Bigg Boss 5 Telugu: ఈ వారం కుటుంబసభ్యుల రాకతో బిగ్ బాస్(Bigg Boss 5 Telugu) హౌస్ ఎమోషన్స్ తో నిండిపోయింది. అయితే హౌస్ లో మరింత ఎమోషన్స్ పెంచడానికి నాగార్జున(Nagarjuna) రెడీ అయిపోయారు. ఇందులో భాగంగా..మిగతా కుటుంబసభ్యులను కూడా బిగ్‌బాస్‌(Bigg Boss) పిలిచారు. రవికోసం ఆయన తల్లి, కాజల్‌ ఫ్రెండ్‌ సహా సిరి(Siri Hanmanth) బాయ్‌ఫ్రెండ్‌ శ్రీహాన్‌ సైతం బిగ్‌బాస్‌ స్టేజ్‌పై సందడి చేశారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

రవి తల్లి వేదికపైకి రావడంతో అతడు కన్నీటి పర్యంతమయ్యాడు. '‘కన్నీళ్లు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. నువ్వు బిగ్‌బాస్‌ రాజా' అని ఆమె అన్నారు. సాయిలేఖను తీసుకొచ్చానని జబర్దస్త్‌ అప్పారావు చెప్పగా, ‘'లోపలికి పంపండి' అని శ్రీరామ్(SriRam) అనడం.. '‘ఆగలేకపోతున్నావా'’ అని అప్పారావు కౌంటర్‌ ఇవ్వడంతో అందరూ ముఖాల్లో నవ్వులు విరబూశాయి. 


Also Read: Bigg Boss 5 Telugu: కూతుర్ని చూడగానే రవి ఎమోషనల్..భావోద్వేగాలతో నిండిపోయిన ప్రోమో..


బిగ్ బాస్ సీజన్-1 విన్నర్ శివబాలాజీ(Siva Balaji) కూడా బిగ్ బాస్ స్టేజ్ పై సందడి చేశారు. ఆఖర్లో సిరి బాయ్‌ఫ్రెండ్‌ శ్రీహాన్‌ వేదికపైకి వచ్చాడు. దాంతో సిరి ఏడుస్తూ ఉండిపోయింది. '‘సిరి వదిలేస్తున్నావా’' అని శ్రీహాన్‌ అన్నాడు. అలా ఎందుకు అన్నాడో తెలియాలంటే నేటి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే. 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook