Bheemla Nayak Trailer: పవర్ స్టార్ పవన్ కల్యాణ్, రానా దగ్గుబాటి కలిసి నటించిన మల్టీస్టారర్ చిత్రం 'భీమ్లా నాయక్'. ఫిబ్రవరి 25న ప్రపంచవ్యాప్తంగా ఉన్న థియేటర్లలో ఈ చిత్రం విడుదల కానుంది. ఇప్పటికే ప్రమోషన్స్ లో జోరు పెంచిన చిత్ర యూనిట్.. సోమవారం రాత్రి సినిమా ట్రైలర్ ను విడుదల చేసింది. ఇప్పుడా ట్రైలర్ సోషల్ మీడియాలో సరికొత్త రికార్డులను సృష్టిస్తోంది. ట్రైలర్ రిలీజ్ అయిన 13 గంటల్లోనే 1 మిలియన్ లైక్స్ తెచ్చుకున్న సరికొత్త ఘనత నెలకొల్పింది. అతి తక్కువ సమయంలో వన్ మిలియన్ లైక్స్ దక్కించుకున్న ప్రాంతీయ చిత్రంగా నిలిచింది. దీంతో పవన్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో సంబరాలు చేసుకుంటున్నారు. 



COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ప్రీ-రిలీజ్ ఈవెంట్ కు ముహూర్తం ఖరారు?


'భీమ్లా నాయక్' మూవీ ప్రీ - రిలీజ్ ఈవెంట్ సోమవారం (ఫిబ్రవరి 21) రాత్రి జరగాల్సి ఉంది. అయితే ఆంధ్రప్రదేశ్ ఐటీ శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి అకాల మరణం కారణంగా వేడుకను వాయిదా వేశారు. అయితే ఈ కార్యక్రమాన్ని తిరిగి ఎప్పుడు నిర్వహిస్తారన్న విషయాన్ని చిత్ర యూనిట్ క్లారిటీ ఇవ్వలేదు. 


కానీ, సినిమా రిలీజ్ దగ్గర పడుతుండడం వల్ల ప్రీ రిలీజ్ ఈవెంట్ ను బుధవారం (ఫిబ్రవరి 23) నిర్వహించేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట. ఇదే విషయమై టాలీవుడ్ లో టాక్ నడుస్తోంది. అయితే దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. బుధవారం జరగనున్న భీమ్లా నాయక్ మూవీ వేడుకకు తెలంగాణ మంత్రి కె. తారక రామారావు (కేటీఆర్) ముఖ్యఅతిథిగా హాజరు కానున్నారని సమాచారం. 



మలయాళంలో విజయవంతమైన చిత్రం 'అయ్యప్పనుమ్ కోషియుమ్' రీమేక్ గా ఈ సినిమా రూపుదిద్దుకుంది. ఇందులో పవన్ కల్యాణ్, రానా దగ్గుబాటి సరసన నిత్యా మేనన్, సంయుక్తా మేనన్ లు నటించారు. డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ డైలాగ్స్, స్క్రీన్ ప్లే అందించగా.. సాగర్ కే చంద్ర దర్శకత్వం వహించారు. ప్రముఖ సంగీత దర్శకుడు ఎస్ ఎస్ తమన్ స్వరాలను సమకూర్చారు. ఈ సినిమాను సితార ఎంటర్​టైన్మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ నిర్మించారు.    


Also Read: Bheemla Nayak Trailer: భీమ్లా నాయక్ ట్రైలర్.. పవర్ ప్యాక్డ్... ఫ్యాన్స్‌కు పూనకాలే..


Also Read: Bheemla Nayak Pre Release: పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ కు షాక్.. భీమ్లా నాయక్ ప్రీ-రిలీజ్ ఈవెంట్ వాయిదా!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook