Bigg Boss contestant Lobo: బిగ్ బాస్ కంటెస్టంట్ లోబో సంపాదన ఎంతో తెలుసా ?
Bigg Boss contestant Lobo total remuneration: బిగ్ బాస్ రియాలిటీ షోలోకి రాక ముందు కమెడియన్‌గా, టాటూ ఆర్టిస్టుగా ఉన్న లోబో బిగ్‌బాస్ రియాలిటీ షోలోకి వచ్చాకా ఎలాంటి అరమరికలు లేకుండా తన పర్సనల్ లైఫ్‌ని తన తోటి కంటెస్టంట్స్‌తో, రియాలిటీ షో ఆడియెన్స్‌తో పంచుకున్నాడు.
Bigg Boss contestant Lobo total remuneration: బిగ్ బాస్ కంటెస్టంట్ లోబో బిగ్‌బాస్ హౌజ్ నుంచి ఎలిమినేట్ అయిన సంగతి తెలిసిందే. బిగ్ బాస్ రియాలిటీ షోలోకి రాక ముందు కమెడియన్‌గా, టాటూ ఆర్టిస్టుగా ఉన్న లోబో బిగ్‌బాస్ రియాలిటీ షోలోకి వచ్చాకా ఎలాంటి అరమరికలు లేకుండా తన పర్సనల్ లైఫ్‌ని తన తోటి కంటెస్టంట్స్‌తో, రియాలిటీ షో ఆడియెన్స్‌తో పంచుకున్నాడు. దీంతో లోబో పర్సనల్ లైఫ్‌లో (Bigg Boss contestant Lobo personal life) ఎదుర్కొన్న ఆర్థిక ఇబ్బందులు, ఫ్యాషన్‌పై అతడి ఇష్టాయిష్టాలు, వగైరా అన్ని విషయాల్లో ఆడియెన్స్‌కి ఓ అంచనాకు వచ్చేశారు.
బిగ్ బాస్ రియాలిటీ షో నుంచి లోబో బయటకు వచ్చేసిన నేపథ్యంలో అతడు రియాలిటీ షోలో ఎంత సంపాదించుకున్నాడనే అంచనాలు మొదలయ్యాయి. ఇదే విషయమై మీడియా ఆరా తీయగా.. బిగ్ బాస్ రియాలిటీ షోలో లోబో (Bigg Boss contestant Lobo) రూ. 18 లక్షలు సంపాదించుకున్నాడని తెలిసింది.
బిగ్ బాస్ రియాలిటీ షోలో పాల్గొనే వారికి ఒక్కో వారానికి ఇంత పారితోషికం అని ఒప్పందం చేసుకుని ఉంటారు. అలా రియాలిటీ షోలో ఎన్ని వారాలు కొనసాగగలిగితే అంత ఎక్కువ మొత్తంలో పారితోషికం (Bigg Boss Telugu contestants remunerations) సంపాదించుకునే అవకాశం ఉంటుంది.
బిగ్ బాస్ రియాలిటీ షో సీజన్ 5 లో పాల్గొంటున్న కంటెస్టంట్స్‌లో ఫేమస్ సింగర్ శ్రీరామ చంద్ర (Bigg Boss contestant Sriram Chandra) అధిక మొత్తంలో పారితోషికం అందుకుంటుండగా.. ఆ తర్వాతి స్థానంలో అధిక రెమ్యునరేషన్ అందుకుంటున్న వారిలో షణ్ముఖ్ జస్వంత్ (Shanmukh Jaswanth) ఉన్నాడు.