రియాలిటీ షో బిగ్‌బాస్ సీజన్ 4 తెలుగు (Bigg Boss Telugu 4)లో శనివారం గంగవ్వ అనారోగ్య సమస్యలతో ఇంటి నుంచి బటయకు వచ్చేసింది. ఆదివారం రోజు (36వ ఎపిసోడ్) జోర్దార్ సుజాత (Jordar Sujatha) ఎలిమినేట్ అయ్యింది. మొత్తం 9 మంది నామినేషన్‌లో ఉండగా ఒక్కో కంటెస్టెంట్‌ను ఒక్కోతీరుగా సేవ్ చేస్తూ వచ్చిన బిగ్‌బాస్ 4 తెలుగు హోస్ట్ నాగార్జున.. ఈవారం సుజాత ఎలిమినేషన్‌ (Jordar Sujatha Eliminated From Bigg Boss Telugu 4) కబురును చల్లగా చెప్పారు.  



COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

 


తొమ్మిది మంది నామినేషన్‌లో ఉండగా.. చివరగా అమ్మ రాజశేఖర్, జోర్దార్ మిగిలారు. వీరిద్దరిని గార్డెన్ ఏరియాలో వెళ్లాలని నాగ్ సూచించారు. అక్కడ ఐస్ ముక్కల మధ్యలో ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్ ఫొటో ఉందని.. ఐస్ పగలగొట్టాలని చెబుతారు. అమ్మ రాజశేఖర్, సుజాత ఐస్ పగలగొట్టగా.. జోర్దార్ సుజాత్ ఫొటో రావడంతో ఎలిమినేట్ అయింది. అయిగే కాస్త భావోద్వేగానికి లోనైనా, బయటకు వెళ్లడం తప్పదు కదా అంటూ బిగ్ బాస్ 4 ఇంటి సభ్యులు సెండాఫ్ ఇవ్వగా ఇంటి నుంచి బయటకు కాలుపెట్టి నాగార్జున వద్దకు వచ్చింది.



 


ప్రేక్షకులకు కాస్త ట్విస్ట్... అవ్వకు ముందే తెలిసిపోయిందా?
శనివారం రోజు గంగవ్వ వెళ్తుంటే సుజాత్ హుషారుగా మాట్లాడుతుంది. జాగ్రత్త అవ్వ అని చెబితే.. ఏం పర్లేదు రేపు నువ్వు కూడా వస్తావని గంగవ్వ అన్నారు. సరిగ్గా గంగవ్వ చెప్పినట్లుగానే మరుసటి రోజు సుజాత్ బిగ్‌బాగ్ 4 నుంచి ఎలిమినేట్ అయి బయటకు వచ్చేయడం గమనార్హం. గంగవ్వ బాగానే గెస్ చేసిందని కొందరు నెటిజన్లు అంటుంటే.. అన్ని రోజులు ఇంట్లో ఉన్న అవ్వకి.. ఈవారం సుజాతనే అని తెలిసిందని ప్రేక్షకులు అభిప్రాయపడుతున్నారు.


జోర్దార్‌గా బిగ్ బాంగ్ వేసిన సుజాత... (Jordar Sujatha Big bomb to sohel)
ఇంటి సభ్యులలో కొందరు మనసు పగలగొట్టారని, కొందరికైతే నల్లటి హార్ట్ సింబల్ ఇచ్చేసింది. నాగార్జున సూచించగా ఇంటి సభ్యులు ఒక్కొక్కరి గురించి సందడి సందడి చెప్పిన సుజాత చేతికి బిగ్ బాంబ్ దొరికింది. ఆ బాంబ్ ఎవరి మీద పడితే వాళ్లు వారమంతా అంట్లు తోమాల్సి ఉంటుందని హోస్ట్ నాగార్జున చెబుతారు. తిక్క కుదురుతుంది, ఆ పని అంత ఈజీ కాదంటూనే గురి చూసి మరి కెప్టెన్ సోహైల్ మీద బిగ్ బాంబ్‌ను జోర్దార్‌గా వేసి వెళ్లిపోయింది సుజాత. తాను కెప్టెన్ అని సోహైల్ తప్పించుకునేయత్నం చేయగా.. బిగ్ బాంబ్ నుంచి కెప్టెన్ కూడా తప్పించుకోలేడని హోస్ట్ చెప్పేసరికి ఇంటి సభ్యులు సంబరపడ్డారు. సోహైల్ వారం రోజులపాటు మొత్తం అంట్లు తోమాల్సి ఉంటుంది.  


 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. విద్య, వినోదం, రాజకీయాలు, క్రీడలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, ఉపాధి.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe