Big Shock To Mohan Babu: రిపోర్టర్ పై దాడి నేపథ్యంలో మోహన్ బాబుపై బిగ్ షాక్ తగిలింది. ఆయన ముందస్తుగా బెయిల్ పిటిషన్ దాఖలు చేయగా నేడు కోర్టు కొట్టి వేసింది. జర్నలిస్టులపై దాడి చేసిన నేపథ్యంలో ఆయనపై హత్యాయత్నం కేసు నమోదు కాగా ముందస్తుగా మోహన్ బాబు బెయిల్‌ పిటిషన్ వేశారు. అయితే కోర్టు ఈ పిటిషన్ కొట్టి వేయడంతో త్వరలోనే పోలీసులు మోహన్ బాబును అరెస్టు చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మోహన్ బాబు రిపోర్టర్ పై దాడి చేసిన నేపథ్యంలో ఆయనపై బీఎన్ఎస్ 109 సెక్షన్ కింద నమోదయింది. మంచువారింట ఫ్యామిలీ గొడవలు జరుగుతున్న నేపథ్యంలో శంషాబాద్ లో ఉన్న జలపల్లి ఫామ్‌హౌస్‌కు రిపోర్టర్లు వెళ్లారు. అక్కడ మంచు మనోజ్ కి మోహన్ బాబు తో వాగ్వాదం జరుగుతున్న సమయంలో జర్నలిస్టులు గుమిగూడారు... ఈ వాగ్వాదంలో జర్నలిస్టుపై మోహన్ బాబు దాడి చేశారు. మైక్ తీసుకుని అతనిపై విచక్షణ కోల్పోయి దాడి చేయగా టీవీ9 రిపోర్టర్ కి దవడ భాగంలో గాయం అయింది.


అయితే సదరు జర్నలిస్టును ఆసుపత్రికి చికిత్స నిమిత్తం చేర్పించారు. ఆ తర్వాత మోహన్ బాబు కూడా ఆసుపత్రిలో చికిత్స తీసుకున్నారు.. ఈ ఘటనపై కేసు నమోదు చేయటంతో మోహన్ బాబు పై హత్యాయత్నం కేసు పోలీసులు నమోదు చేశారు. అయితే ఈరోజు ఉదయం మే మోహన్ బాబు లిఖితపూర్వకంగా సదరు మీడియా రిపోర్టర్‌కు, కుటుంబానికి క్షమాపణలు కూడా చెప్పిన సంగతి తెలిసిందే. దీనికి సంబంధించి ఒక లెట్టర్ కూడా విడుదల చేశారు.


కుటుంబ వివాదం ఇంత పెద్దగా అవుతుంది అని అనుకోలేదు ఆయన చెప్పారు. అయితే అంతకుముందే మంచి మనోజ్ మీడియా కి క్షమాపణలు చెప్పిన సంగతి తెలిసిందే.. మా నాన్న తరఫున నేను క్షమాపణలు చెప్తున్నాను. నా కోసం వచ్చిన వారికి ఇలా జరుగుతుందని అనుకోలేదు అన్నారు.


అయితే రాచకొండ పోలీసులు మంచి కుటుంబానికి  వార్నింగ్ ఇచ్చిన సంగతి తెలిసిందే వారి నుంచి గన్స్ కూడా సరెండర్ చేసుకున్నారు. రెండు రాష్ట్రాల జర్నలిస్టు సంఘాలతో పాటు  రాజకీయ నాయకులు కూడా మోహన్ బాబుని అరెస్టు చేయాలని ఆందోళనకు దిగారు ఈ నేపథ్యంలో పహాడీ షరీఫ్ పోలీసులు హత్యాయత్నం కేసు నమోదు చేసుకున్నారు. మోహన్ బాబు ముందస్తు బేయిల్‌కు పిటిషన్ వేయగా నేడు కోర్టు దాన్ని కొట్టి వేసింది... ఈ నేపథ్యంలో త్వరలో మోహన్ బాబు అరెస్ట్ అవకాశం కూడా ఉన్నట్లు తెలుస్తోంది. ఆయన ఏ నిర్ణయం తీసుకుంటారో చూడాలి. మరోవైపు బన్నీని సంధ్యా థియేటర్‌ ఘటనపై అరెస్టు చేయడంతో ఒక్కసారిగా ఫ్యాన్స్‌, తెలుగు ఇండస్ట్రీ ఉలిక్కిపడింది. రాష్ట్రంలో అరెస్టులపర్వం మొదలైనట్లుగా కనిపిస్తోంది. 


ఇదీ చదవండి: అల్లు అర్జున్‌ అరెస్ట్‌.. కేటీఆర్‌ సంచలన పోస్ట్‌..! నెట్టింట వైరల్‌


ఇదీ చదవండి:  ఆస్తి కోసం గుంటనక్కలా ఎదురు చూస్తున్న ఆ ఇద్దరు.. కావ్య కాళ్లు పట్టుకుంటారా?


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.FacebookTwitter