Bigg Boss 5 Telugu love track:: రోజు రోజుకీ బిగ్‌బాస్‌ రియాలిటీ షో రసవత్తరంగా మారుతోంది. ఇక ప్రతీ సీజన్‌లో బిగ్‌బాస్‌ హౌజ్‌లో జంటల మధ్య ప్రేమాయణాలు సర్వసాధారణంగా మారుతున్నాయి. బయటకు వచ్చిన తర్వాత వారి మధ్య ఆ బంధం కంటిన్వ్యూ కాకపోయినప్పటికీ బిగ్‌బాస్‌ హౌజ్‌(Bigg Boss house)లో మాత్రం ప్రేమ పక్షులు చేసే సందడి అంతా ఇంత కాదు.. ఇక తాజాగా నిర్వాహకులు బుధవారం విడుదల చేసిన ప్రోమో చూస్తుంటే ఈసారి కూడా హౌజ్‌లో ప్రేమ జంట సందడి ఉండేలా కనిపిస్తోంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

బుధవారం ప్రసారం కాబోతున్న ఎపిసోడ్‌కు సంబంధించిన ప్రోమోను స్టార్‌ మా(STAR MAA) తాజాగా విడుదల చేసింది. ఈ ప్రోమో(Promo)లో సింగర్ శ్రీరామ చంద్ర(Singer Srirama chandra)ను ఆర్జే కాజల్ (RJ Kajal)నీకు ఎలాంటి అమ్మాయి కావాలంటూ ప్రశ్నించగా.. ‘నాకు జోవియల్‌గా, బబ్లీగా ఉన్న అమ్మాయి ఇష్టం’ అని బదులిచ్చాడు వెంటనే కెమెరా హమీదా(Hamida) వైపు తిరిగింది. ఇక అనంతరం హమీదా, శ్రీరామ చంద్ర ఒకచోట కలిసి కూర్చొని రొమాంటిక్‌గా మాట్లాడుతున్నట్లున్న వీడియో ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. శ్రీరామ్‌ హమీదాతో మాట్లాడుతూ.. నీకు ఆ ఫీలింగ్స్‌ లేవా అని అడిగాడు దీనికి హమీదా బదులిస్తూ.. ‘నా ఫ్రెండ్స్ నీకు ఫీలింగ్స్ లేవా అని నన్ను అంటారు. ఇక్కడ మాత్రం ఎవరూ మాట్లాడే ఛాన్స్ ఇవ్వడం లేదు’ అని చెప్పుకొచ్చింది.


Also Read: Bigg Boss 5 Telugu: రవి, శ్రీరామ్‌, యానీ, ప్రియ బాగా క్లోజ్‌.. అయినా నా మద్దతు ఆమెకే: నాగబాబు


అప్పుడు శ్రీరామ్‌ బదిలిస్తూ.. ‘ఇక్కడ నీకు ఎవరూ లేరు కాబట్టి.. ఫీలింగ్స్ బయటకు రావడం లేదు. అందుకే లోపలే ఉండిపోతున్నాయి. ఎవరికి చెప్పాలో తెలుసుకుని త్వరగా చెప్పుకో. ఎందుకంటే అప్పుడు 10 జీబీ ఉంటే.. ఇప్పుడు 100 జీబీ ఫీలింగ్స్ ఉంటాయి’ అని చెప్పుకొచ్చాడు. ఇక వీరిద్దరూ మాట్లాడుకుంటోన్న సమయంలో వస్తోన్న నేపథ్య సంగీతం రొమాంటిక్‌ యాంగిల్‌(Romantic Angel)ను తలపిస్తోంది. దీంతో ఈరోజు ఎపిసోడ్‌లో వీక్షకులకు కావాల్సినంత ఎంటర్‌టైన్‌మెంట్‌ దొరకనుందన్నమాట.


గతంలో లవ్ ట్రాక్స్..
బిగ్ బాస్ సీజన్ మొదలైందంటే అందులో ప్రేమకథలు కూడా మొదలవుతుంటాయి. ఎందుకంటే లోపలికి వెళ్లిన తర్వాత కచ్చితంగా అక్కడ ప్రేమకథ నడిపిస్తే కానీ బయట ఫేమస్ అవ్వలేం అని కొందరు ఫిక్స్ అయిపోతుంటారు. ప్రతీ సీజన్‌లోనూ అదే జరుగుతుంది. రెండో సీజన్‌లో సామ్రాట్, తేజస్వి ట్రాక్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అలాగే మూడో సీజన్ పున్ను, రాహుల్ సిప్లిగంజ్ అయితే హాట్ టాపిక్ అయిపోయారు.నాలుగో సీజన్ కూడా అంతే. అఖిల్, మోనాల్ జంట ఏకంగా పెళ్లి కూడా చేసుకుంటారేమో అనిపించింది. అంతగా ఒక్కటైపోయారు వాళ్లు ఇంట్లో. సీజన్ 5 కూడా దీనికి మినహాయింపు కాదు.


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook