Bigg Boss 5 Telugu: బ్రదర్, సిస్టర్ల బ్రేకప్ చరిత్రలో ఇదే తొలిసారి అనుకుంటా..బిగ్‌బాస్ కొత్త ప్రోమో చూశారా.?
Bigg Boss 5 Telugu: బుల్లితెర ప్రేక్షకుల్ని ఎంతగానో అలరిస్తోన్న షో..‘బిగ్‌బాస్’. 5వ సీజన్ కు ప్రముఖ నటుడు నాగార్జున వ్యాఖ్యాతగా వ్యవహారిస్తున్న సంగతి తెలిసిందే. నిన్న నామినేషన్ల పర్వంతో వేడెక్కిన హౌస్‌లో ఈ రోజు ఏం జరుగుతుందోననే ఆసక్తి అందరిలోనూ నెలకొంది. తాజాగా ప్రోమో రిలీజ్ చేశారు నిర్వాహకులు. ఎలా ఉందంటే...
Bigg Boss 5 Telugu latest promo : బిగ్‌బాస్ తెలుగు 5వ సీజన్ రసవత్తరంగా కొనసాగుతోంది. ప్రస్తుతం 5 వారాలు ముగించుకొని 6వ వారంలోకి అడుగుపెట్టింది. నేటి ఎపిసోడ్ ప్రోమో(Bigg Boss 5 Latest Promo) రిలీజ్ చేశారు బిగ్ బాస్ నిర్వాహకులు. ఈ ప్రోమో కొంచెం ఫన్నీగా, కొంచెం సీరియస్‌గా సాగింది.
సన్నీ శ్రీరామ్‌ను ఇమిటేట్ చేస్తూ పలకించిన హావభావాలు హౌజ్‌లో నవ్వులు తెప్పించాయి. ఇక హమిదా(Hamida) ఎలా అరుస్తుందో చేసి చూపించేసరికి అందరూ పెద్ద ఎత్తున నవ్వుకున్నారు. ఇక కాజల్(RJ Kajal), సింగర్ శ్రీరామ్(Singer sriramachandra)ను ఉద్దేశిస్తూ ‘బ్రేకప్ బ్రో.. చరిత్రలో బ్రదర్ అండ్ సిస్టర్ బ్రేకప్ ఫస్ట్ టైమ్ కదా’ అంటూ చెప్పుకొచ్చింది. దీనికి శ్రీరామ్ ఒకరకమైన ఎక్స్‌ప్రెషన్స్‌ను పలికించాడు. ఇక షణ్ముఖ్(Shanmukh jaswanth) ఎలిమినేషన్ ప్రాసెస్‌కు సంబంధించి ఫన్నీ కామెంట్స్ చేశాడు. ఐన్‌స్టీన్ E=mc2 ఎందుకు కనిపెట్టాడో కూడా కనుక్కోవచ్చు. కానీ ఎలిమినేషన్స్ అర్థంకావు అని చెప్పుకొచ్చాడు.
Also read: Preetham Jukalker: సమంతతో నా రిలేషన్ షిప్ పై చైతూ స్పందించాలి: ప్రీతమ్ జుకల్కర్
అయితే హౌజ్‌లో అంతా ఫన్నీగా కూల్‌గా సాగిపోతుందనుకుంటున్న సమయంలో శ్వేత వర్మ(Swetha varma) బిగ్గర అరవడంతో హౌజ్‌లో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. ఇతరుల్లోని అగ్లీ సైడ్‌ను బయటకు తీసుకురావడం గేమా అంటూ అరిచేసింది, ఇది ఎలా కరెక్ట్ అవుతుంది, అస్సలు కాదంటూ అరిచేసింది. ఇలా కొంచెం ఫన్నీగా, కొంచెం హాట్ హాట్‌గా సాగిన నేటి ఎపిసోడ్‌లో ఏం జరుగుతుందో తెలియాలంటే మరికొన్ని గంటలు వేచి చూడాల్సిందే.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook