Bigg Boss Vasanthi : బిగ్ బాస్ టీంకు ఉండే లెక్కలన్నీ వేరుగా ఉంటాయి. బిగ్ బాస్ షోలో ఎప్పుడు ఏం జరుగుతుందో ఊహించలేం. అంతా ఆడియెన్స్ ఇష్ట ప్రకారం, ఓట్ల ఇష్టానుసారం జరుగుతుందని చెబుతూ ఉంటారు. ఒక్కోసారి అది నిజమని కూడా అనిపిస్తుంది. కానీ కొన్ని సార్లు మాత్రం బిగ్ బాస్ టీం తన లెక్కలు, టీఆర్పీల ప్రకారమే కంటెస్టెంట్లు ఉంచడమో, బయటకు పంపించడమో చేస్తుంటారు. అయితే ఈ పదోవారంలో మాత్రం ఎలిమినేషన్ విషయంలో అంతా షాక్ అయ్యారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

బాలాదిత్య లాంటి కంటెస్టెంట్‌ ఎలా ఎలిమినేట్ అవుతారంటూ అందరూ షాక్ అవుతున్నారు. ఇక మెరినా ఎలిమినేట్ అయినందనే వార్తలను చూసి ఎవ్వరూ అంతగా షాక్ అవ్వలేదు. కానీ ఇప్పుడు మెరినా కాదు.. వసంతి ఎలిమినేట్ అయిందనే లీకులు వస్తున్నాయి. నిన్న సాయంత్రం మెరినా ఎలిమినేట్ అయిందని లీకులు వచ్చాయి. మళ్లీ కాసేపటికి మెరినా కాదు.. వసంతి ఎలిమినేట్ అయిందంటూ వార్తలు వచ్చాయి.


మెరినా కంటే వసంతి గ్లామర్ కోటాలో కాస్త ఎక్కువగా ఓట్లు పడే అవకాశం ఉంది. ఆట విషయంలో ఇద్దరూ అంతే. ఆటలు ఆడటం పక్కన పెడితే.. వసంతి అయితే తన అందం మీదే ఎక్కువగా ఫోకస్ పెడుతుంది. జనాలు కూడా ఆమెను అదే కోణంలో కాపాడుతూ వచ్చారు. ఇప్పుడు మాత్రం వసంతి ఎలిమినేషన్‌కు టైం వచ్చింది.


వసంతి తెలివి ఏపాటిదో ఈ వారంలోనే అందరికీ తెలిసిందే. లెక్క పెట్టడంలోనూ వసంతి తన అతి తెలివి చూపించింది. నాగార్జున స్పెషల్‌గా వీడియోను చూపించక ముందే.. జనాలు గుర్తు పట్టారు. కానీ ఎడిటింగ్‌లో లేపేసి ఉంటారని అంతా భావించారు. కానీ ఆమె అలా తప్పుగా లెక్క పెట్టేసిందని వీడియోను ప్లే చేసి చూపించి పరువుతీశాడు.


వసంతి బయటకు వచ్చినా కూడా ఎంతో పాజిటివ్ ఇమేజ్‌తోనే బయటకు వచ్చింది. టీఆర్పీ కోసం పిచ్చి పిచ్చి పనులేమీ చేయలేదు. ట్రాక్ నడపాలని చూడలేదు. టాస్కుల్లో తను చేయాల్సినవన్నీ చేసింది. కానీ వసంతి జర్నీ నేటితో ముగిసిపోనుంది. ఎలిమినేషన్ తరువాత వసంతి ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి.

Also Read : కంటెంటే కింగ్.. అందుకే ఆ సినిమాను చూడలేదు.. రామ్ చరణ్ పరోక్ష కామెంట్స్!


Also Read : Samantha Hugs: అతని కౌగిట్లో సమంత.. ఈరోజు వస్తుందని ఊహించలేదంటూ పోస్ట్!


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి