Jani Master:  ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ పై లైంగిక వేధింపులతో పాటు మైనర్ గా ఉన్న తన అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ కు ఆఫర్స్ ఇప్పిస్తానని మభ్య పెట్టి ఆమెపై  పలు మార్లు లైంగిక దాడికి పాల్పడిన సంగతి తెలిసిందే కదా. ముంబై సహా పలు ఔట్ డోర్ లోకేషన్స్ లో వీలు దొరికినపుడల్లా తనపై లైంగిక దాడికి పాల్పడినట్టు ఆమె నార్సింగ్ పోలీస్ స్టేసన్ లో కంప్లైంట్ ఇచ్చింది. తన పై కేసు నమోదు కావడంతో పరారీలో ఉన్న జానీ మాస్టర్..కోసం హైదరాబాద్ నుంచి పలు బృందాలు దేశంలోని వివిధ ప్రాంతాలకు వెళ్లాయి. ఈ నేపథ్యంలో  నిన్న గోవాలో పోలీసులకు జానీ మాస్టర్ సినీ ఫక్కీలో చిక్కాడు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అయితే జానీ మాస్టర్ కోర్టులో తన తప్పు ఒప్పుకోవడంతో అతనికి రిమాండ్ విధిస్తూ తీర్పు విధించింది. అతన్ని పోలీసులు చర్లపల్లి జైలుకు తరలించారు. అయితే జానీ పోలీసుల అదుపులో ఉండటంతో అతని వల్ల తీవ్ర ఇబ్బందుల పాలైన వాళ్లు ఒక్కొక్కరుగా బయటకు వస్తుంది. జానీ చేసే పనుల గురించి మరో ఇద్దరు డాన్సర్లు ఇవాళ పోలీసు ముందుకు వచ్చి కంప్లైంట్ చేయనున్నట్లు తెలుగు సినీ ఇండస్ట్రీలో జోరుగా చర్చ సాగుతుంది.


అంతేకాదు అతనిపై లవ్ జిహాద్ కేసు కూడా నమోదు చేయాలని హిందూ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.   
జానీ మాస్టర్ ఇలాగే చాలా మంది అసిస్టెంట్లను ఇబ్బంది పెట్టేవాడని ఇప్పటికే కొందమంది టాలీవుడ్ వ్యక్తులు ఆరోపిస్తున్నారు. మొత్తంగా  జానీ మాస్టర్ తన తప్పు ఒప్పుకోవడంతో అతనికి సపోర్ట్ గా నిలిచిన నాగబాబు, మంచు మనోజ్ వంటి వారిపై నెటిజన్స్ విరుచుకుపడుతున్నారు. నిప్పులేనిదే పొగ రాదన్నట్టు జానీ మాస్టర్ చేసిన అక్రమాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. ఈ కేసులో ప్రస్తుతం కొత్తగా వచ్చిన చట్టం ప్రకారం జానీ మాస్టర్ కు దాదాపు 14 యేళ్లు జైలు శిక్ష పడే అవకాశాలున్నాయని చెబుతున్నారు.


నిన్న పోలీసులు గోవాలో జానీ మాస్టర్ ను అదుపులోకి తీసుకున్న తర్వాత ఓ రహస్య ప్రదేశంలో అతన్ని విచారించారు. ఈ నేపథ్యంలో జూనియర్ కొరియోగ్రాఫర్ కేసులో.. జానీ మాస్టర్ తాను చేసిన తప్పును ఒప్పుకున్నట్టు  పోలీసులు తమ రిమాండ్ రిపోర్టులో  వెల్లడించారు. జానీ మాస్టర్ కావాలనే 2017 లో ఒక కార్యక్రమంలో పరిచయమైన యువతిని.. తన టీమ్ లోకి జాయిన్ చేసుకున్నారు.


ఆ తర్వాత  ఆమెను (శ్రేష్ఠ వర్మ)ను తన టీమ్ లో అసిస్టెంట్ గా చేర్చుకున్నాడని పోలీసులు తమ ఇన్వెస్టిగేషన్ లో తేల్చారు. అదే విధంగా.. 2020లో ముంబయిలోని ఒక  హోటల్‌లో తన దగ్గర పనిచేస్తున్న అసిస్టెంట్‌ కొరియోగ్రాఫర్ పై  జానీ లైంగిక దాడికి పాల్పడినట్లు జానీ మాస్టర్ ఒప్పుకున్నాడు.  లైంగిక దాడి జరిగినప్పుడు బాధితురాలి వయసు 16 ఏళ్లుగా పోలీసులు నిర్ధారించారు. గత నాలుగేళ్లుగా బాధితురాలిపై పలుమార్లు జానీ మాస్టర్ తన ఇష్టమొచ్చినపుడు ఎపుడు పడితే అపుడు లైంగిక దాడికి..పాల్పడుతూనే ఉండేవారని పోలీసులు తమ రిమాండ్ రిపోర్ట్ లో పేర్కొన్నారు.  


ఇదీ చదవండి: మహాలయ పక్షంలో ఏ తిథి రోజు శ్రార్ధం పెడితే ఎలాంటి ఫలితాలుంటాయి.. !


ఇదీ చదవండి:  ఎన్టీఆర్ ఇంటిని చూశారా.. బృందావనాన్ని మించిన తారక్ ఇల్లు..!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.