Bigg Boss Geetu Elimination : ఎంత ఏడ్చినా ఏమీ లాభం.. చివరకు గీ`థూ` అనిపించుకుంది.. ఇదే గుణపాఠం
Galata Geetu Burtsout బిగ్ బాస్ ఇంటి నుంచి గీతూ ఎలిమినేట్ అయింది. ఆమె గుండెలవిసేలా ఏడ్చినా కూడా ప్రేక్షకులకు మాత్రం ఎంతో హాయిగా అనిపించింది. దరిద్రం పోయింది అన్నట్టుగానే ఆమెను ఎలిమినేషన్‌ను చూడసాగారు.
Bigg Boss Geetu Elimination : బిగ్ బాస్ షోలో ఇన్ని సీజన్లు జరిగాయి. ఎంతో మంది ఎలిమినేట్ అయ్యారు. మహామహులు, తోపు కంటెస్టెంట్లు సైతం తోక ముడుచుకుని వెళ్లారు. ఆటే ప్రాణమని చెప్పిన కంటెస్టెంట్లు దెబ్బ తిన్నారు. మనుషులు, మానవత్వం, విలువలు లేని ఆటగాళ్లను జనాలు తిరస్కరిస్తూనే వచ్చారు. ఎంత ఆట అయినా కూడా ఓ హ్యూమన్ యాంగిల్ అనేది ఉంటుంది.. గెలిచామనేదానికన్నా.. ఎలా గెలిచాం.. గెలిచేందుకు ఎలాంటి అడ్డదారులు తొక్కారు? ఏ పద్దతిలో గెలిచారు? అనే దాన్ని జనాలు ఎక్కువగా చూస్తుంటారు.
ఈ ఆరో సీజన్‌లో మొదటి నుంచి నెగెటివిటీతో ఉన్న కంటెస్టెంట్ ఎవరైనా ఉంటే అది గీతూ మాత్రమే. మొదటి వారంలోనే ఆమెను ఆడియెన్స్ ఇంటికి పంపించేవారు. ఆమె వాగుడు, అతిని ఎవ్వరూ భరించలేకపోయారు. కానీ మొదటి వారంలో ఆమె నామినేట్ కాలేదు. దీంతో అలా బతికిపోయింది. మధ్యలో గీతూ చాలా అంటే చాలా విసిగించేసింది జనాలు. లోపల ఉన్న కంటెస్టెంట్లను ఎంత విసిగించిందో.. బయట ఉన్న జనాలను అంతకు పదింతలు విసిగించింది. గీతూ కాస్త గీథూ అనే స్థాయికి చేరుకుంది.
ఏదైతేనేం.. మంచో చెడో.. నేను నాకు నచ్చినట్టుగా ఉంటా.. నచ్చినట్టుగా ఆడతా.. నాకు ఎమోషన్స్ లేవు.. ఆటలో అమ్మానాన్నా ఉన్నా కూడా పట్టించుకోను.. ఆడతా.. ఓడిస్తా.. ఇష్టమొచ్చినట్టుగా ఆడిస్తా.. ఆడతా.. నేనే బిగ్ బాస్.. నేనే ఈ కంటెస్టెంట్లను ఆడిస్తా.. నాగార్జున ఏంటి? బిగ్ బాస్ ఏంటి? తొక్కా అన్నట్టుగా గీతూ వింతగా ప్రవర్తిస్తూ వచ్చింది. ఇంత వింత కారెక్టర్ కాబట్టే బిగ్ బాస్ టీం కూడా తమ టీఆర్పీ రేటింగ్ కోసం కొన్ని వారాలు భరించింది. అయినా జనాల ఓటింగ్ ద్వారానే గీతూని ఎలిమినేట్ చేశారని చెప్పలేం.
కానీ ఈ సారి మాత్రం గీతూ ఎలిమినేషన్ మాత్రం జనామోదం, జనాభిప్రాయం ప్రకారమే జరిగింది. ఇన్ని రోజులు కాపాడుకుంటూ వచ్చిన బిగ్ బాస్ టీం కూడా చేతులెత్తేసింది. అందుకే గీతూని బయటకు పంపించేసింది. ఎనిమిదో వారంలో సంచాలక్‌గా చేపల టాస్కులో గీతూ చేసిన రచ్చ, తొమ్మిదో వారంలో బాలాదిత్య వీక్ నెస్‌తో ఆడుకోడం, పిచ్చి లూప్స్, స్ట్రాటజీలు వాడటం, తనకు మాత్రమే తెలివి ఉందని మిడిసిపడటంతో జనాలకు ఆగ్రహం కట్టలు తెంచుకొచ్చింది. దీంతో ఎలిమినేట్ అయింది.
అయితే ఈ వారం సత్య తృటిలో తప్పించుకుంది. చిరవకు తాను ఎలిమినేట్ అవుతాను అని సత్య అనుకుంది. ఇనయ విషయంలో అతి చేశానని, వెక్కించడం చాలా వెగటుగా ఉందని నాగార్జున సర్ చెప్పాడు కదా? నేనే ఎలిమినేట్ అవుతానేమో అని సత్య అనుకుంది. కానీ చివరకు గీతూ ఎలిమినేట్ అయింది. ఇక్కడ మనం చూస్తున్నది వేరు బయట ఆడియెన్స్ అనుకుంటున్నది వేరు అని చివరకు సత్య కళ్లు తెరుచుకుంది. ఇప్పటికైనా సత్య కళ్లు తెరిచి, కాస్త హద్దుల్లో ఉంటే ఆమెకు మేలు.
రేవంత్, సత్య, ఫైమా ఇలా చాలా మంది గీతూని అనుసరించే ప్రయత్నం చేశారు. ఆమె చుట్టూ చేరారు. కానీ ఇప్పుడు వారికి సత్య బోధపడింది. వాళ్ల కళ్లకు ఉన్న మబ్బులు తొలిగిపోయి ఉంటాయి. గీతూ ఎలిమినేట్ అయిన తీరు, ఆమె బోరున ఏడ్చిన తీరు చూసి శ్రీహాన్, సత్య, ఫైమా, రేవంత్ వంటి వారు బాగానే ఏడ్చారు. కానీ అసలు బయట ఏం జరుగుతోందనే సత్యాన్ని కూడా గ్రహిస్తే వారికే మంచిది.
బిగ్ బాస్ ఇంటి బయటకు వచ్చేందుకు గీతూ చాలా ఓవర్ డ్రామా చేసింది. తనకు బిగ్ బాస్ అంటే అంత పిచ్చి ఉండొచ్చు గానీ.. తనకు ఎలా ఉండాలి.. ఎలా ఆట ఆడాలి.. ఏ పరిస్థితుల్లో ఎలా మాట్లాడాలి.. ఎదుటివారితో ఎలా ప్రవర్తించాలి అనేది తెలియలేదు. బయట తాను ఎవ్వరినీ నమ్మను అని, తనను అందరూ మోసం చేశారంటూ గీతూ చెప్పింది. ఇక్కడకు వచ్చే మనుషుల గురించి తెలిసింది.. మనుషులు ఇంత మంచి వారా?అనేది అర్థమైందంటూ గీతూ నేర్చుకున్న పాఠాల గురించి చెప్పింది.
మిడిసిపాటు, తలపొగరు, ఎదుటివారిని కించపర్చడం, వీక్ కంటెస్టెంట్లు అంటూ సుదీప, మెరినా, రోహిత్ వంటివారిని గీతూ టార్గెట్ చేసిన తీరు, వారిపై గ్రడ్జ్ పెట్టుకున్న విధానం వంటివే గీతూని ముంచింది. చంటి విషయంలోనూ గీతూ హద్దులు దాటింది. రేవంత్ ఇంటి నుంచి బయటకు వెళ్తే అతనికే మంచిది.. బాలాదిత్య బిగ్ బాస్ షోకు ఫిట్ కాడు అంటూ ఇలా అందరి మీద రివ్యూలు చేసింది. కానీ తన పద్దతి తాను మార్చుకోలేకపోయింది. మానవత్వం, మంచితనం ఉండటం తప్పు అన్నట్టుగా గీతూ అనుకుంది.
ఆటలో అవన్నీ ఉండొద్దు.. మీరంతా వేస్ట్.. నేను మాత్రమే బెస్ట్ అనే రీతిలో గీతూ ప్రవర్తించింది. తాను గేమర్ అని భ్రమపడింది. ఆట ఆడే తీరులో తాను ఒక మనిషిని అనే విషయాన్ని మరిచిపోయింది. తాను వెదవ, వెదవన్నర వెదవను, మంచి దాన్ని కాదు.. చీప్ దాన్ని అంటూ ఇలా తన గురించి తానే స్టేట్మెంట్లు ఇచ్చుకుంది. అలాంటి మనుషులు జనాలు మాత్రం ఎందుకు ఇష్టపడతారు? విన్నర్‌ను చేస్తారు? అనే విషయాన్ని, చిన్న లాజిక్‌ను మాత్రం గీతూ అర్థం చేసుకోలేకపోయింది.
బిగ్ బాస్ ఇంటికి తాను ఒక పర్పస్‌తో వచ్చానని, తనను చూసి ఎంతో మంది ఇన్‌స్పైర్ అవ్వాలని అనుకున్నానని, తనలోని మంచి లక్షణాలుంటే తీసుకోవాలని.. చెడు లక్షణాలు ఉంటే ఇలా ఉండకూడదని.. అనుకోవాలనే ఉద్దేశ్యంతో, ఎంతో మందికి స్పూర్తిగా ఉండాలని బిగ్ బాస్ ఇంటికి వచ్చినట్టుగా గీతూ చెప్పింది. అయితే ఆ పర్పస్ మాత్రం నెరవేరింది. ఇలా ఉండకూడదు.. అనేదానికి బెస్ట్ ఎగ్జాంపుల్‌గా గీతూ నిల్చింది. ఆ విషయంలో అందరికీ కనువిప్పు కలిగిచింది గీతూ. గీతక్క చివరకు రోతక్కగా, రొయ్యలక్కగా పేరు తెచ్చుకుని ఇంటి నుంచి బయటకు వచ్చింది.
గీతూ ఎలిమినేషన్ చూసిన తరువాత అందరికీ ఓ విషయం అర్థమవ్వాలి. గుణపాఠం నేర్చుకోవాలి. బిగ్ బాస్ అంటే కేవలం ఆటలు మాత్రమే కాదు. మన మాట తీరు, ప్రవర్తన, మంచితనం, మానవత్వం ఇలా అన్నీ కూడా ఇంపార్టెంట్ అన్న సంగతి అందరూ గుర్తు పెట్టుకోవాలి. గీతూ బాగా ఆట ఆడేందుకు ప్రయత్నిస్తుంది.. స్ట్రాటజీలు బాగానే వాడుతుంది అనే కారణం తప్పా.. ఆమెను ఇష్టపడేందుకు ఇంకో కారణం కూడా కనిపించదు. బిగ్ బాస్ ఇంట్లో విన్నర్ అవుతాను.. అదే కలగనేదాన్ని.. రన్నర్ అని కూడా అనుకోలేదు. కేవలం విన్నర్ అనే ఆలోచన, కలలతోనే ఉన్నాను అని చెప్పిన గీతూ.. ఈ ఎలిమినేషన్‌ను తీసుకోలేకపోయింది.
ఇప్పటికైనా గీతూ తన పద్దతి, ప్రవర్తన మార్చుకుంటే.. జీవితంలోనైనా సక్సెస్ అవుతుంది. బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన గీతూ తన తప్పులు తెలుసుకుని, వాటిని సరిదిద్దుకుంటుందో లేదో అన్నది చూడాలి. ఏది ఏమైనా గీతూ లేని లోటు మాత్రం బిగ్ బాస్ ఇంట్లో స్పష్టంగా కనిపిస్తుంది. రావణుడు ఉంటేనే రామాయణం సంపూర్ణం అవుతుందన్నట్టుగా.. గీతూ ఉంటేనే బిగ్ బాస్ ఆరో సీజన్ సంపూర్ణంగా ఉంటుంది. కానీ చివరకు రావణుడు అంతం కావాల్సిందే. రావణుడే అంతం అవుతాడు. ఆటలోనైనా, జీవితంలోనైనా చివరకు మంచితనమే గెలుస్తుంది.
Also Read : Adipurush Release Date : ఆదిపురుష్ వెనక్కి.. సంక్రాంతి రేస్ నుంచి అవుట్.. వంద కోట్లతో రిపేర్లు?
Also Read : Arjun complaint: విశ్వక్ హ్యాండిచ్చాడు.. మంచు విష్ణుకు అర్జున్ ఫిర్యాదు!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook