Srisatya in Bigg Boss Telugu 6 11th Week : బిగ్ బాస్ ఇంట్లో శ్రీ సత్య, శ్రీహాన్ కలిసి చేస్తోన్న రచ్చ అందరికీ తెలిసిందే. బిగ్ బాస్ షో ప్రారంభంలో అర్జున్‌తో శ్రీ సత్య చెప్పిన మాటలకు ఇప్పుడు చేస్తోన్న చేష్టలకు సంబంధం లేకుండా పోతోంది. ఎవ్వరు తనని టచ్ చేసినా నచ్చదని, చేయి తాకినా నచ్చదని చెబుతూ అర్జున్‌ను దూరంగా పెట్టింద. కానీ ఇప్పుడు మాత్రం శ్రీహాన్‌ శ్రీ సత్యల హగ్గులు చూస్తే జనాలకు మెంటల్ ఎక్కేస్తోంది. చేతిలో చేయి వేసుకుని ముచ్చట్లు పెట్టేసుకుంటున్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

వెటకారం చేయడం, వెక్కిరించడంలో శ్రీ సత్య, శ్రీహాన్, ఫైమాలు ఎవ్వరూ తగ్గరు. ఈ ముగ్గురు కలిసి ఇనయను ఎలా ఇమిటేట్ చేస్తుంటారో అందరికీ తెలిసిందే. నిన్న జరిగిన ఒక్క నామినేషన్లోనే ఫైమా, శ్రీహాన్‌లు కాస్త పద్దతిగా ప్రవర్తించారు. ఫైమా తన వెటకారాన్ని పక్కన పెట్టేసి నామినేషన్లు చేసింది. ఆల్రెడీ నాగార్జున బాగానే క్లాస్ పీకినట్టున్నాడు. అందుకే కాస్త ఒళ్లు దగ్గరపెట్టుకుని మాట్లాడినట్టుంది.



అయితే సత్యకు మాత్రం తాజాగా బిగ్ బాస్ పెద్ద షాక్ ఇచ్చినట్టు కనిపిస్తోంది. వచ్చే వారం నామినేషన్ నుంచి తప్పించుకునేందుకు బిగ్ బాస్ చాన్స్ ఇచ్చాడు. ఇందు కోసం బిగ్ బాస్ ప్రైజ్ మనీ నుంచి కొంత కోల్పోవాల్సి వస్తుంది. ఎవరెవరు ఎంతెంత కోల్పోయేందుకు సిద్దంగా ఉన్నారో చెప్పమని, సీక్రెట్‌గా రాసి లెటర్ బాక్సులో వేయమని చెబుతాడు.


ఎవరు ఏ ఏ అమౌంట్ అనుకుంటున్నారో ఇతర కంటెస్టెంట్లతో చర్చించవద్దని బిగ్ బాస్ ముందే హెచ్చరించాడు. కానీ ఆత్రం ఆగని శ్రీ సత్య ఈ విషయం మీద చర్చించినట్టు కనిపిస్తోంది. దీంతో బిగ్ బాస్ ఆమెకు తగిన శిక్ష వేశాడు. ఆమెను ఆట నుంచి తప్పించేశాడు. డిస్ క్వాలిఫై చేసేశాడు. దీంతో సత్య మొహం ఒక్కసారిగా మాడిపోయింది.


Also Read : Super Star Krishna Death : సూపర్ స్టార్ కృష్ణ మరణం.. బాధపడాల్సిన అవసరం లేదన్న వర్మ


Also Read : Krishna Rare Photos: మీరు మునుపెన్నడూ చూడని సూపర్ స్టార్ కృష్ణ ఫోటోలు



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook