Allu Arjun Army: ప్రపంచవ్యాప్తంగా పుష్ప 2 ది రూల్‌ సినిమా విడుదలకు సిద్ధమవుతున్న వేళ ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ సరికొత్త వివాదంలో చిక్కుకున్నారు. సినిమా విడుదల వేళ బన్నీకి భారీ షాక్‌ తగిలింది. తన అభిమాన సంఘానికి పెట్టుకున్న పేరు తీవ్ర అభ్యంతరం వ్యక్తమైంది. ఆ విషయంలో పోలీసులకు ఫిర్యాదు అందింది. కొందరు అల్లు అర్జున్‌ అభిమాన సంఘానికి పెట్టుకున్న 'అల్లు అర్జున్‌ ఆర్మీ'పై అభ్యంతరం వ్యక్తం చేస్తూ పోలీసులకు ఫిర్యాదు చేయడం కలకలం రేపింది. ఈ సందర్భంగా ఐకాన్‌ స్టార్‌పై కేసు నమోదు చేయాలని డిమాండ్‌ చేశారు.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇది చదవండి: Ram Gopal Varma: పోలీసులకు షాకిచ్చిన రామ్‌ గోపాల్‌ వర్మ.. 26 ప్రశ్నలతో సంచలనం


తెలుగు సినీ హీరో అల్లు అర్జున్ తన అభిమాన సంఘానికి 'అల్లు అర్జున్ ఆర్మీ' అని పేరు పెట్టుకోవడంపై గ్రీన్ పీస్ ఎన్విరాన్‌మెంట్ అండ్ వాటర్ హార్వెస్టింగ్ ఫౌండేషన్ సంస్థ అభ్యంతరం వ్యక్తం చేసింది. ఆర్మీ అంటే దేశానికి సేవ చేసే ఓ గౌరవప్రదమైన.. దేశ భద్రతకు సంబంధించిన అంశమని ఆ సంస్థ గుర్తుచేసింది. ఇంత గొప్ప ఆర్మీ అనే పేరును అల్లు అర్జున్ ఆర్మీ అని ఎలా పేరు పెట్టుకుంటాడని ఆ సంస్థ అధ్యక్షుడు బైరి శ్రీనివాస్ గౌడ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.


ఇది చదవండి:  Allu Arjun: రేవంత్ రెడ్డికి మద్దతు తెలిపిన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్.. వీడియో వైరల్


అభిమాన సంఘానికి ఆర్మీ అని పేరు పెట్టుకున్న ఐకాన్‌ స్టార్ అల్లు అర్జున్‌పై కేసు నమోదు చేయాలని కోరుతూ హైదరాబాద్‌లోని జవహర్ నగర్ సీఐ సైదులుకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు చేసిన అనంతరం ఆ సంస్థ అధ్యక్షుడు బైరి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ.. 'అల్లు అర్జున్ తన అభిమానుల పేరును అల్లు అర్జున్ ఆర్మీగా పేరు పెట్టుకోవడం తీవ్ర అభ్యంతరకరమైనది. ఆర్మీ పేరు పెట్టుకోవడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం' అని ప్రకటించారు.


ఆర్మీ అంటే ఒక  జాతీయ సమగ్రత, జాతీయ భద్రత, సాలిడారిటీ అంశమని కానీ టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ వివిధ వేదికలపై తనకు అల్లు అర్జున్ ఆర్మీ ఉందని ప్రకటించాడని బైరి శ్రీనివాస్ గౌడ్ గుర్తుచేశారు. ఆర్మీ పేరు పెట్టుకోవడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు. ఆర్మీ అనేది ఫ్యాన్స్ ఉపయోగించకూడదని స్పష్టం చేశారు. ప్రతిష్టాత్మకమైన పేరు కాబట్టి హీరో అల్లు అర్జున్‌పై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని విజ్ఞప్తి చేసినట్లు వెల్లడించారు. కాగా అతడి ఫిర్యాదును స్వీకరించిన జవహర్‌నగర్‌ పోలీసులు ఎలాంటి కేసు నమోదు చేయకుండా పరిశీలనలో ఉంచారు.



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


 సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిFacebookTwitter