Bigg Boss 6 Telugu 10th Week Nominations : బిగ్ బాస్ ఇంట్లో పదో వారం నామినేషన్స్ పీక్స్‌కు వెళ్లింది. ప్రతీ వారంలానే ఈ వారం కూడా శ్రీహాన్ కీర్తి, శ్రీహాన్ ఇనయల మధ్య వాగ్వాదం జరిగింది. ఫైమా సైతం ఇనయను టార్గెట్ చేసింది. ప్రతీ సారి ఇలా ఇనయను టార్గెట్ చేస్తూనే వస్తున్నారు. ఆమెను రెచ్చగొడుతూనే ఉన్నారు. అయినా కూడా ఆ ప్రాసెస్‌లో ఫైమా, శ్రీహాన్‌లకే నెగెటివిటీ పెరిగింది. వాగ్వాదం వేరు వాదించుకోవడం వేరు.. వెక్కిరించడం వేరు. ఇనయ పాయింట్లు మాట్లాడుతుంటే.. శ్రీహాన్, ఫైమాలు మాత్రం వెక్కిరింతలతో దిగజారిపోతోన్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఫైమా మరీ ముఖ్యంగా చిరాకు పెట్టిస్తోంది. ఫైమా మీద ఒకప్పుడు ఉన్న ఇమేజ్ ఇప్పుడు లేదు. ఆమె చేసే పిచ్చి కామెడీని పక్కన పెడితే.. ఆమె బాడీ లాంగ్వేజ్, కావాలని అంటిపెట్టుకున్నట్టుగా యాటిట్యూడ్ జనాలకు చిరాకు తెప్పిస్తున్నాయి. నిన్నటి నామినేషన్ ప్రక్రియలోనూ ఫైమా అలానే చేసింది.ఇనయతో వాగ్వాదం, వాదించుకోవడం, ఆరోపణలు చేయడం, తిట్టడం వరకు అంతా బాగానే ఉంది. కానీ ఆమె వెక్కిరించడం, ఎగతాళి చేయడంతో హద్దులు దాటినట్టుగా అనిపించింది.


ఫైమా మాటలు, చేష్టలు, చేతలన్నీ కూడా హద్దులు దాటాయి. నువ్ ఈ ఇంట్లోనే ఎవ్వరికీ నచ్చవు.. నీ మొహం చూస్తేనే చిరాకు.. నువ్వంటేనే నాకు నచ్చదు అంటూ ఇలా ఇష్టమొచ్చినట్టుగా ఫైమా మాటలు వదిలింది. ఫేక్ ఫేక్ అంటూ ఇనయను మాటలతో వేదించింది ఫైమా. మాటలు పక్కన పెడితే.. ఆ పిచ్చి వెక్కిరింపులు అసహ్యంగా అనిపించాయి. ఈ ఘటనలో ఫైమానే తనని తాను దిగజార్చుకుంది. ఫైమా ఈ వారం బయటకు వెళ్లేందుకు ఎక్కువ అవకాశాలున్నాయి.


ఇక ఫైమా అలా ఉంటే.. శ్రీహాన్ నిజంగానే నిబ్బలా ప్రవర్తిస్తున్నాడు. మొదట్లో శ్రీహాన్ విన్నింగ్ మెటీరియల్ అని అనుకున్నారు. కానీ రాను రాను మాత్రం తాను విజేతగా నిల్చేందుకు అనర్హుడని ప్రకటించుకుంటున్నాడు. రోటెన్ ఫిష్‌ను కీర్తికి ఇచ్చినప్పుడే శ్రీహాన్ తెలివి ఏంటో అందరికీ అర్థమైంది. ఇక ఇనయ, కీర్తిల విషయంలో శ్రీహాన్ మాట తీరు, ప్రవర్తించే విధానం, బాడీ లాంగ్వేజ్, వెటకారం అన్నీ కూడా హద్దులు దాటాయి. ప్రేక్షకుల సహనానికి పరీక్షలా మారుతున్నాయి. సోషల్ మీడియా ట్రెండ్ చూస్తుంటే ఈ వారం కచ్చితంగా శ్రీహాన్, ఫైమాల్లోంచి ఒకరు ఎలిమినేట్ అయ్యేట్టుగా కనిపిస్తోంది. మరి ఏం జరుగుతుందో.. ఎవరు ఎలిమినేట్ అవుతారో చూడాలి.


Also Read : Samantha quotes : దేవుడు చేసే ప్రతీ దానికి ఓ కారణం ఉంటుందట.. సమంతకు ఏమైంది? ఇలా ఎందుకు అంటోంది?


Also Read : సుధీర్ తో ప్రేమో? స్నేహమో? ఎందుకు చెప్పాలి.. కొత్త అనుమానాలు రేకెత్తిస్తున్న రష్మి


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook