Bheemla Nayak Review: పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న రోజు రానే వచ్చేసింది. 'భీమ్లా నాయక్' సినిమా నేడు థియేటర్లలో విడుదలై సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. శుక్రవారం తెల్లవారుజామునే తెలుగు రాష్ట్రాల్లోని అనేక ప్రాంతాల్లో జరిగిన బెనిఫిట్ షోలలో ఫ్యాన్స్ సందడి చేస్తున్నారు. అటు థియేటర్లతో పాటు సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా.. పవన్ కల్యాణ్ 'భీమ్లా నాయక్' మానియానే కనిపిస్తుంది. సినిమా బ్లాక్ బాస్టర్ అంటూ నెట్టింట పోస్టులు చేస్తున్నారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మరోవైపు ఫ్యాన్స్ తో పాటు కొంతమంది సినీ ప్రముఖులు కూడా థియేటర్లలో సందడి చేస్తున్నారు. సినిమాను చూసిన పలువురు సెలబ్రిటీలు పవర్ స్టార్ ఖాతాలో మరో సూపర్ హిట్ అంటూ రివ్యూ ఇస్తున్నారు. పవన్ సినీ కెరీర్ లో 'భీమ్లా నాయక్' బ్లాక్ బాస్టర్ గా నిలిచిపోతుందని చెబుతున్నారు. టాలీవుడ్ కు చెందిన పలువురు హీరోలు, దర్శకులు 'భీమ్లా నాయక్' సినిమాపై సోషల్ మీడియాలో రివ్యూ ఇస్తున్నారు. సెలబ్రిటీలలో ఎవరెవరూ ఎలా స్పందించారో తెలుసుకుందాం. 








మలయాళ సూపర్‌ హిట్‌ చిత్రం ‘అయ్యప్పనుమ్‌ కోషియమ్‌’ తెలుగు రీమేక్ 'భీమ్లా నాయక్' రూపొందింది. ఈ సినిమాలో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సరసన నిత్యా మేనన్, రానా దగ్గుబాటితో సంయుక్త మేనన్ నటించారు. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ డైలాగ్స్, స్క్రీన్ ప్లే అందించగా.. సాగర్ కే చంద్ర దర్శకత్వం వహించారు. ఎస్ ఎస్ తమన్ సంగీతాన్ని సమకూర్చారు. సితార ఎంటర్ టైన్మెంట్స్ పతాకంపై ఈ చిత్రానికి సూర్యదేవర నాగవంశీ నిర్మాతగా వ్యవహించారు.   


ALso Read: Bheemla Nayak Pre Release Event: పవన్ కల్యాణ్ స్పీచ్‌పై రాంగోపాల్ వర్మ కామెంట్స్


Also Read: Bheemla Nayak Release: భీమ్లా నాయక్‌కి ఏపీ సర్కార్ షాక్.. అక్కడ స్పెషల్ షోలు లేనట్లే..!!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook