Bigg Boss Geetu - revanth : పోయి పోయి గీతూ చేతికే చిక్కాలా?.. రేవంత్ కష్టం బూడిదలో పోసిన పన్నీరే
Bigg Boss 6 Telugu 8th Week Captaincy Task బిగ్ బాస్ ఇంట్లో ఎనిమిదో వారం చేపల చెరువుగా మారింది. ఈ వారం కెప్టెన్సీ టాస్కులో ట్విస్టులు భారీగానే జరుగుతున్నాయి. చేపల పట్టుకోవడం కంటెస్టెంట్లు ఫుల్ బిజీగా మారిపోయారు.
Bigg Boss 6 Telugu 8th Week Captaincy Task : బిగ్ బాస్ ఇంట్లో ఎనిమిదో వారం జరుగుతున్న కెప్టెన్సీ టాస్క్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. చేపల చెరువు అంటూ చేపలను విసురుతుంటే.. కంటెస్టెంట్లు పట్టుకుని, వాటిని కాపాడుకుంటూ ఉన్నారు. ఏ గొడవ లేకుండా బిగ్ బాసే జంటలుగా విడగొట్టేశాడు. సూర్య, వాసంతి ఓ జట్టు.. బాలాదిత్య మెరినా ఓ జట్టు. శ్రీహాన్ సత్య, ఇనయ రేవంత్, ఫైమా సూర్య ఓ జట్టు. ఆట సరిగ్గా ఆడక తక్కువ చేపలు పట్టుకుని గీతూ ఆది ఆట నుంచి తప్పుకున్నారు. దాంతో వారిని సంచాలకులుగా పెట్టేశాడు బిగ్ బాస్.
సంచాలక్ అని అనడంతో.. గీతూకి కొమ్ములొచ్చేశాయ్. ఆర్డర్లు పాస్ చేయడం మొదలుపెట్టేసింది. ఇలాంటి ఎక్స్ ట్రాలే గీతూ తగ్గించుకుంటే మంచిది అని అందరికీ అనిపిస్తుంటుంది. నా రూల్స్ అంటూ ఇష్టమొచ్చినట్టుగా వ్యవహరించింది. కానీ ఆదిరెడ్డి మాత్రం గీతూ దూకుడికి కళ్లెం వేసే ప్రయత్నంచేశాడు. మంచి సంచాలకుడిగా వ్యవహరించాడు. సంచాలక్ అయినా కూడా ఆట ఆడుతూ.. పిచ్చి పిచ్చిగా ప్రవర్తించింది. సంచాలక్ అంటే ఆడకూడదు.. ఆట నియమాలను మాత్రమే పాటించాలి.. సరిగ్గా ఆడుతున్నారా? లేదా? అన్నదే చూడాలని ఆది రెడ్డి చురకలు అంటించాడు.
కానీ మూర్ఖపు గీతూ మాత్రం వినలేదు. నేను ఆడే సంచాలక్‌ని అంటూ పిచ్చి పిచ్చిగా వాగేసింది. అయితే గీతూకి ఓ నల్ల చేప దొరికింది. ఉదయం పూట డ్యాన్స్ చేస్తుంటే.. స్విమ్మింగ్ పూల్ వద్ద అది దొరికింది. పక్కనే ఫైమా ఉన్నా కూడా దాన్ని తీసుకోలేదు. కానీ గీతూ తీసుకుని దాచేసుకుంది. చివరకు ఆ చేపే రేవంత్ కొంప ముంచుతుందని తెలుసుకోలేకపోయారు. రేవంత్ ఇనయ చాలా కష్టపడి ఆడారు. అందరి కంటే ఎక్కువ చేపలను సేకరించారు. అయితే రేవంత్‌ను దెబ్బకొట్టేందుకు గీతూ భీష్మించుకుని కూర్చుంది.
బాలాదిత్య మెరినా కష్టపడి ఆడారు.. వారిని స్వాప్ చేద్దామని ఆదిరెడ్డి అంటే.. వాళ్లేం ఆడలేదు.. నాకు నచ్చలేదు అంటూ తనకు నచ్చినట్టుగా చేసింది గీతూ.ఈ మాత్రం దానికి నన్ను ఎందుకు అడిగావ్? అంటూ ఆదిరెడ్డి కౌంటర్లు వేస్తాడు. శ్రీహాన్, రేవంత్ ఫ్రెండ్స్ కాబట్టి.. ఆ ఇద్దరినీ స్వాప్ చేస్తాను.. గేమ్ ఎలా ఉంటుందో చూస్తాను అంటూ గీతూ తన పిచ్చి లాజిక్, స్టేట్మెంట్ ఇచ్చింది.
అయితే చివరకు గేమ్ ఎండ్ అయిందని బిగ్ బాస్ చెప్పడంతో.. గీతూ మూతి మాడిపోయింది. అయితే రేవంత్ కష్టం మాత్రం బూడిదలో పోసిన పన్నీరే అయింది. కానీ తన స్నేహితుడు శ్రీహాన్‌కే అన్నీ వెళ్లడంతో హ్యాపీగానే ఫీలయ్యాడు రేవంత్. ఇనయ మాత్రం మంచి ఫైర్ మీద ఉంది. ఇంకా ఆట పెట్టండి. అప్పుడు చూపిస్తా అని ఇనయ అంటే.. ఇది ఇలా బయటకు రావాలనే స్వాప్ చేసిందని ఇంకా గీతూ రెచ్చగొట్టేసింది.
Also Read : Puri Jagannadh Complaint : పూరి ఫిర్యాదు.. ఫైనాన్షియర్ శోభన్ సంచలన వ్యాఖ్యలు.. ఎక్కడా కనిపించని ఛార్మీ?
Also Read : Allu Sneha Reddy Video : అదరహో అనిపించేలా అల్లు స్నేహారెడ్డి.. అందాల ఆరబోతలో తగ్గేదేలే అంటోన్న బన్నీ భార్య
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి