను ఆయన ఫ్యాన్స్ ఏ స్థాయిలో ఆరాధిస్తున్నారో అర్థం చేసుకోవచ్చు.
ఈ నెల 25న పవన్ కల్యాణ్ 'భీమ్లా నాయక్' ప్రేక్షకుల ముందుకొస్తున్న సంగతి తెలిసిందే. రిలీజ్‌కు మరో రెండు రోజుల గడువే ఉండటంతో అభిమానుల్లో అంతకంతకూ క్యురియాసిటీ పెరుగుతోంది. తమ అభిమాన హీరోని వెండి తెరపై చూసేందుకు పవన్ ఫ్యాన్ వెయ్యి కళ్లతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే విడుదలైన సినిమా ట్రైలర్ అభిమానుల్లో అంచనాలు పెంచేసింది. ట్రైలర్‌లో పవన్, రానా పలికిన డైలాగ్స్.. చివరలో ఆ ఇద్దరూ తలపడే సీన్ గూస్ బంప్స్ అని చెప్పొచ్చు.
మరోవైపు, ఇవాళ జరగబోయే ప్రీరిలీజ్ ఈవెంట్ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. హైదరాబాద్‌లోని యూసుఫ్ గూడ పోలీస్ గ్రౌండ్స్‌లో జరిగే ఈ ఈవెంట్‌కు ఫ్యాన్స్ పెద్ద ఎత్తున హాజరుకానున్నారు. ఈ నేపథ్యంలో ఈవెంట్ జరిగే పరిసరాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు. నేటి మధ్యాహ్నం 2గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు ఆ మార్గంలో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు.
Also Read: Bheemla Nayak: తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం.. పవన్ కళ్యాణ్ అభిమానులకు పండుగే ఇగ!!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook